Politics

జేబుకు చిల్లుపెడుతున్న జగన్ – TNI రాజకీయ వార్తలు

జేబుకు చిల్లుపెడుతున్న జగన్  – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ అధికారంలోకి వచ్చాక 7సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల జేబుకు చిల్లుపెడుతున్నాడని టీడీపీ నేత పీతల సుజాత దుయ్యబట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి ఇవ్వడానికి నాన్నబుడ్డి పథకం పెట్టినా సీఎం జగన్.. ఇప్పుడు కరెంట్ చార్జీల పెంపు ఎవరి కోసమని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో కూడా ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా 24 గంటలు కరెంట్ అందించిన ఘనత టీడీపీదేనని సుజాత తెలిపారు.వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సుజాత హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చారని తెలిపారు. నేడు వైసీపీ ప్రభుత్వం 30,35యూనిట్లకు కూడా అధిక విద్యుత్ చార్జీల వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు దక్కాలంటే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. 24గంటలు కరెంట్ అందించాలని సుజాత డిమాండ్ చేశారు.

*సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే.. ప్రజలపై విద్యుత్‌ భారం: లోకేశ్
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు పెరిగేవి కాదన్నారు. వైకాపా పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా ‘అంధకార ప్రదేశ్’ పేరుతో లాంతరు ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌.. తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన జగన్.. రకరకాల పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు పెరిగేవి కాదన్నారు. కరెంట్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తెదేపా పోరాడుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నారా లోకేశ్ వినూత్న నిరసన చేపట్టారు. లాంతరు చేత పట్టుకొని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ‘అంధకార ప్రదేశ్’ పేరుతో లాంతరు ప్రదర్శన చేపట్టారు. ప్రిజనరీ ఆలోచనాలతోనే పేదలపై భారం మోపారని దుయ్యబట్టారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా ఛార్జీలు పెంచారన్న లోకేశ్‌… ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయని విమర్శించారు.

*జగన్‌ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగం సర్వనాశనం: చంద్రబాబు
సీఎం జగన్‌ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగం సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి.. ప్రజలపై రూ.42,172 కోట్ల భారం పోపారని మండిపడ్డారు. ఏపీలో ఉన్న విద్యుత్ రేట్లతో పరిశ్రమలు ముందుకురాలేదని తెలిపారు. సంపన్న వర్గాల కోసం జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్‌ ఇచ్చామని, ఇప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారని తప్పుబట్టారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక సౌర, పవన విద్యుత్‌ దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు.

*ఓ వైపు విద్యుత్ చార్జీలు.. మరోవైపు పవర్ కట్: సోము వీర్రాజు
రాష్ట్రంలో ఒక వైపు విద్యుత్ చార్జీలను పెంచి మరోవైపు అనధికారికంగా పవర్ కట్‌ను ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ విద్యుత్ చార్జీల బాదుడు ప్రకటన వెంటనే వాపస్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆయన ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసల భారాన్ని సామాన్యుడిపై వేశారన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరణ చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం తుగ్లక్ చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

*విద్యుత్‌ ఛార్జీల పెంపు సరికాదు: పయ్యావుల
విద్యుత్‌ ఛార్జీల పెంపు సరికాదని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ థర్మల్‌ యూనిట్లకు బొగ్గు నిలిపేశారని తెలిపారు. రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువకు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతోందన్నారు. భవిష్యత్తులో మరో 30 వేల కోట్లను.. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తారని పయ్యావుల కేశవ్ తెలిపారు

*కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి
కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు తమపై తప్పుడు కేసులు బనాయించడం వల్లనే తాను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు… తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న వెంకయ్యనాయుడు నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయి అన్నారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్‌ సభ్యుడు నరేష్ గుజ్రాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రిటైర్‌ అవుతున్న సహచర సభ్యులందరికీ విజయసాయి హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు

*స్విచ్ వేయకుండానే ప్రజలకు విద్యుత్ షాక్‌: Achennaidu
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… స్విచ్ వేయకుండానే ప్రజలకు విద్యుత్ షాక్‌ తగిలిందన్నారు. ఇప్పటికే ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామన్న జగన్.. ఇప్పుడు ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు

*ఏపీ అంధకారానికి వైసీపీ ప్రభుత్వమే కారణం: Devathoti nagaraju
సీఎం జగన్ మోహన్ రెడ్డి కరెంట్ బిల్లులు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు. వెలిగి పోవాల్సిన ఏపీ గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయన్నారు. ఫ్యాన్‌కు ఓటు వేసిన జనం మండు వేసవిలో కనీసం ఫ్యాన్ గాలికి కూడా నోచుకోవడం లేదని తెలిపారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఓ వైపు విద్యుత్ కాంతులతో దేశం వెలిగిపోతుంటే ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మునిగి పోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.

