NRI-NRT

డల్లాస్ పేద విద్యార్థులకు బ్యాగులు అందించిన తానా

డల్లాస్ పేద విద్యార్థులకు బ్యాగులు అందించిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్ విభాగ ఆధ్వర్యంలో Hurst-Euless-Bedford Independent పాఠాశాలల్లోని పేద విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల పర్యవేక్షకుడు స్టీవ్ చాప్ మాన్, తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూరలు ముఖ్య అతిథులుగా పాల్గొనగా బోర్డు సభ్యుడు మురళి వెన్నం, తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, మాజీ ఫౌండేషన్ ట్రస్టీ అనిల్ వీరపనేని, మాజీ రీజినల్ కోఆర్డినేటర్ సాంబ దొడ్డా, కమిటీ సభ్యులు లెనిన్ తాళ్లూరి, రాజా నల్లూరి తదితరులు హాజరయ్యారు. తానా మాజీ అధ్యక్షుడు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ ఆలోచన నుండి ప్రారంభమయిన ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు లబ్ధి చేకూరడం పట్ల స్కూలు సిబ్బంది తానాకు ధన్యవాదాలు తెలిపారు.