NRI-NRT

నార్వే ప్రవాసుల ఆధ్వర్యంలో “వీధి అరుగు” కార్యక్రమం

Norway Telugu NRI NRT News - Veedhi Arugu Virtual Program

మానవ జాతి అభివృద్ధి కి పరిపూర్ణమైన విజ్ఞానం, మంచి వినోదం ఏంతో అవసరం. విద్య లేని వాడు వింత పశువు అనే నానుడి పూర్వ కలం నుండి ఉంది. ఆ దిశ గానే మన గ్రామాలలోని వీధి అరుగులు అజ్ఞానాన్ని రూపు మాపి సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రాధమిక పాఠశాలలు గా రూపు చెందినవి. మారుతున్న పరిస్థితులలో, ఎంతో సమాచారం అందుబాటులో ఉన్నా, పరిపూర్ణమైన సమాచారం తెలుసుకోవటం కొంచెం కష్టతరమైన విషయం. అందునా ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవటం ఇంకా కష్టం. అటువంటి రుగ్మతను తొలిగించేదుకు నిష్ణాతులైన వ్యక్తుల తో సమాచారాన్ని నేరుగా మీకు అందించే ఈ చిరు ప్రయత్నమే ఈ మన “వీధి అరుగు”. గ్రామాలను చైతన్య పరచిన నాటి వీధి అరుగులు ప్రపంచం నలు దెసలా విస్తరించి తెలుగు వారందరికీ ఉపయుక్తం గా ఉండాలనే తలంపు తో వీధి అరుగు ….విను వీధుల గుండా విశ్వ వీధి కి వచ్చింది.
నార్వే ప్రవాసుల ఆధ్వర్యంలో