Politics

రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా-నేరవార్తలు

రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా-నేరవార్తలు

* సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పరువునష్టం దావా.ఈడీ దర్యాప్తు కేసుతో తనకు ఎలాంటి సంబందంలేదం లేదని దురుద్దేశంతో నాపేరు వాడుతున్నాడు.దుష్ప్రచారం వల్ల కలిగిన కలిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరిన కేటీఆర్.క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను సైతం ప్రారంభించాలని కోరిన కేటీఆర్.న్యాయస్థానం నిందితులకు తగిన శిక్ష విదుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్.సంబందంలేని విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి పై పిటిషన్.

* అఫ్ఘాన్‌ నుంచి విజయవాడకు అక్రమ రవాణా చేస్తున్న రూ.9 వేల కోట్ల హెరాయిన్.టాల్కం పౌడర్‌ పేరిట కంటైనర్లలో తరలింపు.గుజరాత్‌ పోర్టులో సీజ్‌ చేసిన అధికారులు.అదుపులో ఏడుగురు.. అందులో ఇద్దరు అఫ్ఘాన్‌ జాతీయులు.బెజవాడలోని ఆశి ట్రేడింగ్‌ కంపెనీ పేరిట బుకింగ్‌.సత్యనారాయణపురంలో కేంద్ర సంస్థల సోదాలు.సుమారు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ అఫ్ఘానిస్థాన్‌ నుంచి విజయవాడకు టాల్కం పౌడర్‌(ముఖానికి రాసుకునే పౌడర్‌) పేరిట కంటైనర్‌లలో అక్రమంగా రవాణా అవుతుందగా గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో ఉన్న ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌), నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సీజ్‌ చేశారు.అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌కు చెందిన హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ అనే సంస్థ వీటిని పంపినట్టు గుర్తించారు.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్‌ ఫర్మ్‌ అనే సంస్థ వీటిని బుక్‌ చేసుకుంది.కన్‌సైన్‌మెంట్‌లో పేర్కొన్న అడ్రస్‌ మేరకు విజయవాడలోని సత్యనారాయణపురం వెళ్లిన అధికారులకు అక్కడ ఓ డాబా ఇల్లు మాత్రమే కనిపించడం విశేషం.దీనిపై డీఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు గత ఐదు రోజులుగా దర్యాప్తు జరుపుతున్నారు.అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌..ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌తో విజయవాడకు లింకులున్నాయా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.ఇరాన్‌కు చెందిన రెండు నౌకల్లో భారత్‌కు వస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను నిఘా పెట్టి గుజరాత్‌లో పట్టుకున్నారు.ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు నుంచి బందరు పోర్టుకు దిగుమతి చేసుకొంటున్నట్లు తేలింది.988 కిలోల చొప్పున కంటైనర్లలో వాటిని ముంబైకి చేర్చేలా దిగుమతిదారులు బుక్‌ చేసినట్లు గుర్తించారు.కంటైనర్లలో ఉన్న పౌడర్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరిశీలించి హెరాయిన్‌ అని తేలాక ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు అఫ్ఘాన్‌ జాతీయులు ఉన్నారు.విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీలో అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం.గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.మరోవైపు అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌లో బెజవాడ ఏజెన్సీ, ఇక్కడి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఏపీ పోలీసులు ఉలిక్కి పడ్డారు.అంత పెద్ద మొత్తంలో తీసుకొస్తున్న డ్రగ్‌ను ఇతరత్రా ఏ రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు.? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? గుట్కా మాఫియా పాత్ర ఉండొచ్చా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే నార్కోటిక్‌ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగిందని, ఎన్‌ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా కూపీ లాగుతున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం.చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు..సోలార్‌ ప్లేట్ల ఏర్పాటు పనుల పేరిట విజయవాడ సత్యనారాయణపురంలో ఆశి ట్రేడింగ్‌ కంపెనీని మాచవరం సుధాకర్‌ అనే వ్యక్తి ప్రారంభించినట్టు తెలిసింది.కంపెనీని ఏర్పాటు ఇక్కడ జరిగినప్పటికీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా నడుస్తున్నాయని సమాచారం.

* అనూప్​గఢ్​ ప్రాంతంలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

* శ్రీవారి ప్రసాదాలకు పురుగుపట్టిన జీడిపప్పును అంటగట్టే యత్నం .- బెంగళూరుకు చెందిన సరఫరా సంస్థ ఘరానా మోసం.- జీడిపప్పు నాసిరకంగా ఉందని పది లోడ్లు వెనక్కు పంపిన టీటీడీ.- అదే జీడిపప్పును మళ్లీ ప్యాకింగ్ మార్చి పంపుతున్న సంస్థ.- పాడైపోయిన జీడిపప్పును పంపుతున్న హిందుస్తాన్ ముక్తా కంపెనీ.- నిత్య అన్నదానం, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి నాసిరకం జీడిపప్పు.- సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగుల కుమ్మక్కు.- అలిపిరి టీటీడీ వేర్‍హౌస్ కేంద్రంగా భారీ గోల్‍మాల్..? – పురుగుపట్టిన జీడిపప్పు సరఫరాపై సీరియస్‍గా స్పందించిన టీటీడీ.

* ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ షాపుల్లో ఈ పోస్ యంత్రాలు మళ్లీ మొరాయించాయి.సర్వర్ సమస్యతో ఈ పోస్ యంత్రాలు పనిచేయకపోవడంతో డీలర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎండీయూల పంపిణీ సమయంలో సర్వర్ వేగంగా పనిచేస్తుందంటున్న డీలర్లు రేషన్ పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు.సర్వర్ సమస్య ప్రతి నెల వస్తుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.రేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం, గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడంతో జనాలు డీలర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

* భూ సమస్య పరిష్కరించలేదంటూ ఆత్మహత్యకు యత్నం అధికారులు అన్యాయం చేశారంటూ కలెక్టరేట్ ప్రాంగణంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.అధికారులు తమ భూ సమస్యను పరిష్కరించలేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.వెంటనే అప్రవత్తమైన సిబ్బంది బాధిత మహిళను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.