Devotional

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కాణిపకం ఛైర్‌పర్సన్ నియామకం-తాజావార్తలు

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కాణిపకం ఛైర్‌పర్సన్ నియామకం-తాజావార్తలు

* తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ పదవిలో మార్పు..నూతన చైర్పర్సన్గా వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి సతీమణి మహాసముద్రం లత రెడ్డి నియామకం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

* ‘విశాఖ ఉక్కు’ ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమన్నారు.

* శాకంబరీదేవిగా కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మ… ,పండ్లతో ప్రత్యేక అలంకరణ

* నవతరం క్షిపణి ఆకాశ్-ఎన్‌జీని డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే అభివృద్ధి చేశారు.భూమి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు ఉపయోగపడే ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ నుంచి ప్రయోగించారు.ఇది 30 కిలోమీటర్ల పరిధిగల గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ. దీనిని భారత వాయు సేనలో ప్రవేశపెడితే మన దేశ గగనతల రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుంది.

* బీజేపీకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా.మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల సమావేశానికి సైతం హాజరయ్యారు.పార్టీనేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్‌కు వెళ్లటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపత్తి ప్రకటించారు.ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి వెల్లడించారు.పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మనస్థాపానికి గురయ్యానని, దళిత ఎంపవర్మెంట్ మీటింగ్ పోతే నాపై వివాదం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఈటల చేరిక విషయం లో విభేదించిన మోత్కుపల్లి పార్టీలో దళితుల భాగస్వాయం లేదని ఆరోపించారు.

* బెయిల్‌ ఉత్తర్వులు ఇక వేగంగా అమలు చేసేందుకు హైకోర్టు నూతన విధానాన్ని రూపొందించింది.ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల.వెబ్‌సైట్‌ నుంచి ప్రతుల డౌన్‌లోడ్‌కు హైకోర్టు ఆదేశాలు.న్యాయాధికారులు అదేరోజు ఉత్తర్వులను మెయిల్‌లో జైలు అధికారులకు పంపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత కీలక మార్గదర్శకాలు జారీ.ఈనెల 26 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తాయని స్పష్టం.

* మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేసిన విజయనగరం వన్‌టౌన్ పోలీసులు.మాన్సాస్ చైర్మన్, కరస్పాండెంట్‌తో సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు.ఈవో వెంకటేశ్వరరావు తమ వేతనాలు నిలిపేశారంటూ.. 3 రోజులక్రితం మాన్సాస్ చైర్మన్ ను కలిసిన ఉద్యోగులు.కష్టం వచ్చిందని చెప్పుకునేందుకు వెళ్లిన తమతోపాటు మాన్సాస్ చైర్మన్ పై కేసు పెట్టారంటూ ఉద్యోగుల ఆగ్రహం.

* భారీ వర్షాలు రైలు ప్రమాదానికి కారణమయ్యాయి.గోవాలోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం వద్ద ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడం వల్ల కర్ణాటకలోని మంగళూరు నుంచి మహారాష్ట్ర ముంబయి వెళ్తున్న రైలు సోనాలిమ్, దూద్​సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఉపముఖ్యమంత్రి బాబు అజ్​గోయంకర్​ ఘటనా స్థలిని సందర్శించి, సహాయక చర్యలు సాగుతున్న తీరును పరిశీలించారు.

* గురువారం ఐటీ శాఖ మంత్రి నుంచి పత్రాలు లాక్కొని చింపివేసిన టీఎంసీ ఎంపీ శంతను సేన్​పై సస్పెన్షన్ వేటు పడింది.

* జ‌మ్మూలో డ్రోన్ కూల్చివేత‌.. పేలుడు ప‌దార్ధాలు స్వాధీనం. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌నాచ‌క్‌లో శుక్ర‌వారం డ్రోన్‌ను కూల్చివేశారు.

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ. ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్.