DailyDose

TNI నేటి నేర వార్తలు 27-Nov-2021

TNI నేటి నేర వార్తలు 27-Nov-2021

* జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తాలో కళాశాలలు, పాఠశాలల పక్కల వైన్ షాపులను తొలగించాలంటూ విద్యార్థులు ఆందోళన…
రోడ్డుపై ధర్నా.

* విజయనగరం జిల్లా

పార్వతీపురం పట్టణం లో ప్రధాన రహదారి పై నిత్యం భారీవాహనాలు వెళుతున్నాయి దీనివల్ల రోడ్డులు గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతుందని స్థానికులు తెలిపారు చూసి చూడ నట్టు అధికారులు చోద్యం చూస్తున్నారు ప్రతినిత్యం రహదారిపై ప్రయాణం చేస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు గుంతలు కనబడడం లేదా స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే స్థానికులు మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రోడ్డు పెద్ద గుంత పడడంతో భారీ వాహనం వెళ్లడంతో లారీ టైర్ కింద నలిగిన రాయి తుళ్ళడంతో స్థానికుడు వీపుపై రాయి తగిలి గాయం అయింది ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్డు మరమ్మతులు చేపట్టి మా ప్రాణానికి భరోసా ఇస్తారని స్థానికులు కోరుతున్నారు.

* స్క్రిప్ట్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రైతుల ధర్నా …
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో శనివారం నాడు ఉదయం 12 గంటల నుండి 2.30 నిమిషాల వరకు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం పోసి రెండు నెలలు అవుతున్న కానీ ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరాన్ని ప్రభుత్వం జాప్యం చేస్తుందని, ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లుల కు పంపిన దాన్యంను తరుగు నూకలు పేరిట రైస్ మిల్లర్లు ధాన్యం ఒక బస్తా కు రెండు నుండి మూడు కిలోలు తరుగు కట్ చేసిన తరువాతే లారీని ఉన్లోడ్ చేస్తామని లేదంటే లారీలను రైస్ మిల్లుల వద్ద నే ఉంటాయని అనడంపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరాన్ని తెలిపారు. అందుకు రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. రైతులకు స్థానిక తహసీల్దార్ అంజయ్యా వచ్చి 15 రోజుల్లో కొనుకోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఒక వేళ ధాన్యం కొనుగోలుపై జాప్యం జరిగితే భారీ ఎత్తున రైతులు ఆందోళన చేయాల్సి వస్తున్నాడని అన్నారు. ధాన్యం కేంద్రాల వద్దనుండి లారీ లో ధాన్యం లోడ్ చేసిన అనంతరం రైస్ మిల్లర్లు వెంటనే లారీలో నుండి ధాన్యం త్వరగా కాళీ చేసి పంపాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లేని యెడల రైస్ మిల్లర్లు పై ఆందోళన చెవుడుతామని అన్నారు. రైస్ మిల్లర్లు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.

* ప్రకాశం జిల్లా……

వెలిగండ్ల మండలం లోని బొంతగుంట్ల గ్రామంలో విద్యుత్ లైన్ మెన్ పై స్థానికులు దాడి

కొన్ని రోజులుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినఅందుకే దాడి చేశారని అంటున్న లైన్మెన్….
లైన్ మాన్ వారి పై దురుసుగా మాట్లాడినందుకే దాడి చేశారు అంటున్న ఇతరులు….

లైన్మెన్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన వెలిగండ్ల ఎస్ ఐ….

* తెలంగాణ (హైకోర్టు)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

★ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభంపై వివరణ సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.

★ 2017 నాటికే ప్రారంభం కావాల్సిన ఎంఎంటీఎస్‌ రెండోదశ ఇప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొంటూ ఎం.శ్రీనివా్‌సరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

★ చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి  వాదనలు నమోదు చేసుకుంది.

★ ఈ వ్యవహారంపై వివరణ సమర్పించాలని నోటీసులు జారీచేసింది.

విచారణ ఆరువారాలపాటు వాయిదా పడింది.

* అమరావతి:

వైసీపీ దాష్టీకాలు, దుర్మార్గాలు అధికమయ్యాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తుమ్మల చెరువుకు చెందిన సైదాను విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. దాచేపల్లిలో ఒకర్ని, తంగెళ్ళులో ఒకర్ని కొట్టి చంపారని చెప్పారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఏడుగుర్ని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను ప్రశ్నించినవారిపై దాడులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘నేడు అధికారం మీదుంది, రేపు మాదవుతుంది, అప్పుడు మీ పరిస్థితేంటి?’’ అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు విజ్ఞత కోల్పోయి, బరితెగించారని అన్నారు. మనుషులపై దాడులు చేసి తమరు ఏం సాధిస్తారని నిలదీశారు. దుశ్శాసన ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించే రోజులొస్తాయని యరపతినేని హెచ్చరించారు.

* కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లతో సమావేశం కాబోతున్నానని చెప్పారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని నిపుణులను కోరానని తెలిపారు.

* అనంతపురం:

చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని నాగ సముద్రం గేట్ వద్ద గల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు వైపు వెళ్తూ ఓవర్ టేక్ చేస్తున్న సమయం లారీని వెనుక వైపు నుంచి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

* హైద‌రాబాద్‌:

క్యూట్ క్యూట్‌గా కనిపిస్తున్న శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శిల్పా చౌద‌రీని శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగ్‌ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా లో నివాసముంటున్న చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం ఏర్పాటు చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.

4 కోట్లు ఇచ్చా.. బాధితురాలి ఫిర్యాదు

శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన రోహిణి అనే మహిళా బాధితురాలు తాను నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరి కి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు రోహిణి తెలిపారు. త‌న‌తో పాటు అనేక మంది వద్ద శిల్పా చౌదరి దాదాపు వంద కోట్లపై చిలుకు డబ్బులు తీసుకుని మోసం చేసిన‌ట్లు త‌న‌కుకు తెలిసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు గండి పేట లోని సిగ్నేచర్ అపార్ట్మెంట్ కు వెళ్లి శిల్పాను అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ శివ కుమార్ తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు బాధితులు తరలి వస్తున్నారని వారి వద్ద నుంచి వివరాలు సేకరించి మరింత సమాచారాన్ని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

* జగన్ పాలనలో వైఫల్యం చెందారు……. ఉండవల్లి

చంద్రబాబు పై అగౌరవరంగా మాట్లడుతూంటే జగన్ ఏం చేస్తున్నారు…..ఉండవల్లి…

అమరావతి:-

ఏపీ సీఎం జగన్‌ పాలనలో ఘోర వైఫల్యం చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే అని చెప్పారు. ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఆయన ఆక్షేపించారు. రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ”సీఎంగా జగన్‌ ఇంత ఘోరంగా విఫలమవుతారని ఊహించలేదు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. చంద్రబాబునుద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్‌ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదు. ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైకాపా ఉద్దేశం. ఇప్పటి వరకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం. దీని కోసం ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం దుర్మార్గం. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడగటానికి కేసుల భయం. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితిపై నిర్ఘాంత పోతున్నారు” అని ఉండవల్లి అన్నారు.

* ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని.
ఉన్న పరిశ్రమలు రాష్ట్రానికి బై చెప్తున్నాయని లోకేష్ ఆరోపించారు. టాటా గ్రూప్ 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణ లేదా తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోందన్నారు. లులూ గ్రూప్ కూడా ఏపీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని లోకేష్ వివరించారు.
ఏపీకి పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ఆసక్తి చూపాయని. టీడీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు యువతకు దూరమయ్యాయని లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఎన్నో పరిశ్రమలు ఏపీకి దూరమయ్యాయని.. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి దూరం కావడమే కాకుండా ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని లోకేష్ వివరించారు.

* రెండో అంతస్తు నుంచి పడి 18 నెలల చిన్నారి మృతి

వికారాబాద్: జిల్లాలోని పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనిలో విషాదం చోటు చేసుకుంది. 18 నెలల చిన్నారి వర్ణిక రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. పరిగి మండలం రాపోల్‌కు చెందిన సందీప్, ప్రశాంతి ఉద్యోగ రిత్యా పరిగి పట్టణంలో నివాసముంటున్నారు. చిన్న కూతురు వర్ణిక బాల్కనీలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రింద పడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

* పెనుగంచిప్రోలులో టమాట దొంగలు

విజయవాడ: విలువైన వస్తువులు, నగదు, డబ్బును దొంగతనం చేసేవాళ్లను చూశాం కానీ… ఏకంగా టమాటలను దొంగతనం చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్‌లో చోటు చేసుకుంది. టమాట ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.130కి చేరింది. ఈ క్రమంలో పెనుగంచిప్రోలులో దుండగులు టమాటాలను దొంగతనం చేశారు. మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ ఉండటంతో వాటిపై ఆగంతకుల కన్ను పడింది. పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్‌లో గురువారం రాత్రి 3 ట్రేల టమాటాలు మాయమయ్యాయి. ఒక ట్రే రూ.2000 పైగా ఉంటుందని వ్యాపారస్తులు తెలిపారు. నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్న ఆరువేల రూపాయలు కూడా గిట్టవని… అలాంటిది 6000 విలువగల టమాటాలు మాయమవటంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు.