DailyDose

పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం – TNI తాజా వార్తలు

పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం – TNI తాజా వార్తలు

*పూర్తిస్థాయిలో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ‘కాంగ్రెస్‌’ను ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిల భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు మూడు గంటలపాటు సాగిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం వాడీవేడిగా సాగింది. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి పై పలు సూచనలు, అభిప్రాయాలను అధిష్టానానికి వెల్లడించారంతా. ఈ భేటీలో సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఏప్రిల్‌లో ధరల పెరుగుదలపై ఆందోళన చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్‌ 7న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలతో పాటు థాలీ బజావో పేరిటా నిరసనలకు పిలుపు ఇచ్చింది కాంగ్రెస్‌. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ త్వరలో పూర్తి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
*అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆనం ఫైర్‌
జెడ్పీ సమావేశంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. అటవీ అధికారులు అవరోధ శాఖ అధికారులుగా మారారని విమర్శించారు. కేంద్రం నిధులతో మంజూరైన రహదారులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన అధికారులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధుల మాటలను అధికారులు లెక్కచేయడం లేదని ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు.
*బండారు ఆమరణదీక్ష భగ్నం
మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆమరణదీక్ష భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను భీమవరం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయినా బలవంతంగా బండారును ఆసుపత్రికి తరలించారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ మాధవనాయుడు చేపట్టిన ఆమరణ దీక్షకు పూనుకున్నారు. నేటితో ఆయన దీక్ష మూడో రోజుకు చేరింది. బండారు దీక్షకు భారీ ఎత్తున నరసాపురం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడంపై వివాదం ఆరంభమైంది. ఇదంతా రాజకీయ కుట్రేనని.. నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పలు చోట్ల గందరగోళంగా తయారయ్యాయి. భౌగోళికంగానూ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను అటూ ఇటూ మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
*రాజమండ్రి ఆర్ట్‌ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు హాజరయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రి తో పాటు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వేణుగోపాల కృష్ణ, అవంతి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ప్రారంభించారు.
*రెండు రోజుల్లో కాణిపాకం వినాయక టెంపుల్ మూసివేత.. మూలవిరాట్ దర్శనం మళ్ళీ వినాయకచవితి నుంచే..
చిత్తూరు జిల్లా(Chittoor District) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ(Sri Varasiddhivinayaka Temple) పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో వినాయక మూలవిరాట్ దర్శనం భక్తులకు ఇక రెండు రోజులు మాత్రమేనని తెలిపారు. స్వామివారి ఆలయాన్ని రీమోడల్ చేస్తున్న నేపథ్యంలో గర్భాలయాన్ని దేవస్థానం మూసివేయనుంది. మళ్ళీ స్వయంభు వినాయకుడి మూలవిరాట్ పునః దర్శనం ఆగష్టు 31వ తేదీ వినాయక చవితి రోజు నుంచి మళ్ళీ భక్తులకు అందుబాటులోకి దేవస్థానం తీసుకుని రానున్నట్లు ప్రకటించింది.అయితే అప్పటి వరకూ తాత్కాలికంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బాల వినాయక ఆలయాన్ని దేవస్థానం నిర్మించింది. ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకు సోమవారం నుంచి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నారు.
*టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అచ్చెన్నకు చంద్రబాబు ఫోన్ చేసి బర్త్‌ డే విషెస్ చెప్పారు. ‘‘నాడు ఎర్రన్న ….నేడు అచ్చెన్న… ఇద్దరూ నాకు అత్యంత ఆప్తులు. అన్నకు తగ్గ తమ్ముడిగా… నాకు కుడిభుజంగా ఉంటూ పార్టీకి, ప్రజలకు సేవలందిస్తున్న సోదరుడు అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు అన్నారు.
*దేశంలో వాహనదారులకు భారీ షాక్‌ తగిలింది. 137రోజుల తరువాత మార్చి 22 నుంచి వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారాయి. దీంతో శనివారం రోజు దేశ వ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ పై 89పైసలు, డీజిల్‌పై 86పైసలు పెరిగాయి. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వివరాల ప్రకారం.. 80శాతం చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం చమురు దిగుమతులుపై పడింది. దీంతో వాటి ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు.
*పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం నిట్‌లో విద్యార్థులు ర్యాగింగ్‌‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ 9 మంది విద్యార్ధులను సస్పెన్షన్‌ చేశారు. అయితే ఈ ఘటనపై డైరెక్టర్‌ సూర్యప్రకాష్‌ విచారణ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా విద్యార్ధులపై చర్యలు తీసుకుంటామన్నారు
