NRI-NRT

16దేశాల్లో వీసా ఫ్రీ

16దేశాల్లో వీసా ఫ్రీ

నేపాల్, భూటాన్, మారిషస్ సహా పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ 43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు. ‘భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం కల్పించే 16 దేశాలున్నాయి’ అని మురళీధరన్ తెలిపారు. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంగ్‌కాంగ్‌, మాల్దీవులు, మారిషస్, మాంట్సెరాట్, నేపాల్, నియుద్వీపం, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ టొబాగో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే వీసా ఆన్-అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్న 43 దేశాల్లో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ ఉన్నాయని చెప్పారు. శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా దేశాలు 36 దేశాల్లో భారత సాధారణ పాస్ పోర్టు హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా వీసా రహిత ప్రయాణం, వీసా ఆన్-అరైవల్, ఈ-వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యం కల్పించే దేశాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మురళీధరన్ తెలిపారు.