DailyDose

TNI నేటి నేర వార్తలు 28-Nov-2021

TNI నేటి నేర వార్తలు 28-Nov-2021

* డ్రైవర్ కి ఫిట్స్ వచ్చి డివైడర్ను ఢీకొన్న కృష్ణ మిల్క్ పాల వ్యాన్

ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామం చెరువు దగ్గర విజయవాడ నుంచి తిరువూరు వెళ్తూ విజయ పాల వాహనం తిరిగివస్తుండగా పణ్ కుమార్ అనే డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో స్టీరింగ్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడం జరిగింది.

ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై వ్యాన్ ను అదుపు చేయడం జరిగింది.

వెంటనే డ్రైవర్ ని కిందకు దించి అతని సపర్యలు చేయడం జరిగింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

* భారీ వర్షాలకు తిరుపతి భవానీనగర్ లో పాత మూడంతస్తుల భవనం శనివారం రాత్రి కూలిపోయింది విషయం తెలిసిందే. ఆదివారం ఎమ్మెల్యే పరిశీలన.

* ఒమిక్రాన్​పై సర్వత్రా భయాందోళనలు నెలకొన్న తరుణంలో ఎయిమ్స్​ చీఫ్​ డా. రణ్​దీప్​ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త వేరియంట్​​ స్పైక్ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు.

దీంతో రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం వైరస్​కు లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ స్పైక్​ ప్రోటీన్లే. రోగి కణాల్లోకి చొచ్చుకెళ్లి, వైరస్​ వ్యాప్తికి కారణమవుతాయి.

స్పైక్​ ప్రోటీన్​ శక్తిని తగ్గించేందుకు చాలా టీకాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.

స్పైక్​ ప్రోటీన్లలో మ్యుటేషన్లు పెరిగిపోతే. టీకాల సామర్థ్యం తగ్గిపోతుంది.

అందువల్ల ఒమిక్రాన్​పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని గులేరియా స్పష్టం చేశారు.

వైరస్​ వ్యాప్తి, రోగనిరోధక శక్తిపై కొత్త వేరియంట్​ పోరాడే తీరుపైనే భవిష్యత్​ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు గులేరియా.

ప్రస్తుతానికి ఒమిక్రాన్​ వేరియంట్​ను భారత్​లో గుర్తించలేదని, ఐఎన్​ఎస్​ఏసీఓజీ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.

అయితే అంతర్జాతీయ ప్రయాణికులు, ముఖ్యంగా కొవిడ్​ కేసులు అనూహ్యంగా పెరిగిన దేశాల నుంచి వచ్చే ప్రజలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ కొత్త వేరియంట్​ను దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించారు. దీని తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు చెప్పారు.

ఈ వేరియంట్​కు ఒమిక్రాన్​ అని పేరు పెట్టింది డబ్ల్యూహెచ్​ఓ. ఒమిక్రాన్​ కట్టడికి ఇప్పటికే అనేక దేశాలు చర్యలు చేపట్టాయి.

వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.

తాజా పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవుతోంది. 

వైరస్​ నియంత్రణ కోసం విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, కట్టడి చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.. ఆయా ప్రభుత్వాలకు ఆదివారం లేఖ రాశారు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

* అమరావతి

ప్రస్తుత ఉద్యోగ సంఘాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తమ సంఘానికి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు స్పష్టం చేశారు.

ఇది ప్రభుత్వ క్రీడలో భాగమేనని, పీఆర్సీ పై ముఖ్యమంత్రి తేల్చేస్తారన్న ఒక సంఘం నాయకుని ప్రకటనపై ఉద్యోగులకు నమ్మకం లేదన్నారు.

ముందుగా ప్రకటించినట్టుగానే ప్రభుత్వానికి ఈ డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తున్నామని, ఆ తరువాత ప్రణాళికాబద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఒక సారి బరిలోకి దిగితే వెనుదిరిగేది లేదని ఆస్కార్ రావు తెల్చిచెప్పారు.

