Movies

ఊర్మిళ ఒక శృంగార తార

ఊర్మిళ ఒక శృంగార తార

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ బీటౌన్‌పై వివిధ మాధ్యమాలు వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. సెలబ్రిటీలపై విమర్శలు చేస్తున్న ఆమె తాజాగా పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘జయాజీ.. ఇండస్ర్టీకి స్ర్తీవాదం నేర్పించింది నేనే. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరు కాదు. మంచి కథల్ని ఎంచుకుని ఆ చిత్రాల్లో నటించడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో.. నాకు చిన్న పాత్రలే దక్కాయి. మంచి పాత్రలు దక్కాలంటే హీరోతో సన్నిహితంగా ఉండాలి. అలా ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నా రెండు నిమిషాల నిడివిగల రొమాంటిక్‌ సన్నివేశం, ఐటమ్‌ నంబర్స్‌ దక్కేవి. మొదట్లో నన్ను అలాగే చూపించేవారు’’ అని కంగనా రనౌత్‌ అన్నారు. ఈ సందర్భంగా నటి ఊర్మిళపై కూడా కంగన మండిపడ్డారు. బీజేపీలో టికెట్‌ కోసమే కంగన ఇలా చేస్తోందన్న ఊర్మిళ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘నాకు రాజకీయ పార్టీలో టికెట్‌ పొందడం అంత కష్టమేమీ కాదని తెలివైన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన వల్ల కాకుండా శృంగారతారగానే ఊర్మిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అలాంటి ఆమే టికెట్‌ పొందితే.. నేను ఎందుకు పొందలేను’’ అని కంగనా ట్వీట్‌ చేశారు.