Business

భారత్ లో ఖరీదైన కారు ఇదే – TNI వాణిజ్యం – 05/02/2022

భారత్ లో ఖరీదైన కారు ఇదే – TNI వాణిజ్యం – 05/02/2022

** రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ భారత్లో అత్యంత సంపన్నుడు. మరి ఆ స్థాయి వ్యక్తి వినియోగించే కారు ఖరీదు మామూలుగా ఉంటుందా? తాజాగా అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ హ్యాచ్బ్యాక్ను ఆయన కొనుగోలు చేశారు. దీని కోసం ఏకంగా రూ.13.14 కోట్లు ఖర్చు చేశారట. భారత్లో అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. 2018లో విడుదలైనప్పుడు ఈ కారు బేస్ ధర రూ.6.95 కోట్లు. కస్టమైజేషన్ కారణంగా కారు ధర భారీగా పెరుగుతుందని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఆర్ఐఎల్ పేరిట కారు రిజిష్టర్ అయింది. రూ.12 లక్షలు చెల్లించి 0001 నంబరును కంపెనీ సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్/ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కలినన్ మోడల్ కావడం విశేషం. 6.7 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

* పిల్ రికార్డును అధిగమించిన అమెజాన్.. ఒక్కరోజులో రూ.14.18 లక్షల కోట్లు లాభం!
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా యు.ఎస్ కంపెనీ చరిత్రలో స్టాక్ మార్కెట్లో భారీగా సంపద కోల్పోయిన ఒక రోజు తర్వాత అమెజాన్ అందుకు భిన్నంగా ఒకే రోజు భారీగా సంపాధించింది. ఆన్ లైన్ రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ త్రైమాసిక నివేదిక తర్వాత కంపెనీ షేర్లు 13.5% పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు 190 బిలియన్(రూ.14.18 లక్షల కోట్లు) డాలర్లు పెరిగింది. జనవరి 28న వెలువడిన ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్రైమాసిక నివేదిక తర్వాత ఆ కంపెనీ ఒక్కరోజులో స్టాక్ మార్కెట్లో $181 బిలియన్ లాభాన్ని ఆర్జించింది.

*టెస్లా కార్ల‌లో క‌లక‌లం, 8ల‌క్ష‌ల కార్ల‌కు పైగా!!
ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ దిగ్గ‌జం టెస్లాకు మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. టెస్లా కార్ల‌లో సాంకేతిక లోపం తలెత్తిన కార‌ణంగా సుమారు 8.17ల‌క్షల కార్లకు పై రీకాల్ చేయాల‌ని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్ఏ) విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ సెడాన్, మోడల్ ఎక్స్ ఎస్యూవీ, మోడల్ 3, మోడల్ వై ఎస్యూవీ వాహనాల డ్రైవింగ్ స‌మ‌యంలో సీట్ బెల్ట్ రిమైండ్ చేయ‌డం స‌మ‌స్య తెలత్తిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే ప్ర‌మాదం ఎక్కువ ఉంటుంద‌నే కార‌ణంతో సుమారు.8,17,000 కార్ల‌ను రీకాల్ చేయాల‌ని ఎన్ హెచ్ టీఎస్ ఏ అధికారులు టెస్లాను ఆదేశించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన టెస్లా కార్లకు సంబంధించిన లోపాల్ని స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించి వాహ‌న‌దారుల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపింది.

* ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపినట్లు తెలిపింది.

*అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్లో మరోసారి షాక్ తగిలింది. విద్యుత్ కార్లను దిగుమతి చేసుకోవడానికి పన్నులను తగ్గించాలని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించినట్టు సమాచారం.
* ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్ షేర్ల భారీ పతనంతో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకెర్బర్గ్ సంపద హారతి కర్పూరంలా హరించుకుపోయింది. నిరాశాజనక త్రైమాసిక ఫలితాలతోపాటు ఫేస్బుక్ యాక్టివ్ యూజర్లు గణనీయంగా తగ్గడంతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లో మెటా షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి.