ఏప్రిల్ 2021 లో కమిషనర్ అషుతోష్ మిశ్రా ఇచ్చిన రిపోర్ట్ పై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, సలహాదారు అజేయ కల్లంతో సహా ఆరు గురితో వేసిన కమిటీ ఏమైందని..? ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇకనైనా నోరుతెరిచి ఉద్యోగుల్లో అయోమయాన్ని పోగొట్టాలని కోరారు.

* విశాఖ…

విశాఖ టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన

ఎన్టీఆర్ స్కూల్ లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అనే ఆలోచన ద్వారా నిరసన …

కొడాలి నాని,అంబటి, వల్లభనేని వంశీ ,సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ల మాస్క్ రూపంలో నిరసన…

దేవాలయం లాంటి అసెంబ్లీ లో అసభ్య పదజాలం వాడటం , వ్యక్తి గత దూషణ లు,భూతులు మాట్లాడుతూ న్నారు.

ప్రజాస్వామ్య లో మార్గదర్శకంగా ఉండ వాల్సిన నేతలు భూతుల మాట్లాడుతూ న్నారు

ఇప్పటి కైనా ఈ వైసీపీ నేతలకు మార్పు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.

విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి, బోయి రమాదేవి,పల్లా ఉమారాణి, లక్ష్మీ లావణ్య, రమణమ్మ, సమ్మిడి ఉమా, గోడి అరుణ, నూరి, మంగమ్మ, కుమారి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.

* నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ప్రవహిస్తున్న నీరు.

* శ్రీ పోట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి నీరు చేరాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండు కుండలాగా కనిపిస్తున్నాయి.

ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలలో అధికంగా కురుస్తున్న వర్షం.

* శ్రీ పోట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి నీరు చేరాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండు కుండలాగా కనిపిస్తున్నాయి.

ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలలో అధికంగా కురుస్తున్న వర్షం.

* ఈరోజు ఏపీలో కొత్తగా 178 కరోనా కేసులు నమోదుకాగా.

6 మంది కరోనా బాధితులు మరణించారు.

ఇక ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్న కేసులు 2,140.

* ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్… అప్రమత్తమైన ప్రభుత్వం.

కొమరిన్, శ్రీలంకపై ఉపరితల ఆవర్తనం.

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వానలు.

ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం.

* ఢిల్లీ: 

టీడీపీ అధినేత చంద్రబాబును ఎవరు తిట్టలేదని, అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా అని తప్పుబట్టారు. ఆయన నాటకాలు ఎవరూ నమ్మరన్నారు.

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనీసం మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.

ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది దానిని సరిదిద్దాలని కోరారు. మహిళా రిజర్వేషన్లు బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు.

రాష్ట్రానికి సంబంధించిన దిశ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు.

* శ్రీకాకుళం:

శ్రీకాకుళం జిల్లా వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. రేగిడి మండలం శిర్లం పంచాయతీలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీమంత్రి కొండ్రు మురళి నేతృత్వంలో వైసీపీలో చేరారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దూకుడు పెంచింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులు చేయడానికి టీడీపీ సంకల్పించింది.

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి జిల్లా పెట్టని కోట. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి జిల్లా ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పార్టీలో స్తబ్దత నెలకొంది.

పార్టీని బలోపేతం చేయడం ద్వారానే పూర్వ వైభవం సాధ్యమని అధిష్ఠానం భావించింది. 

జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ మలి దశ ఎన్నికల్లో టీడీపీ కూడా బాగా పుంజుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కూడా గట్టి షాక్‌ తగిలింది.

హిరమండలం జడ్పీటీసీకి పోటీచేసిన ఆమె తనయుడు రెడ్డి శ్రావణ్‌ ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు 59 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా. 10 వైసీపీ, 5 టీడీపీ గెలుచుకున్నాయి.

తూర్పుగోదావరిలో 21 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగగా. వైసీపీ ఎనిమిది చోట్ల గెలిచింది. టీడీపీ ఆరు చోట్ల గెలిచింది.