*గన్‌ అసమర్థత వల్లే ప్రజలపై విద్యుత్‌ భారాలు: బోండా ఉమ
విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై పెను భారం మోపారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అసమర్థత వల్లే ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతున్నారన్నారు. ప్రజలను అన్నిరకాలుగా జగన్‌ దోపిడీ చేస్తున్నారని వాపోయారు. సంక్షేమ పథకాలకు కోత విధించేందుకే విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించేవరకు పోరాడుతామని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు.

*స్విచ్ వేయకుండానే ప్రజలకు విద్యుత్ షాక్‌: Achennaidu
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… స్విచ్ వేయకుండానే ప్రజలకు విద్యుత్ షాక్‌ తగిలిందన్నారు. ఇప్పటికే ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామన్న జగన్.. ఇప్పుడు ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

*గోవా మద్యం వెనుక వైసీపీ అవినీతి రాకెట్‌: టీడీపీ
నెల్లూరు జిల్లాలో పట్టుబడిన గోవా మద్యం వెనుక వైసీపీ నేతల అవినీతి రాకెట్‌ ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ‘ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే 17 వేల సీసాల గోవా మద్యం అక్కడ పట్టుబడింది. వాటికి ధైర్యంగా ఏపీ ప్రభుత్వ లేబుళ్లు అంటించి ప్రభుత్వ మద్యం షాపుల్లోనే అమ్ముతున్నారు. అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే ఈ మద్యం రాష్ట్రంలోకి వచ్చింది. గోవాలో థర్డ్‌ గ్రేడ్‌ మద్యం తెచ్చి వాటికి ఏపీ లేబుళ్లు వేసి అమ్ముతున్నారు. ఒక్క నెల్లూరులోనే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ఇతర రాష్ట్రాల మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోంది. లెక్కల్లోకి రాని ఈ మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం అంతా తాడేపల్లి ప్యాలె్‌సకు చేరుతోంది’’ అని ఆ పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా అధికారులు రాష్ట్రంలోని మద్యం షాపుల్లో తనిఖీలు చేపటాలని, అప్పుడు ఇతర రాష్ట్రాల మద్యం ఏ స్థాయిలో ప్రవహిస్తోందో తెలిసిపోతుందని పేర్కొన్నారు.

*అప్పులు, అభివృద్ధిపె శ్వేతపత్రం: రామకృష్ణ డిమాండ్‌
వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృదిఽ్ధ పనులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. చేతి వృత్తిదారుల రాష్ట్ర మహాసభలో పాల్గొనేందుకు బుధవారం తిరుపతికి వచ్చిన ఆయన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసుతో కలిసి మీడియాతో మాట్లాడు తూ ఆదాయం లేదంటూనే రూ.2.56 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెట్టారు? ముఖ్యమంత్రి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు.

*టీఆర్‌ఎస్‌తో ఇక అమీ తుమీ
తెలంగాణలో అధికారమే లక్ష్యం కావాలని, అధికార టీఆర్‌ఎ్‌సతో అమీ తుమీ తేల్చుకునే దిశగా ముందుకు సాగాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయుంచింది. ఇందుకోసం రైతాంగ ఉద్యమంతో మొదలుపెట్టి.. ప్రజాందోళనలు తీవ్రతరం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. ఈ నెలాఖరులో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కాగానే నీళ్లు, నిధులు, నియామకాలపై ఉధృతంగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలతో జరిగిన అంతరంగిక సమావేశంలో రాహుల్‌గాంధీ ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిసింది. రైతులను ధాన్యం పేరుతో మోసం చేసి, వారి కడుపు కొట్టేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, రైతు ఉద్యమంతో ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని, ఏప్రిల్‌ నెలాఖరులో లక్షలాది మంది రైతులతో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరై ప్రసంగించనున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ఢీకొంటున్నట్లు రైతులను కేసీఆర్‌ మభ్యపెడుతూ, వారిని మిల్లర్ల కబంధ హస్తాల్లో చిక్కుకునేలా చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌కు చెప్పినట్లు తెలిసింది. రైతులను ఇతర పంటల నుంచి వరికి మళ్లించి భారీ ఎత్తున పండించేలా చేసిన కేసీఆర్‌.. చివరకు వారిని నట్టేట ముంచారని చెప్పారు. పసుపు, చెరకు రైతుల విషయంలో కూడా కేసీఆర్‌ ఇలాంటి అన్యాయాలకు పాల్పడ్డారని వివరించారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలోకమిటీ వేసేందుకు ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

*విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన ఉద్యమం: నాదెండ్ల మనోహర్‌
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలతో కలిసి జనసేన ఉద్యమిస్తుందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినవారు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికి కరెంట్ లేకుండా పోయిందన్నారు. స్లాబ్‌ల పద్ధతి ఎందుకు మార్చాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ముందు నుంచి చెబుతున్నట్లు నవరత్నాల్లో ప్రతిదీ మోసమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులపై సీఎం జగన్‌కు కనీసం బాధ లేదన్నారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు ఎనిమిది గంటలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.