NRI-NRT

TANTEX: ఆసక్తికరంగా సాగిన టాంటెక్స్ 170వ సాహితీ సదస్సు

TANTEX 170th NNTV Telugu Literary Meet In Dallas

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఆదివారం నాడు 170వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. మాడ సమన్విత ప్రార్థనాగీతంతో ప్రారంభమయిన కార్యక్రమానికి కెనడా నుండి కోమరవోలు సరోజ పరిచయంలో ప్రత్యేక అతిథిగా గార్లపాటి పల్లవి హాజరయ్యారు. పల్లవి రచించిన “ఎమ్మెస్ సుబ్బలక్ష్మి” పుస్తకాన్ని సరోజ పరిచయం చేశారు. పల్లవి తన ప్రసంగంలో “సుస్వరాల లక్ష్మి డా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి” అన్న అంశంపై విశ్లేషణ చేసి సభికుల మన్ననలందుకున్నారు. సత్యం ఉపద్రష్ట ముఖ్య అతిథి కాశీనాథుని రాధని పరిచయం చేశారు. కాశీనాథుని రాధ తన ప్రసంగంలో “తెలుగు పద్యంలోని అంద చందాలు” అన్న అంశంపై చక్కగా మాట్లాడి ఆకట్టుకున్నారు. సమన్వయకర్త కుప్పాచి నీరజ జ్ఞాపికలు చదివి వినిపించారు. సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి రాధ, పల్లవిలకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు సుబ్బు జొన్నలగడ్డ పాల్గొన్నారు.