Business

పాన్ కార్డ్ పోయిందా? – వాణిజ్యం

పాన్ కార్డ్ పోయిందా? – వాణిజ్యం

* ఉద్యోగ కల్పనే లక్ష్యంగా బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన అంకుర సంస్థ ‘అప్నా’ యాప్‌లోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కార్మికులు, అసంఘటిత రంగంలోని ఉద్యోగులు, నైపుణ్యం అవసరం లేని ఉద్యోగులకు ఉపాధి చూపడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థలోకి టైగర్‌ గ్లోబల్, ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌ 70 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (సుమారు రూ. 513 కోట్లు) పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ నిధులతో సంస్థ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు సాంకేతికతను మెరుగుపరచడం, ప్రతిభ గల ఉద్యోగులను నియమించుకోవడం, అమెరికా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు సంస్థ కార్యకలాపాలను విస్తరించడానికి తాజా నిధులను వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన అనేక మందికి అప్నా ద్వారా ఉద్యోగ అవకాశాలను చేరువ చేస్తున్నామని పేర్కొంది.

* కారంటే మునుప‌టి రోజుల్లో ల‌గ్జ‌రీ.. ఇప్పుడు అవ‌స‌రం. కారు కొనుగోలు అంత సుల‌భమేమీ కాకపోయినప్పటికీ వివిధ బ్యాంకులు ఇస్తున్న వాహ‌న రుణాలు వాటి కొనుగోలు పట్ల ఆసక్తి చూపేలా చేస్తున్నాయి. తక్కువ వడ్డీలో రుణాలు లభిస్తున్నాయన్న కారణంతో ముందుకెళ్లకుండా బ్రేక్‌ వేయాలంటున్నారు నిపుణులు. కారు కొనేముందు మన బ‌డ్జెట్‌ (ఆదాయం, అప్పులు, బాధ్యతలు)ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయ‌డం మంచిదని సూచిస్తున్నారు. సాధార‌ణంగా ఇల్లు కొనుగోలు అనేది పెద్ద నిర్ణ‌యం. ఖ‌ర్చు ఎక్కువ. రుణం తీసుకుంటే చాలా సంవ‌త్స‌రాలు ఈఎమ్ఐ చెల్లించాలి. దీని త‌రువాత తీసుకునే పెద్ద నిర్ణ‌యాల్లో కారు రుణం ఒక‌టి. అందులోనూ ఇది డిప్రిసియేష‌న్ ఎసెట్‌. కాలగుడుస్తున్న కొద్దీ ఉప‌యోగిస్తున్న కొద్దీ విలువ త‌గ్గుతుంది. అందువ‌ల్ల భారం కాదు, ఖర్చును భరించగలం అనుకున్నప్పుడు మాత్రమే ఖర్చు చేయడం వివేకం. అందుకే కారు కొనేముందు బడ్జెట్‌ ఎంత అనేది తెలుసుకోవడంతో పాటు, అనుకున్న బడ్జెట్‌కు మనం ఎంత కట్టుబడి ఉన్నామన్నది ముఖ్యం.

* మన ఆర్థిక లావాదేవీల్లో పాన్‌ కార్డు భాగంగా మారిపోయింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ పూర్తి చేయ‌డానికి పాన్ అవ‌స‌రం. అయితే అనుకోకుండా పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే ఎలా? నంబర్‌ కూడా గుర్తు లేకపోతే ఏం చేయాలి? దీనికి పరిష్కారమే ఇ-పాన్‌. పాన్‌ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది ఆదాయపు శాఖ విభాగం. ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్‌తో దీన్ని పొందొచ్చు. పాన్ కార్డ్ సంఖ్య గుర్తు లేక‌పోయినా ఇది వరకే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉంటే ఇట్టే ఇ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* లోహ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు వెనుకబడడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో గత నాలుగు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడడం సూచీలను కిందకు దిగజార్చింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకు దిగజారుతూ పోయాయి. చివరకు సెన్సెక్స్‌ 271 పాయింట్లు కుంగి 52,501 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు దిగజారి 15,767 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.30 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ 30 సూచీలో సెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫినాన్స్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి