Politics

డీసీపీపై నెటిజన్ల గుస్సా-నేరవార్తలు

Netizens Fire Against DCP Rakshitha Over Seetakka

* డీసీపీ రక్షితపై సీతక్క ఫైర్..భగ్గుమంటున్న నెటిజన్లు.ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను అభిమానిస్తుంటారు.ఆమె పేద ప్రజలకు చేసే సేవలు ఎందరికో ఆదర్శం ఇక రీసెంట్ ఆమె తల్లికి కరోనా వచ్చింది.పరిస్థితి విషమించడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.అయితే బ్లడ్ ఇచ్చేందుకు సీతక్క కుటుంబ సభ్యులు పర్మిషన్‌తో హైదరాబాద్ వెళ్తుండగా మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకున్నారు.దీనిపై సీతక్క చాలా ఆవేదన వ్యక్తం చేశారు.తాను ఒక ఎమ్మెల్యేగా ఎంతోమందికి సేవ చేస్తుంటే తన తల్లికి బ్లడ్ అవసరమై హైదరాబాద్ కు వస్తున్న తన బంధువులను అడ్డుకోవడం దారుణమన్నారు.డీసీపీ రక్షిత తన బంధువులను దాదాపు 30నిముషాలు అపేశారని చెప్పారు.తాను వీడియో కాల్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ డీసీపీ రక్షిత వినిపించుకోలేదని, ఒక ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే సాధారణ జనం పరిస్థితి ఏంటని సీతక్క ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.దీంతో నెటిజన్లు డీసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఆపదలో ఉన్న వారిపై ఇలా చేయడం మంచిది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

* ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీలకు లేఖ రాశారు.తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు.రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు.దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు.అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి  పలువురు ఎంపీలు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.జగన్‌ ప్రభుత్వానిది హిట్లర్‌ పాలనగా కాంగ్రెస్‌ ఎంపీ మానిక్కం ఠాగూర్‌ అభివర్ణించారు.రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామ నిరాకరించారు.అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆయన బుధవారం రాత్రి ఇక్కడ 9.20 గంటలకు స్పీకర్‌ను కలిశారు.దాదాపు అర్ధ గంట సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.తన కేసులో సీఎం జగన్‌రెడ్డి, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌,ఏడిషినల్ ఎస్పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

* విశాఖ మధురవాడలోని ఐదోవార్డు మారికవలస గ్రామంలో మూడేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మారికవలస గ్రామానికి చెందిన లారీ క్లీనర్‌ రమేశ్‌కు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో 2016లో వివాహమైంది. అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వరలక్ష్మికి అక్రమ సంబంధం ఉందని రమేశ్‌ అనుమానిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కాగా, మూడు నెలల క్రితం పాపతో సహా వరలక్ష్మి వేరే వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా బుధవారం వరలక్ష్మి రమేశ్‌కు ఫోన్‌చేసి పాప చనిపోయిందని తెలిపింది. దీంతో ఆవేదన చెందిన రమేశ్‌.. కుటుంబ సభ్యులతో కలిసి భార్య వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు. పాప మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. భార్యే తన కుమార్తెను చంపిందని రమేశ్‌ ఆరోపిస్తున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

* బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. 2020 జూన్‌ 14న సుశాంత్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్‌ కేసు దర్యాప్తులో డ్రగ్స్‌ వ్యవహారం వెలుగు చూసింది. అది కాస్తా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీఐ, ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో), ఈడీ, (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో మరో ముందడుగు పడింది. డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది.