Food

కలబంద గుజ్జుతో బోలెడు ప్రయోజనాలు

కలబంద గుజ్జుతో బోలెడు ప్రయోజనాలు

ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన మూలిక కలబంద. సాధారణంగా దీనిని గార్డెన్‌లో అందంకోసమే పెంచుతుంటారు చాలామంది. కొంతమంది కొత్తగా కట్టిన ఇళ్లకు, భవంతులకు కూడా దీన్ని దృష్టి దోషనివారణ కోసం కడుతుంటారు. ఒక చిన్న మొక్కను తెచ్చి మీ పెరటిలో నాటి అప్పుడప్పుడూ నీళ్లు పోసినా ఏపుగా ఎదుగుతుంది. ఇంత సులువుగా పెరిగే మొక్కతో మనకెన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా! కలబంద శరీర ఆరోగ్యానికీ, గాయాలు మాన్చడానికి, చర్మరోగాలు నివారించడానికి, చర్మసౌందర్యాన్ని వృద్ధిచేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, మధుమేహవ్యాధి, గుండెపోటు, రక్తపోటు, కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు నివారించడానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
1.కలబంద మట్టని చీల్చితే గుజ్జు వంటి పదార్థం వస్తుంది. దానిని రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం మీది మచ్చలూ, గంట్లూ పోయి ముఖం నాజూకుగా తయారవు తుంది.
2.రోజూ 10మి.లీ. కలబంద రసాన్ని తాగితే చర్మవ్యాధులు దరికి చేరవు. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
3.దీని గుజ్జును చర్మానికి రాసుకొంటుంటే వయస్సు ద్వారా శరీరానికి వచ్చిన ముడతలు తగ్గుతాయి. గుజ్జు తయారుచేసుకోవడానికి వీలులేనప్పుడు అలోవీరాతో తయారుచేసిన సబ్బులను ఉపయోగిస్తే మంచిది.
4.దీనితో ముఖం మీది మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. వాటి తాలూకూ మచ్చల్ని కూడా కలబందతో పోగొట్టవచ్చు.
5.పసుపుతో కలిపి నూరిన ముద్దను ఎండకు నల్లబడిన చర్మంపై రాస్తే తెల్లబడుతుంది. శరీరంపై ఉండే జిడ్డుతనాన్ని కూడా తగ్గిస్తుంది.
6.పెరుగుతో కలిపి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేస్తుంటే జుట్టు వత్తుగానూ, అందంగాను పెరుగుతుంది. జిడ్డుగా ఉండే జుట్టు కలవారు పైన చెప్పిన మిశ్రమంలో పుల్లర్స్‌ ఎర్త్‌ను కూడా కలుపుకోవాలి.
7.ఒక కలబంద మట్టకు ఆముదం రాసి మీ ఇంట్లో ట్యూబ్‌లైట్‌కు దగ్గరగా వ్రేలాడకట్టండి. దోమలు మొదలైన కీటకాలు వాటికి అంటుకుని చనిపోతాయి.
8.శరీరం కాలినప్పుడు కలబంద ఆకురసాన్ని వ్రాస్తే అది పుండును తగ్గించడమే కాక మచ్చ పడకుండా చేస్తుంది.
9.లంగోటాల వల్ల ఒరుసుకొనిపోయి తొడలపై పుండు ఏర్పడితే కలబంద రసంలో బాదం నూనెను కలిపి గాయాలకు రాయాలి. బాధ తగ్గి పుండ్లు త్వరగా మానిపోతాయి.
10.చెప్పులు కరిచినప్పుడు, పురుగులు కరిచినప్పుడు ఏర్పడ్డ గాయాలకి కలబంద రసం రాస్తే నొప్పి, గాయం కూడా తగ్గుతాయి.
11.చిన్నదెబ్బలకి, తెగినప్పుడూ, చర్మం కొట్టుకొనిపోయినప్పుడు దీనిని రాస్తే ఇన్‌ఫెక్షన్‌ రాకుండా అరికడుతుంది.