Politics

కత్తి మహేష్‌కు భారీ ప్రమాదం-నేరవార్తలు

కత్తి మహేష్‌కు భారీ ప్రమాదం-నేరవార్తలు

* చెన్నై– కలకత్తా రహదారిపై తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు.– ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేష్.ప్రమాడంలోమహేష్ తలకు తీవ్ర గాయాలు.– స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు.– మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంట హాస్పిటల్ వైద్యులు.– మరికొన్ని గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెబుతున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం.– ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.– డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో కత్తి మహేష్ గా గుర్తించిన పోలీసులు, హై వే పెట్రోలింగ్ సిబ్బంది.– హుటాహుటిన మెడికల్ హాస్పిటల్ కు తరలింపు.

* పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగుల కోసం బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ బాగోతం బట్టబయలైంది. ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంక్ లో సదరు బ్యాంక్ మేనేజర్ రూ. 30 లక్షలు స్వాహా చేశాడు. సదరు బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తోన్న నాగరాజు 30 లక్షల రూపాయలు వేరే ఖాతాలకు మళ్ళించినట్లు అధికారులు గుర్తించారు.ఈ సొమ్మంతా 40 మంది రైతుల క్రాప్ లోన్ మనీ అని బ్యాంక్ ఉన్నతాధికారులు తేల్చారు. నేరం రుజువు కావడంతో అసిస్టెంట్ మేనేజరు నాగరాజును యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు మీద పోలీసు కేసు పెడతామని బ్యాంకు అధికారులు తెలిపారు

* మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీకి అనుబంధంగా మిలీషియాలో పనిచేస్తున్న నలుగురిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు.భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ వివరాల ప్రకారం…..శుక్రవారం ఉదయం చర్ల మండల పరిధిలోని బత్తినపల్లి – రామచంద్రపురం గ్రామాల మధ్య అటవీ ప్రాంతలో చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా అనుమానస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు.వీరు చర్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కుంజం దేవయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పుట్టపాడుకి చెందిన కలుము సురేశ్, బీజాపూర్ జిల్లా మెట్టగూడ గ్రామానికి చెందిన కొవ్వాసి చుక్క, బీజాపూర్ జిల్లా ఇర్రపల్లికి చెందిన పొడియం మాసయ్య అనే ఈ నలుగురు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.మిలీషియా కమాండర్ వెట్టి దేవా అలియాస్ బాలు ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీకి పని చేస్తూ, చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలలో నిందితులుగా ఉన్నారని ఏఎస్పీ తెలిపారు.ఈ మేరకు వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.విలేకరుల సమావేశంలో చర్ల సీఐ బి.అశోక్, ఎస్ఐ టి.వెంకటప్పయ్య, సీఆర్పీఎఫ్ అధికారి పాల్గొన్నారు.

* వైఎస్‌ వివేకా హత్యకేసులో 20వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇద్దరు వైద్యులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.వీరు వివేకా మృతదేహానికి పోస్టుమార్టాన్ని నిర్వహించారు.ఆరోజు మృతదేహం ఉన్న తీరుతో పాటు శరీరంపై గాయాలు, ఇతర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.20 రోజులుగా నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు. ఇప్పుడు మృతదేహం ఆధారంగా హత్యోదంతాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.