DailyDose

దేవినేని ఉమాపై కేసు నమోదు-నేరవార్తలు

దేవినేని ఉమాపై కేసు నమోదు-నేరవార్తలు

* మాజీ మంత్రి దేవినేనిపై కేసు నమోదు అయింది. ఇవాళ జక్కంపూడిలో టిడ్కో గృహాలను పరిశీలించేందుకు దేవినేని ఉమ వెళ్లారు.ఈ నేపథ్యంలో దేవినేని ఉమతో షాబాద్‌ గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.అనంతరం దేవినేని ఉమ తమను బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.షాబాద్ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దేవినేని ఉమపై పోలీసులు ఐపీసీ 505,506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

* ఏలూరులోని అంబికా సంస్థలపై సిబిఐ సోదాలు.కుటుంబ సభ్యుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.ఇదే అంబికా సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతో లోన్లు సేకరించారన్న నేపథ్యంలో తనిఖీలు.అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గృహంలో కొనసాగుతున్న సిబిఐ సోదాలు.గతంలో ఏలూరు పవర్ పేట స్టేట్ బ్యాంకు లో కూడా సిబిఐ అధికారులు సోదాలు చేపట్టిన వైనం.7 నెలల అనంతరం మరోమారు సిబిఐ అధికారులు సోదాలు.

* బాపట్ల పట్టణంలో భీమా వారి పాలెం లో ఇటీవల కారుమూరి శివరామ ప్రసాద్ ఇంట్లో రూ 16 లక్షలు నగదు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణ లు చోరీకి పాల్పడిన కేసులో నిందితురాలైన మహిళ శీలం దుర్గను అరెస్టు చేసినట్లు ప్రెస్మీట్లో డి.ఎస్.పి శ్రీనివాసరావు పట్టణ సీఐ అశోక్ కుమార్ తెలియజేశారు

* అగ్రిగోల్డ్ పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ హైకోర్టుకు ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ ఏజీ శ్రీరాం విజ్ఞప్తి చేశారు.అనుమతిస్తే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.పిటిషన్లపై విచారణ జరపాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.సోమవారం విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

* నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ 323 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు.వీరి దీక్షలకు పోటీగా మూడు రాజధానులను సమర్థిస్తూ ఏపీవ్యాప్తంగా 30 లక్షల మందికి సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ పోటీ శిబిరాలను ఏర్పాటు చేశారు.అయితే ఆ శిబిరం టెంట్ నిన్న సాయంత్రం కురిసిన గాలి, వానకు కుప్పకూలిపోయింది.మందడం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో మనుషులు ఉన్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటే గాయాలపాలయ్యేవారని స్థానికులు అంటున్నారు.నిన్న సాయంత్రం శిబిరం ఖాళీ చేశాక టెంట్ కూలిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు.ఈ రోజు ఉదయం ఈ శిబిరం ప్రారంభం కావాల్సి ఉండగా, ఇంతవరకు ప్రారంభంకాలేదని తెలుస్తోంది.

* గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట డీఎడ్ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు.విద్యార్థులకు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నేతలు మద్దతు తెలిపారు.రేపటి నుంచి జరిగే పరీక్షలకు తమకి అనుమతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.గత నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

* రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నాబ్ గోస్వామి అరెస్ట్ముంబై పోలీసులు దాడి చేసిన అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసినట్లు రిపబ్లిక్ టీవీ పేర్కొందిముంబై పోలీసులు తన ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఇంటికి ప్రవేశించి అరెస్టు చేసినట్లు రిపబ్లిక్ టివి బుధవారం తెలిపింది.అర్నాబ్ గోస్వామిని పోలీస్ వ్యాన్‌లోకి బలవంతంగా నెట్టివేసిన దృశ్యాలను రిపబ్లిక్ టీవీ చూపించింది ఉదయం 8.42 గంటలకు ఛానెల్ ట్వీట్ చేసింది”మూసివేసిన సందర్భంలో అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్కౌంటర్ కాప్ నిర్ధారిస్తుంది”.ఈ కేసు 2018 లో నమోదైన ఆత్మహత్య కేసు యొక్క సహాయంగా భావిస్తున్నారు .ముంబై పోలీసులు తనపై శారీరకంగా దాడి చేశారని గోస్వామి పేర్కొన్నారు.రిపబ్లిక్ టివి 10 మంది పోలీసులు అర్నాబ్ ఇంట్లోకి ప్రవేశించి “అర్నాబ్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ నెట్టివేసారు” అని నివేదించింది.

* ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహిబాబాద్ ప్రాంతంలోని భూపురా కృష్ణ విహార్ మురికివాడలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.