*కరోనా మహమ్మారి జీవితాలను ఛిద్రం చేసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో గృహస్థులు చారిత్రక రికార్డు స్థాయి లో పొదుపు చేశారు. ఆ సంవత్సరం గృహస్థుల పొదుపు రూ.7.1 లక్షల కోట్లుంది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన గృహస్థులు ముందు జాగ్రత్త చర్యగా లేదా నిర్భందంగా పొదుపు పెంచుకున్నారని ఎస్బీఐ ఆర్థికవేత్తలు ఒక నివేదికలో తెలిపారు. భవిష్యత్ ఆదాయాలపై అనిశ్చితి, నిరుద్యోగిత భయం కారణంగా ప్రజలు భారీ వ్యయాలకు కళ్లెం వేసి సాధారణ వ్యయాలకు పరిమితం కావడమే పొదుపు అలవాటును పెంచిందని వారు విశ్లేషించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో గృహస్థుల పొదుపు రూ.1.35 లక్షల కోట్ల మేరకు పెరగ్గా రుణ భారం రూ.15,374 కోట్ల మేరకు పెరిగిందని ఆ నివేదిక తెలిపింది.

*కంపెనీ మనుగడలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? పేరు ఉంటే చాలు. దాని ముసుగులో ఏమైనా చేసుకోవచ్చు. ఇదీ కొంతమంది ఆలోచన. ఇందులో భాగంగానే అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించేందుకు పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేస్తారు. వీటికి చిరునామా గాని, అసలు యజమానులు గాని ఏవీ సక్రమంగా ఉండవు. అంతా కాగితాల మీదనే కనిపిస్తాయి. ఇలాంటివి దేశమంతటా చాలానే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి డొల్ల (షెల్) కంపెనీలు ఉన్నట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) అధికారులు అనుమానిస్తున్నారు.

*అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డీప్ టెక్నాలజీ స్టార్టప్ టూ ప్లాట్ఫామ్స్లో 25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ముకేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సేవల కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 1.5 కోట్ల డాలర్లు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో దాదాపు రూ.112 కోట్లు. కృత్రిమ మేధ(ఏఐ) కంపెనీ అయిన టూ ప్లాట్ఫామ్స్ను సామ్సంగ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ మాజీ ప్రెసిడెంట్, సీఈఓ ప్రణవ్ మిస్త్రీ స్థాపించారు.

*క్రిప్టో కరెన్సీల ఆదాయంపై విధించే పన్నుపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. క్రిప్టో కరెన్సీల వంటి డిజిటల్ ఆస్తుల ఆదాయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తాజా బడ్జెట్లో 30 శాతం పన్ను విధించారు. దీంతో ఈ పద్దు నుంచి పెద్ద మొత్తంలోనే పన్ను వసూలవుతుందని ఆశిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మొహాపాత్ర చెప్పారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహిస్తున్న ఎక్స్ఛేంజీలు 40 వరకు ఉన్నాయి. ఇందులో టాప్-10 ఎక్స్ఛేంజీల లావాదేవీలే రూ.34,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఉంటాయని మొహాపాత్ర తెలిపారు. వీటి లావాదేవీలపై ఒక శాతం చొప్పున మూలంలో పన్ను కోత (టీడీఎస్) విధించినా, ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు పెద్ద మొత్తంలో పన్ను వసూలవుతుందని అన్నారు.

*ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) రుణాల వసూళ్లపై రుణదాతలకు ఎటూ పాలుపోవడం లేదు. తమ రుణాల వసూలుకు వీలుగా ఎఫ్ఆర్ఎల్ ఆస్తులను వేలం ద్వారా అమ్మేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరా యి. ఎఫ్ఆర్ఎల్ చెల్లించాల్సిన రూ.8,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్ల రుణాలు ఇప్పటికే మొండి బకాయులుగా మారిన విషయాన్ని రుణదాతలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ కేసు వెంటనే తేలకపోతే తాము మరింత తీవ్రంగా నష్టపోతామని తెలిపాయి.

*కొవిడ్-19 ఔషధం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్రధారి అయిన డాక్టర్ డ్రూ వైజ్మన్కు 2022 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. తెలంగాణ ప్రభుత్వం, ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్య (ఫాబా) ఉమ్మడిగా నిర్వహించిన బయోఏషియా 19వ సదస్సులో తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కే తారక రామారావు ఈ విషయం ప్రకటించారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో వైద్య శాఖకు చెందిన పెరెల్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ వైజ్మన్ గతంలో కూడా పలు వ్యాక్సిన్ల అభివృద్ధికి కృషి చేశారు.