DailyDose

లంచావతార కార్యదర్శిపై ఏసీబీ దాడులు-నేరవార్తలు

ACB Raids Grade 1 EO In Sreekakulam

* శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి, రణస్థలం మండలంలో గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకటరావు ఇంటిపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అతనితో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాకుళం, విజయనగరంతో పాటు విశాఖలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.35,67,100 నగదు, రూ.17,65,373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

* ఆధార్‌ సేవా కేంద్రాలు కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేలిముద్రలు, ఐరిస్‌ను పరిశీలించే స్కానర్లు ఇందుకు దోహదపడుతున్నాయి. మీసేవా, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాలు నడిపించే సిబ్బంది నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కొవిడ్‌కు గురవుతుండటమే ఇందుకు నిదర్శనం. వినియోగదారులు సైతం ప్రభావితమవుతున్నారు. రక్షణ చర్యల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోంది. వేలి ముద్రల సమస్యతో ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వృద్ధులు, కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునే చిన్నారులు మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

* దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఎట్టకేలకు బెయిల్ లభించింది.

* తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.