NRI-NRT

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి జూలు విదిల్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలోని డౌన్‌టౌన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఏకంగా ఆరుగురు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన మరో 9 మందిని కూడా గుర్తించినట్టు వారు పేర్కొన్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాల్పులు శబ్దాలతో ఘటనాస్థలం మారుమోగుతుండగా.. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్న దృశ్యాలు నెట్టింట్లో కొందరు పోస్ట్ చేశారు. అయితే.. ఈ దారుణం వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో పోలీసు ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.