DailyDose

కడపలో హై అలర్ట్ – TNI నేర వార్తలు

కడపలో హై అలర్ట్ – TNI నేర వార్తలు

*రేపు కడపలో హైఅలెర్ట్ ప్రకటించిన జిల్లా ఎస్పీ…? అదనపు బలగాలు కోరిన సీబీఐ? ఏమి జరగబోతుంది.

*కర్నాట‌క‌లోని బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో మంట‌లు చెల‌రేగాయి. 2.5 ఎక‌రాల్లో అట‌వీ ప్రాంతం ద‌గ్ధ‌మైంది. అయితే జంతువుల‌కూ ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిందంటూ ప‌ర్యాట‌కులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. వెంట‌నే స్పందించి, న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎండాకాలం ప్రారంభ‌మైన కార‌ణంగా మంట‌లు మ‌రింత వ్యాప్తి చెందాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు.

*మ‌త్తులో జోగుతున్న యువ‌త‌కు డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ మ‌హిళ బాగోతం వెల్ల‌డైంది. మ‌త్తుప‌దార్ధాల‌కు బానిసైన వారికి, నేర‌గాళ్ల‌కు డ్ర‌గ్స్ చేర‌వేస్తున్న 40 ఏండ్ల మ‌హిళ‌ను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని ఇండోర్ శ్రీరాజారాం స్కూల్ ప్రాంతానికి చెందిన మెహ‌ర్‌బాయ్‌గా గుర్తించారు.

*ములుగు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శివారులో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగరాజు (32) బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని రామ‌గుండం ప‌రిధిలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. సింగ‌రేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమ‌వారం మ‌ధ్యాహ్నం బొగ్గు గ‌ని కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను అసిస్టెంట్ మేనేజ‌ర్ న‌రేశ్‌తో పాటు మ‌రో ముగ్గురిని కార్మికులుగా గుర్తించారు.

* తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తన కాన్వాయ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఆరోపించారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా మధురాపూర్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సుకాంతా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సుకాంతా కాన్వాయ్ వెళ్తుండగా, నల్ల జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు, ఆయన కారును అడ్డగించారు. సుకాంత గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, దాడికి యత్నించారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను పక్కకు తొలగించికాన్వాయ్ వెళ్లేలా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించవనిఇలాంటి చర్యలతో బీజేపీని అడ్డుకోలేరని సుకాంతా అన్నారు.

* ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు కళాశాల నుంచి వస్తున్న విద్యార్థినిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను వీడియో తీశారు. బాధితురాలి వద్ద ఉన్న నగదును లాక్కుని ఊరి సమీపంలో వదిలేసి పారిపోయారు. ఈ దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్, ఆగ్రా జిల్లాలో ఆదివారం జరిగింది.

* నెల్లూరు జిల్లా కావలి పట్టణ శివారు ప్రాంతం వెంకయ్యగారిపాలెంలో ఉన్న ఓ ప్రైవేట్ లేఔట్లో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉదయం కల్లు గీయడానికి వచ్చిన కార్మికుడు మహిళను సజీవ దహనం చేశారనే సమాచారం ఇచ్చారని తెలిపారు. సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళను ఎక్కడో చంపి ఇక్కడ దహనం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తామని తెలియజేశారు.

*జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ ఉగ్రవాది ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో గ్రనేడ్‌ దాడికి దిగాడు. స్థానిక హరిసింగ్‌ మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రనేడ్‌ విసిరాడు. ఈ దుర్ఘటనలో నగరంలోని నౌహట్టా ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అస్లాం మఖ్ధూమీ(70) మృతి చెందారు. 24మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒక పోలీసు ఉన్నారు. ఈ ఘటనను జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మహబూబ్‌ ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ రక్తపాతాన్ని ఆపడానికి భారత్‌, పాకిస్థాన్లు దురదృష్టవశాత్తూ ఏ చర్యలూ తీసుకోవడం లేదని ట్విటర్‌ ద్వారా ఆరోపించారు.

