Agriculture

రైతుల తలలు పగలగొట్టిన పోలీసులు-నేరవార్తలు

రైతుల తలలు పగలగొట్టిన పోలీసులు-నేరవార్తలు

* తీన్మార్ మల్లన్న 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సికింద్రాబాద్ కోర్టు.IPC 306, 511 సెక్షన్స్ పెట్టడం పై అభ్యంతరం తెలిపిన తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది.పిర్యాదుదారుడు ఎలాంటి సూసైడ్ అట్టెంట్ చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది. పరిశీలిస్తామన్న కోర్ట్.7 రోజుల పాటు కస్టడీ కి కోరిన చిలకలగూడా పోలీసులు.బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న తీన్మార్ నవీన్ తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర.చంచల్ గూడ జైల్ కి తరలింపు.

* శాంతియుతంగా చేస్తున్న ధర్నాను ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు ఉన్నట్టు, హర్యానా రాష్ట్రం కర్నూలు జిల్లాలో నిరాయుధ రైతులు పై పోలీస్ బలగాల ద్వారా లాఠీ ఛార్జ్ చేసి అక్కడ ధర్నా చేస్తున్న రైతులని తీవ్ర గాయాల పాలు చేశారు, పలువురు రైతు సంఘ నాయకులను రైతు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను తీవ్రంగా కొట్టి వారిని అదుపులోకి తీసుకోవడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ (ఆ) తీవ్రంగా ఖండిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న రైతు నాయకులను రైతులను బేషరతుగా విడిచిపెట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేస్తుంది,

* సికింద్రాబాద్‌…బోర్డు తిప్పేసిన భవనీ ఎంటర్‌ ప్రేజేస్‌ చీట్‌ ఫండ్‌ కంపేనీ..కోట్ల రుపాయలు చిట్టిలు,ఫిక్సుడు డిపాజిట్‌ ల పేరుతో ఎరా వేసిన శ్రావణ్‌ కుమార్‌ అనే యజమాని..భాదితులుగా ఉన్న డాక్టర్లు,రిటైర్మెంట్‌ ఉద్యోగులు,వ్యాపారులు..వారం రోజులుగా ఫోన్‌ లిఫ్ట్‌చేయకపోవడంతో మారేడుపల్లి లోని నివాసం కు వచ్చిన భాదితులు..ఇళ్ళు ఖాళీగా ఉండడంతో లబోదిబోమంటున్నా భాదితులు..50 కి పైగా భాదితుల నుంచి 20 కోట్ల మెర వసూలు చేసిన శ్రావణ్‌..Hyd CCS లో ఫిర్యాదు చేయాలని సూచించిన మారేడ్ పల్లి పోలీసులు.

* నర్సాపురం మండలంలో విషాదం…అర్థరాత్రి ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం…ఈ ప్రమాదంలో తండ్రి… కుమారుడు(5) మంటల్లో సజీవదహనం…పీఎం లంకలో ఘటన…ఘటనకు గల కారణం గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమని స్థానికులు అనుమానం…ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* కనిగిరి నగర పంచాయితీ పరిధిలోని అర్బన్ కాలనీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి మోటారు సైకిల్ ను లారీ ఢీకొట్టడంతో బైక్ పైన వస్తున్న లక్కీ అనే యువకుడు మృతి.