NRI-NRT

ఫిన్లాండ్‌లో వైభవంగా దసరా-బతుకమ్మ

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి తెలిపారు. విదేశాల్లో వున్నా మన సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చి మన తెలుగు వాళ్ళు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ పండుగ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడుకున్న ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు నిరంతరాయంగా సాగింది. వేడుకల విజయవంతానికి సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి, బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ తదితరులు తోడ్పడ్డారు. సంస్థ ఉపాధ్యక్షులు ఓలేటి సుబ్రమణ్యమూర్తి, జ్యోతి స్వరూప్ అనుమలశెట్టి, సత్యనారాయణలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.