*జమ్మూకశ్మీరులోని అవంతిపొరాలో నలుగురు జైషే మహ్మద్ సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.జమ్మూ కాశ్మీర్ పోలీసులు అవంతిపోరా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాద కార్యకలాపాల గుట్టును ఛేదించారు. పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో నలుగురు జైషే మహ్మద్ సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాద సహచరులు ఉమర్ ఫరూఖ్ దార్, సోరాజ్ మంజూర్ మాలిక్, ఇర్షాద్ అహ్మద్ లోన్, షహబాద్‌కు చెందిన అఫ్నాన్ జావీద్ ఖాన్‌లుగా గుర్తించారు.అరెస్టు అయిన వారు జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు రవాణ సదుపాయాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తున్నారని జమ్మూకశ్మీర్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

*పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం గ్రామ వైసీపీ సర్పంచ్ యడ్లపల్లి దుర్గరావుపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన 23 సెంట్ల స్థలంలో వైసీపీ సర్పంచ్ కలిసి అనధికరంగా కంచె వేశారు. సంతకాలు ఫోర్జరీ చేసి ఆ స్థలానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణలో ఫోర్జరీ సంతకాలతో స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించారని నిర్ధారించారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ యడ్లపల్లి దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు

*కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం దీబగుంట్లలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నాగశేషుడు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఆస్థి తగాదా విషయంలోనే‌ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్‌నగర్‌లో దారుణం జరిగింది. అక్రమ్, అతని స్నేహితుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్రమ్‌పై దాడి చేసింది అతని బావమరుదులుగా గుర్తించారు. ఆస్తి తగాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో దొంగ నోట్లు మారుస్తున్న ఏసుబాబు అనే వ్యక్తిని వ్యాపారస్థులు, మాదివాడ యువత పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. చినకాపవరం గ్రామానికి చెందిన ఏసుబాబు కొంతకాలంగా ఆకివీడు సెంటర్‌లో దొంగ నోట్లు మారుస్తున్నట్టు గుర్తించారు.

*హైదరాబాద్‌ నగర శివార్లలోని శంషాబాద్‌ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారులో నుంచి వెళికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

*లోన్‌ పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడులో ఓ స్కూల్‌ నడుపుతున్న వెలగా శ్రీవల్లికి గతవారం రోజులుగా బజాజ్‌ ఫిన్‌ పేరుతో పర్సనల్‌ లోన్‌ మంజూరైనట్లు ఫోన్లు వస్తున్నాయి. మీకు రూ.35లక్షల పర్సనల్‌ లోన్‌ మంజూరు అయింది. డాక్యుమెంటు చార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ చెల్లిస్తే వెంటనే మీ అకౌంటుకు రూ.35 లక్షలు జమచేస్తాం అని నమ్మించారు. దీంతో ఆ మహిళ రూ.1,29,793 గూగుల్‌పే ద్వారా పంపింది. లోన్‌ అమౌంట్‌ తమ బ్యాంకు ఖాతాకు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీవల్లి తాము మోసపోయామని గ్రహించి ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ ఉగ్రవాది ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో గ్రనేడ్‌ దాడికి దిగాడు. స్థానిక హరిసింగ్‌ మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రనేడ్‌ విసిరాడు. ఈ దుర్ఘటనలో నగరంలోని నౌహట్టా ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అస్లాం మఖ్ధూమీ(70) మృతి చెందారు. 24మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒక పోలీసు ఉన్నారు. ఈ ఘటనను జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మహబూబ్‌ ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ రక్తపాతాన్ని ఆపడానికి భారత్‌, పాకిస్థాన్లు దురదృష్టవశాత్తూ ఏ చర్యలూ తీసుకోవడం లేదని ట్విటర్‌ ద్వారా ఆరోపించారు.

*హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో రూ.5.04 కోట్ల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, నగదును ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్‌ఈబీ సీఐ మంజుల, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా స్వామి అయ్యప్ప ట్రావెల్స్‌ బస్సులో సేలం పట్టణానికి చిందిన దేవరాజు, సెల్వరాజు, కుమారవేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌లకు చెందిన బ్యాగుల్లో 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, రూ.90 లక్షల నగదు బయటపడ్డాయి.

* మ‌హిళా క్ల‌యింట్ల‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ముఖ టాటూ ఆర్టిస్ట్ సుజీష్ పీఎస్‌ను కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేశారు. సుజీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించేందుకు చెర‌నల్లూర్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. త‌న ప్రైవేట్ భాగాల్లో టాటూ వేసే క్ర‌మంలో సుజీష్ త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశాడ‌ని 18 ఏండ్ల బాలిక సోష‌ల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.