*బండారు ఆమరణదీక్ష మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆమరణదీక్ష భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను భీమవరం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయినా బలవంతంగా బండారును ఆసుపత్రికి తరలించారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ మాధవనాయుడు చేపట్టిన ఆమరణ దీక్షకు పూనుకున్నారు. నేటితో ఆయన దీక్ష మూడో రోజుకు చేరింది. బండారు దీక్షకు భారీ ఎత్తున నరసాపురం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడంపై వివాదం ఆరంభమైంది. ఇదంతా రాజకీయ కుట్రేనని.. నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పలు చోట్ల గందరగోళంగా తయారయ్యాయి. భౌగోళికంగానూ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను అటూ ఇటూ మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
*ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనకుండా, ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.అనిల్ కుమార్ హమాలీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నిత్యావసర సరుకుల రవాణా 28, 29 తేదీల్లో జరుగుతుంది. హమాలీలు సమ్మెలో పాల్గొంటే ఏప్రిల్ నెల రేషన్ పంపిణీ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు రేషన్ సరుకులు తీసుకోవడానికి ఎదురు చూడాల్సిన పరిస్థితులు రాకుండా చూడాలని అనిల్ కుమార్ కోరారు.
*జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ‘బాయ్‌’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వశర్మను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఉన్నారు. జనరల్‌ సెక్రటరీగా సంజయ్‌ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్‌ లఖాని ఎన్నికయ్యారు.
*ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్థిక మంత్రిఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాకుడైన నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు సెగ తగిలింది. రష్యాలో ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలుఆ కంపెనీలో సునక్‌ భార్య అక్షతా మూర్తికి వాటా ఉండటం ఇందుకు కార ణం. వీటికి సంబంధించి ఊహించని విధంగా సునక్‌ ఓ విలేకరి నుంచి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది.మాస్కోలో ఇన్ఫోసి్‌సకు కా ర్యాలయం ఉండటమేకాకుండా ఆల్ఫా బ్యాంకుతో సంబంధాలను ప్రస్తావించారు. వీటిపై సునక్‌ ఆచితూచి సమాధానమిచ్చారు. ఎన్నికైన రాజకీయ నేతగా తాను బాధ్యత వహించే దాని గురించి ఇంటర్వ్యూ ఇస్తున్నానని బదులిచ్చారు. కాగా రష్యాలో చిన్న ఉద్యోగుల బృందం పని చేస్తోందనికొం త మంది గ్లోబల్‌స్థానిక క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్టు ఇన్ఫోసిస్‌ తెలిపింది. రష్యా సంస్థలతో క్రియాశీల వ్యాపార సంబంధాలు లేవని పేర్కొంది.
*రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఎర్త్‌ అవర్‌ పాటించాలని ప్రజలను కోరిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌ అవర్‌ పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతేనే లైట్లు వాడాలని కోరారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మేధావులు ముందుకు రావాలన్నారు. మనకు 29 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. మేధావులు పర్యావరణ పరిరక్షణకు డిబేట్‌లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణన్ని అందించాలని గవర్నర్ పేర్కొన్నారు. అందరం ఆ దిశగా కార్యోన్ముఖులు కావాలని గవర్నర్ అన్నారు.
*ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం ప్రారంభమైంది. శనివారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులురాష్ట్రాల ఇంచార్జ్‌లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీమాణిక్కం ఠాగూర్పలువురు నేతలు హాజరయ్యారు. సంస్థాగత ఎన్నికలుసభ్యత్వ నమోదు కార్యక్రమం సహా ఇతర రాజకీయ అంశాలపై చర్చల జరుగుతున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపితం చేయడందేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనలు నిర్వహించడం. ఈనెల తో పార్టీ సభ్యత్వ నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఎంత శాతం నమోదు జరిగిందన్న దానిపై సమీక్ష జరుగుతున్నట్లు తెలియవచ్చింది.
*ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షనిర్వహించారు. పూజలు, ఉత్సవాలకు ఏర్పాట్లు, ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్, అతిథులు విడిది చేసేందుకు గదుల కేటాయింపు, నీటి, భోజన వసతి, విద్యుత్ సౌకర్యం, బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలపై శనివారం వివిఐపి అతిధి గృహంలో సమీక్ష నిర్వహించారు.
*ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్యే మహిపాల్‌తో పాటు అతని సోదరుడు మధుసూదన్ కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భూ కబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. లక్డారంలో 45 ఎకరాలు కబ్జా పెట్టిన ఘనుడు ఎమ్మెల్యే మహిపాల్‌ అన్నారు. అక్రమ మైనింగ్‌తో రూ.12 కోట్లు సంపాదిస్తున్న మహిపాల్‌ పన్ను ఎగవేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలు నిరూపించకపోతే.. జైల్లో పెట్టండని నందీశ్వర్‌ గౌడ్‌ సవాలు విసిరారు