Business

బంజారాహిల్స్‌లో హవాలా కేసు-వాణిజ్యం

బంజారాహిల్స్‌లో హవాలా కేసు-వాణిజ్యం

* పనిచేయని వ్యాపార సంస్థల పేరుతో బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ న్యాయవాది బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లో నివసించే వ్యాపారి ప్రమోద్‌కుమార్‌ పచ్వా పలు బ్యాంకుల్లో అనేక వ్యాపార సంస్థల పేరుతో ఖాతాలు నిర్వహించి నల్లధనాన్ని మార్చుతున్నాడని పిల్లా రామలింగేశ్వరరావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల సాయంతో మూతబడిన సంస్థల పేరుతో ఖాతాలు నిర్వహిస్తూ వాటి ద్వారా నల్లధనాన్ని మార్చుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని నగర కమిషనర్‌కు, బంజారాహిల్స్‌ ఇన్పెక్టర్‌కు, సీఐడీ విభాగం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోకూడా అనేక అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి రావడంతో ఏపీ ముఖ్యమంత్రితోపాటు అక్కడి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు.

* సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్, మరో రెండు ఇతర బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ జరిమానా విధించింది. వ్యవసాయ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను పాటించని కారణంగా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.1 కోటి జరిమానా విధించింది. అలాగే, సైబర్ సెక్యూరిటీ విషయంలో నిబందనలు పాటించని కారణంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పై రూ.1 కోటి జరిమానా వేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కళ నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో నేడు భారీ లాభాలతో దేశీ సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 49834.00, నిఫ్టీ 150001.50 వద్ద ఉన్నాయి. గత పద్దెమినిది రోజులుగా ఇంధన ధరల్లో నిర్దిష్టమైన పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. బీపీసీఎల్‌, ఐఓసీ, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.02 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

* కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ సంబంధిత తప్పుడు సమాచారాన్ని, అలాగే తమ నిబందనలు ఉల్లంఘించిన ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల కంటెంట్‌/పోస్టులను తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు తన కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ తాజా ఎడిషన్‌లో తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, నగ్నత్వం, లైంగిక వంటి కార్యకలాపాలతో సహా ఇతర 12 ఫేస్‌బుక్ విధానాలను, 10 ఇన్‌స్టాగ్రామ్ విధానాలను ఉల్లంఘిస్తే సీఎస్‌ఇఆర్ చర్యలు తీసుకుటుంది.