DailyDose

కేసీఆర్, తికాయత్ భేటి -TNI తాజా వార్తలు

కేసీఆర్, తికాయత్ భేటి   -TNI తాజా వార్తలు

* సీఎం కేసీఆర్‌తో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ భేటీ ముగిసింది. తికాయత్‌తో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని తికాయత్‌ తెలిపారు. తాను నాన్ పాలిటిక్స్‌కి సంబంధించిన వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. దేశంలో ఒకే వ్యవసాయ పాలసీ ఉంటే బాగుంటుందని తికాయత్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఆందోళనల్లో మృతిచెందిన రైతు కుటుంబాల వివరాలను మార్చి 10లోగా సీఎం కేసీఆర్‌కి అందిస్తామని తికాయత్‌ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఎకరాకు పదివేలు ఇచ్చే రైతుబంధు పథకం బాగుందన్నారు. వచ్చే ఏడాది హైదరాబాదులో కిసాన్ సమ్మె ఏర్పాటు చేస్తున్నామని తికాయత్ ప్రకటించారు.

* రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను గురువారం వెల్లడించింది. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్సాల్సి ఉంది. కాగా జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కాగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యధావిధిగా మార్చి 11 నుంచి 31 వరకు జరుగనున్నాయి.

*జిల్లాల పునర్వవస్థీకరణపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యన్నారాయణప్లానింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలుపరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులుప్రజా సంఘాలు తెలిపిన అభ్యంతరాలుఫిర్యాదులు వాటి పరిష్కారాలపై చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. అలాగే జిల్లాల ఏర్పాటుపేర్లపై ప్రజల నుంచి వచ్చిన సూచనలుసలహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

* పోలవరంలో శుక్రవారం వైసీపీ, బీజేపీ బలప్రదర్శనలు చేయనుంది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పర్యటన సందర్బంగా బీజేపీ బలప్రదర్శనకు సిద్దమైంది. పోలవరం మోదీ వరం పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ స్వాగతం పలకాలని బీజేపీ నిర్ణయించింది. కాగా షెకావత్‌ను రాత్రి డిన్నర్‌కు సీఎం జగన్ ఆహ్వానించారు. అయితే షెకావత్‌ వెంట సీఎం ఇంటికి ఎవరూ వెళ్లకూడదని బీజేపీ నేతలు నిర్ణయించారు.

*AP CMO కార్యాలయం లోని కార్యదర్శుల శాఖలలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ ధనుంజయ్ రెడ్డి .జవహర్ రెడ్డి..ముత్యాల రాజు శాఖలు‌కేటాయిస్తూ ఉత్తర్వులుసాల్మన్ రాజు కి కూడా కీలక భాధ్యతలు

*ఛలో ఆంద్రా యూనివర్శిటికీ వెళ్ళకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంతో మాజీ ఎంపీ హర్షకుమార్ తన నివాసం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రా వర్శిటీ పరిరక్షణ కోసం తాము చేపట్టిన ఛలో ఆంద్రాయూనివర్శిటీను పోలీసులతో అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను, అఖిలపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంద్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష కొనసాగుతోందని, విశ్వవిద్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హర్షకుమార్ అన్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.

*హైదరాబాద్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై జాతీయ నాయకత్వానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివేదిక అందజేశారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డితో విడి విడిగా ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న బండి సంజయ్… గురువారం సాయంత్రం పార్టీ లీగల్ సెల్‌తో భేటీ కానున్నారు. రీ ఇన్వెస్టిగేషన్ చేయడం, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చించనున్నారు. మహబూబ్‌నగర్ బంద్‌కు పిలుపునిచ్చే ఆలోచనలో బీజేపీ ఉంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలకు చెక్కు పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

*సమాజంలోని అన్ని రంగాల్లో పోటీ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో తమ తమ రంగాల్లో నైపుణ్యాన్ని సముపార్జించుకుని, క్రమశిక్షణతో, ఇష్టపడి కష్టపడడం ద్వారా విజయాలు సొంతం చేసుకోవచ్చునని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు యువతకు దిశానిర్దేశం చేశారు. యువత ఉన్నతమైన కలలతో, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో నైపుణ్యాన్ని సాధించడం ద్వారా అంతర్జాతీయంగా అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు. విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో గురువారం ఉపరాష్ట్రపతి ముఖాముఖి జరిపారు.

