Business

ఆడపిల్లలకు ఆర్థిక భద్రత…సుకన్య పథకం-వాణిజ్యం

Sukanya Samruddhi Yojana Scheme India

* కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. ఇందులో పొదుపు చేసిన నగదుపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది. సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.
Sukanya Samruddhi Yojana

* మానసిక అనారోగ్య చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన మెంటల్‌ హెల్త్‌కేర్‌ చట్టం 2017 ప్రకారం బీమా సంస్థలు ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేవని చెప్పింది. పరిహారాన్ని నిరాకరించడం చట్ట లక్ష్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. బీమా సంస్థలు చట్ట ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఐఆర్‌డీఏదేనని పేర్కొంది. ఒకవేళ నియంత్రణ సంస్థ పట్టించుకోకపోతే.. చట్ట ప్రకారం దానిపైనా చర్య తీసుకునేందుకు వీలుందని తెలిపింది. స్కిజోఫ్రినియా చికిత్సకు సంబంధించి నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక మహిళ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ తీర్పును వెల్లడిస్తూ.. ఐఆర్‌డీఏ బీమా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని అర్థం అవుతోందన్నారు. మహిళకు రూ.6.67 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా బీమా సంస్థను ఆదేశించడంతోపాటు, మరో రూ.25,000 అదనంగా చెల్లించాలని తీర్పిచ్చారు.

* కరోనా కారణంగా కంపెనీల మూలధన నిర్వహణపై ప్రభావం పడుతోంది. అగ్రగామి-500 నమోదిత కంపెనీల నగదు చక్రం ఆరు రోజుల పాటు పెరిగిందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంటోంది. ‘ఒక కంపెనీ ముడి పదార్థాలు, ఇతర వనరులపై పెట్టిన పెట్టుబడులు.. విక్రయాల అనంతరం నగదు రూపంలో తిరిగి కంపెనీకి వచ్చే కాలాన్ని’ నగదు చక్రం (క్యాష్‌-టు-క్యాష్‌ )గా పరిగణిస్తారు.

* కొవిడ్‌-19 వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన ధోరణి బాగా మారింది. రద్దీగా ఉన్న దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే బదులు ఇంటి దగ్గరే కూర్చుని ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందువల్లే ఇ-కామర్స్‌ సంస్థల అమ్మకాలు గతేడాది కాలంలో గణనీయంగా వృద్ధి చెందాయి. కొవిడ్‌ రెండోదశ విజృంభణ నేపథ్యంలో, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటివే కాకుండా నిత్యావసరాలు, ఔషధాల వంటి విభాగాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్లు జోరందుకుంటున్నాయి. అయితే ఉత్పత్తులు అందించే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణా ముఖ్యమైన అంశం అవుతోంది.