DailyDose

ఇల్లందులో యువతిపై కత్తితో దాడి-నేరవార్తలు

ఇల్లందులో యువతిపై కత్తితో దాడి-నేరవార్తలు

* ఇల్లందు సత్యనారాయణపురంలో 18 ఏళ్ల యువతి పై కత్తితో దాడి.గురువారం అర్ధరాత్రి యువతిపై కత్తి తో దాడి చేసిన 23 ఏళ్ళ యువకుడు.కత్తి తో దాడి చేసి ముళ్ల పొదల్లో పడేసిన యువకుడు.చేతులకు రక్తం అంటి పెట్రోలింగ్ పోలీసులకు తరసపడ్డ యువకుడు.యువతిపై దాడి చేసినట్లు తెలపడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని ఇల్లందు ఆస్పత్రికి తరలించిన పోలీసులు.మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి యువతి తరలింపు.

* చారిత్రక కాకతీయ యూనివర్సిటీలో మరో వివాదం చోటుచేసుకుంది.సౌత్‌ జోన్‌, ఆల్‌ ఇండియా, ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల సందర్భంగా రాజుకున్న గొడవ.. కొట్లాట వరకు వెళ్లింది.స్థానిక విద్యార్థులు, అధికారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్ ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీలో విద్యానభ్యసిస్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్‌కి పిర్యాదు చేశాడు.ఈ క్రమంలోనే గురువారం రోజున స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు.ఈ సమయంలో తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్‌ను వెంకటేష్ గట్టిగా నిలదేశాడు.దీంతో అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు.మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది.

* ఇద్దరు క్రికెట్ బుకీలు… ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగురాయుళ్లు కలిపి 10 మందిని ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు బుకీల నుండి రూ. 69,200/- నగదు, 2 సెల్ ఫోన్ లు… 8 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల నుండి రూ. 1, 30, 200/- నగదు, 5 సెల్ ఫోన్ లు మొత్తం కలిపి రూ. 1,99,200/- ల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సబంధించిన వివరాలు వెల్లడించారు.

* పదోన్నతి లభించలేదని అసంతృప్తితో కర్ణాటక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవీంద్రనాథ్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు.అటవీశాఖ అదనపు డీజీపీగా ఉన్న ఆయన బుధవారం జరిగిన ఐపీఎస్‌ల పదోన్నతుల్లో తన పేరు లేదని కినుక వహించారు.బుధవారం అర్ధరాత్రి డీజీపీ ప్రవీణ్‌సూద్‌ కు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లగా భేటీ కుదరలేదు.దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లి  రాజీనామా లేఖను అందజేశారు.

* తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం ఘాట్ రోడ్ లో పెళ్లి వ్యాన్ తిరగబడి ఏడుగురు మృతి చెందారు.