*నాబార్డ్ వార్షిక ప్రణాళికపై బుధవారం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాబార్డ్, బ్యాంకులు సహాయం చేశాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయన్నారు. రైతులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు నాబార్డ్ సహకరించాలని కోరగా దీనికి నాబార్డ్ అంగీకరించినట్లు జగన్ తెలిపారు.

*నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. మార్చి 3 నుంచి 5వతేదీల మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

*మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి దిగారు. మహిళా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కొడుకుపై చర్య తీసుకునే వరకూ.. ఆందోళన విరమించబోమని మహిళా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు వెలువడిన వెంటనే అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు గత 807 రోజులుగా వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. న్యాయం, ధర్మం గెలిచిందని నినాదాలు చేశారు. న్యాయం బ్రతికే ఉందని కోర్టు మరోసారి నిరూపించిందని నాయకులు పేర్కొన్నారు.

*మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…ఈ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంత భంగపాటుకు గురైన తర్వాత బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవడం లేదన్నారు. ఇది అమరావతి రైతుల నైతిక విజయమని తెలిపారు. ఆనాడు శాసనమండలిలో నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపామని చెప్పారు. అయితే తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందన్నారు. ఈ తీర్పుతో మొదటి నుంచి టీడీపీ వాదన కరెక్ట్ అని తేలిందని షరీఫ్ పేర్కొన్నారు.

*ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ యుద్ధ నైపుణ్యం, ప‌రిపాల‌న తెలంగాణ రాష్ట్రానికి ఆద‌ర్శ‌మ‌ని రాష్ట్ర వైద్యారోగ్య‌, ఆర్థిక శాఖ‌ల మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. బాస‌ర‌లో జంక్ష‌న్‌లో శివాజీ విగ్ర‌హాన్ని మంత్రులు హ‌రీశ్‌రావు, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి ఆవిష్క‌రించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో హ‌రీశ్‌రావు ప్ర‌సంగించారు.

*కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు. త‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపించింద‌ని రేవంత్ చేసిన ఆరోప‌ణ‌లు ఏ మాత్రం వాస్త‌వం కాద‌ని మ‌హేంద‌ర్ రెడ్డి తేల్చిచెప్పారు.

*ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.

*ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం. హిందూమహా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. శుక్రవారం నాటికి తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తోందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తారాయలసీమలలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

*దివంగత నేత జీఎంసీ బాలయోగి దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. బాలయోగి 20వ వర్ధంతి సందర్భంగా దేవితోటి ఘనంగా నివాళి అర్పించారు. లోక్‌సభ స్పీకర్ వరకు అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు హయాంలో బాలయోగి రాష్ట్ర మంత్రివర్గం నుంచి లోక్సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. టీడీపీ హయాంలో దళితులు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తే.. జగన్ రెడ్డి దళితులను పాతాళంలోకి తొక్కేస్తున్నారని విమర్శించారు. కోనసీమ అభివృద్ధి ప్రదాత అని… బాలయోగి సేవలు చిరస్మరణీయమని దేవతోటి నాగరాజు కొనియాడారు.

*ఏయూ, పరిసరాల్లో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. ఛలో ఏయూకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పూర్వ విద్యార్థుల సంఘం పిలుపునిచ్చింది. ఛలో ఏయూకు వ్యతిరేకంగా ఏయూ పరిరక్షణ పోరాట సమితి మహాధర్నాకు దిగింది. పోలీసులు నిరసనలకు అనుమతి లేదంటున్నారు. ఇరువర్గాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చలో ఏయూ నేపథ్యంలో టీడీపీ, జనసేన, సీపీఎం నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

*సామాజిక బాధ్యతగా ఆర్టీఐ ద్వారా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుల్ని బయట పెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌ రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసన్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, పోలీసులు చట్టాన్ని కాపాడుతారా? మంత్రి చేసే అరాచకాలకు వంత పాడుతారా? అని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

*డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కొందరు ఆందోళనకు దిగగా.. మరి కొందరు స్థానికులు అభ్యంతరం చెబుతూ నిరసన చేపట్టారు.. చివరకు రెండు వర్గాలు పోటాపోటీగా తాళాలు పగులగొట్టి.. ఇళ్లలోకి చొరబడగా.. పోలీసులు రెవెన్యూ అధికారులు అడ్డుకొని సముదాయించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మంథని పట్టణంలోని పోచమ్మవాడలో 96 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారు. రెండేళ్ల క్రితమే ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నా.. కరెంట్‌, నీటి వసతి పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

*తెలంగాణలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపనకు 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపడుతున్నట్లు దళిత్‌ శక్తి ప్రోగ్రాం(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు వి.విశారదన్‌ మహారాజ్‌ తెలిపారు. వాస్తవానికి ఈ యాత్ర జనవరి 1న ప్రారంభం కావాల్సి ఉన్నా కొవిడ్‌ కారణంగా వాయిదా పడిందని చెప్పారు. మంగళవారం జరిగిన డీఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాన్షీరాం జయంతి రోజైన మార్చి 15 నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించామన్నారు. కల్వకుర్తి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని వచ్చే ఏడాది జూలై 30కి మేడ్చల్‌ జిల్లాలో ముగుస్తుందని వివరించారు.

*వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్‌కు నివేదికను అందించాలనీ నిర్ణయించింది

*అభయహస్తం పథకం అమలు తీరుపై ఆరు వారాల్లో తమకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, కో-కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ చట్టం ప్రకారం 20 లక్షల మంది మహిళల వద్ద నుంచి రూ.1075.24 కోట్లు ప్రభుత్వం వసూలు చేసి తిరిగి వారికి చెల్లించలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీ్‌షచంద్ర, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావలితో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది

*రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్య సాధనకు ఆర్బీకేలు, డీసీసీబీలు, పీఏసీఎ్‌సలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు, వ్యవసాయ, రెవెన్యూ సహాయకులను ఏకీకృతం చేయాలని నిర్ణయించారు. దీనికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కమిటీలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవర్ధక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ మార్కెటింగ్‌, సహకార, ఆర్థిక శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, నాబార్డు సీజీఎం, ఆప్కాబ్‌ ఎండీ, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌లను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేసి, అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది

* జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియెట్‌ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్‌ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు.

*ఉచిత హామీల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్ట జూస్తున్నాయంటూ రాజకీయ పార్టీలపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరిపే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు హిందూసేన ఉపాధ్యక్షుడు సుర్జీత్‌సింగ్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించింది.

*ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సహకార సొసైటీల పరిధిలో గోదాములు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు.

*అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహవ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్‌ గ్రోవర్‌కు భారత్‌పే తాజాగా షాకిచ్చింది. అన్ని పొజిషన్ల నుంచీ గ్రోవర్‌ పేరును తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు సైతం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో గ్రోవర్‌కున్న వాటాలపైనే ఆంక్షలు విధించనుంది. రానున్న బోర్డు సమావేశంలో చేపట్టనున్న అంశాల వివరాలు అందుకున్న గ్రోవర్‌ రాజీనామా చేసినట్లు భారత్‌పే వెల్లడించింది.

*ఈ ఏడాది బడ్జెట్ సకాలంలో అమలయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన వెబ్‌నార్ ద్వారా అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. వెబ్‌నార్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ 2022 గురించి వివరించిన ప్రధాని మోడీ, ప్రభుత్వం నమ్మకంగా పురోగతిని సాధించిందని, “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీకండక్టర్స్, స్పేస్ టెక్నాలజీ జెనోమిక్స్, ఫార్మాస్యూటికల్స్, క్లీన్ టెక్నాలజీస్ టు 5G” వంటి రంగాలలో సానుకూలంగా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు

*దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అందించిన విశేష కృషికి గాను ప్రముఖ నటి, కలైమామణి డాక్టర్‌ కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్‌ చేస్తూ పక్వాన్‌ చెన్నై ఆధ్వర్యంలో 5వ వార్షిక రియలిస్టిక్‌ అవార్డ్స్‌ 2022 ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.