Politics

గ్రూప్-1 ప్రక్రియపై ఏపీ హైకోర్టు స్టే-తాజావార్తలు

గ్రూప్-1 ప్రక్రియపై ఏపీ హైకోర్టు స్టే-తాజావార్తలు

* గ్రూప్‌-1 ఇంటర్వ్యూ పక్ర్రియను నాలుగు వారాలపాటు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన ఎనిమిది వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ పక్రియ వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూషన్‌ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్‌ ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్‌ వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిన్న తీర్పును రిజర్వులో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్‌ -1 ఇంటర్వ్యూలను నాలుగు వారాలపాటు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ.. ఇంటర్వ్యూల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

* గ్రూప్‌-1 ఇంటర్వ్యూ పక్ర్రియను నాలుగు వారాలపాటు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన ఎనిమిది వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ పక్రియ వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

* పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని.. ప్రతి ఇల్లు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రాచర్ల బొప్పాపూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. కాళేశ్వరం నీటితో సిరిసిల్ల త్వరలో కోనసీమలా మారబోతోందన్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో రూ.కోటి నిధులతో త్వరలో ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు.

* ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా అవినీతిపరుల కోసం పనిచేస్తున్నారని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘సర్కారు వారి దొంగలు’ పేరిట ఆయన కొత్త పథకం తీసుకొచ్చి రాష్ట్రాన్ని తన అవినీతి కేసుల్లో ఉన్న సహనిందితులకు దోచి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘నీకిది నాకిది (క్విడ్‌ ప్రోకో)’ ప్రాతిపదికన వేల కోట్లు దోచకున్న జగన్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే క్విడ్ ప్రో కో-2 కు తెరలేపారని ఆరోపించారు.

* రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వాడుతున్నవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు రెండు డోసులు పొందిన 8 వారాల తర్వాత మూడో డోసు టీకాను కూడా తీసుకుంటే మేలని ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం ‘కొవిడ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలు.. భవిష్యత్‌ వ్యూహాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు. కొవిడ్‌ను ప్రధానంగా రెండుదశలుగా విభజించాలి. తొలివారంలో వైరీమియా.. అంటే ఈ రోజుల్లో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో లక్షణాలు కనిపిస్తున్నప్పుడు రెమ్‌డెసివిర్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీల తరహా చికిత్సలను అందించాలి.

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వస్తున్న తరుణంలో మూడో పొంచి ముప్పు ఉందన్న హెచ్చరికలతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కష్ట కాలంలో వైద్యులకు సహాయపడేందుకు వీలుగా 5000 మంది యువకులకు హెల్త్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం వెల్లడించారు. కరోనా రెండు దశల్లోనూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కొరత కనబడిందని, అందువల్ల వైద్యులు/ నర్సులకు సహాయపడేందుకు 5వేల మంది సహాయకులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

* తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండవంటారు.. ! మన పొరుగు దేశమైన చైనా తీరు ఇలానే ఉంది. నిత్యం ఏదో ఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకోకపోతే ఆ దేశ సైన్యానికి పొద్దుపోదు అన్నట్లుంది. ఓ పక్క భారత్‌తో ఏడాదిగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్‌తో గొడవ పెట్టుకొంది.. ఈ నెల మొదట్లో ఇండోనేషియా గగనతలంలోకి చొరబడింది.. గత వారం ఇండోనేషియా జలాల్లోకి చైనా సర్వే నౌక వెళ్లింది. నేడు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి చైనా విమానాల దండు వెళ్లింది. ఏదో యుద్ధానికి బయల్దేరినట్లు పాతిక విమానాలు ఈ జోన్‌లోకి చొరబడ్డాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నాలుగు హెచ్‌-6 బాంబర్లు, 14 జె-16,ఆరు జె-11 ఫైటర్‌ జెట్‌లు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌కు వినియోగించే ఎర్లీవార్నింగ్‌ యుద్ధవిమానాలు ఉన్నాయి.

* కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి పెంపుపై ఇటీవలు కొద్ది రోజులుగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు స్పష్టతనిచ్చింది. శాస్త్రీయపరమైన డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచామని, ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి పెంపుపై శాస్త్రీయ డేటా ఆధారంగా చాలా పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడానికి భారత్‌కు చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను రాజకీయం చేయడం దురదృష్టకరం’’ అని హర్షవర్ధన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

* సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయడం అంత శ్రేయస్కరం కాదని ఇటీవలి ఉదంతాలు చాటుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫైల్‌ లాక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి సామాజిక మాధ్యమాలు. అయినా వాటిలోని చిన్న చిన్న బగ్స్‌ సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంలా మారుతున్నాయి. అలాంటి ఓ బగ్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాడు ఓ 21 ఏళ్ల యువకుడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు ఖాతాలను ఫాలో అవ్వకుండానే వారి ఫొటోలు, వివరాలు తస్కరించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం, వేధింపులకు పాల్పడడం వంటి నేరాలకు వీలు కల్పించేలా ఈ బగ్‌ ఉపయోగపడుతుందని గుర్తించాడు. దీంతో ఇన్‌స్టా మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి ఏకంగా ₹22 లక్షలు అందుకున్నాడు.

* కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో వేగవంతమైన, పూర్తి వ్యాక్సినేషన్‌ కావాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు. భాజపా మార్కు ప్రాస నినాదాలు, అవాస్తవ ప్రచారాలు అవసరం లేదని పేర్కొంటూ బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగినన్ని టీకా డోసుల సరఫరా చేయడంలో భారత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల టీకాల కొరత ఏర్నడిందని ఆరోపించారు. మోదీ ప్రతిష్ఠను కాపాడేందుకు ప్రభుత్వ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ వైరస్‌ వ్యాప్తిని పెంచడానికి దోహదపడుతున్నాయని.. తద్వారా అధిక సంఖ్యలో ప్రజలు కొవిడ్‌ మహమ్మారికి బలవుతున్నారని ధ్వజమెత్తారు.

* లోహ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు వెనుకబడడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో గత నాలుగు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడడం సూచీలను కిందకు దిగజార్చింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకు దిగజారుతూ పోయాయి. చివరకు సెన్సెక్స్‌ 271 పాయింట్లు కుంగి 52,501 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు దిగజారి 15,767 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.30 వద్ద నిలిచింది.

* ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా అవినీతిపరుల కోసం పనిచేస్తున్నారని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘సర్కారు వారి దొంగలు’ పేరిట ఆయన కొత్త పథకం తీసుకొచ్చి రాష్ట్రాన్ని తన అవినీతి కేసుల్లో ఉన్న సహనిందితులకు దోచి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పదో రోజు సీబీఐ విచారణ కొనసాగింది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా నేతలు లక్ష్మీకర్‌, రమణ.. సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. జగదీశ్వర్‌రెడ్డి గతంలో వివేకాకు పీఏగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

* సీఐఎస్‌సీఈ (ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌) 12వ తరగతి పరీక్ష ఫలితాలు జులై 20 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 11, 12వ తరగతుల విద్యార్థులకు అంతర్గత మదింపు ద్వారా మార్కులు కేటాయించి ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను కూడా కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. 12వ తరగతి ఫలితాల వెల్లడికి అనుసరిస్తున్న విధానంపై నివేదికను సీబీఎస్‌ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకు అందించనున్నట్టు సమాచారం. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు ప్రకటించడంలో ఏవిధమైన ప్రక్రియను అవలంబిస్తున్నారో చెప్పాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల తొలివారంలో విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీఈలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారనే అంశాన్ని నివేదిక ద్వారా సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ బోర్డు వివరించనుంది.