Movies

మూడేళ్ళ వయస్సులోనే

మూడేళ్ళ వయస్సులోనే

మూడేళ్ళ వయస్సులోనే సినిమాపైన ప్రేమ పుట్టిందంటున్నది నేహాశెట్టి. “నేన ఎప్పుడు కహోనా ప్యార్ హై’ సినిమా చూశాను. అది నా బుర్రలో అలా వుండి పోయింది. కెమెరా ముం దుకు రావాలన్న కోరిక ఆ నాటిది. ‘మెహబూబా’ తర్వాత బ్రేక్ తీసుకున్నాను. నా యాక్టింగ్ స్కిల్స్కు సానపెట్టాలనుకున్నాను. నటనలో శిక్షణకోసం యుఎస్ వెళ్ళిపోయా. తిరిగి వచ్చాక కరోనా టైమ్లో చిక్కుకుపోయి, ఇంకొంచెం విరామం వచ్చింది. అలా తొలి చిత్రానికి ‘డిజె టిల్లు’కు నడుమ గ్యాప్వచ్చింది” అని చెప్పింది .