NRI-NRT

ఇకపై ఏ ప్రధానీ అలా బాధపడాల్సిన అవసరం లేదు

ఇకపై ఏ ప్రధానీ అలా బాధపడాల్సిన అవసరం లేదు

జర్మనీ పర్యటనలో ఉన్న prime minister narendra modi అక్కడి Indian community ని ఉద్దేశించి థియేటర్ అమ్ పోస్ట్‌డేమర్ ప్లాట్జ్‌లో ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పురోగమనానికి తోడ్పడాలని ప్రవాస భారతీయులను ఆయన కోరారు. వేగవంతమైన అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అవశ్యమని యువ, కలల భారతం నిర్ణయించింది. అందుకే బటన్ నొక్కడం(ఎన్నికలు ఉద్దేశించి) ద్వారా మూడు దశాబ్దాల అస్థిరతకు ముగింపుపలికారని congress party పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. digital payment system విజయవంతంగా ఉపయోగిస్తున్నామని ప్రధాని మోడీ ప్రస్తావించారు. రియల్ టైం డిజిటల్ పేమెంట్స్ వరల్డ్‌లో భారత్ వాటా 40 శాతానికిపైగానే ఉందన్నారు. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ ద్వారా రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామన్నారు. లబ్దిదారుడికి రూ.1 పంపిస్తే కేవలం 15 పైసలే చేరుతుందని ఇకపై ఏ ప్రధానమంత్రీ విచారించాల్సిన అవసరం లేదని మోడీ అన్నారు. ఇచ్చిన చేతితోనే 85 పైసలు తీసుకునేవారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మోడీ ఈ విమర్శలు చేశారు. గత 8 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.22 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసిందని ఆయన చెప్పారు.

నూతన భారతం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది
అంకితభావంతో ముందుకు దూసుకెళ్లాలని నూతన భారత్ సంకల్పించిందన్నారు. 21వ శతాబ్దం భారత్‌కు చాలా ముఖ్యమైనదన్నారు. సరైన లక్ష్యంతో ముందుకెళ్లాని భారత్ నిర్ణయించింది. లక్ష్యాన్ని తీర్మానం చేసుకుంటే దేశం సరికొత్త బాటలో పయనిస్తుందని ఆకాంక్షించారు. సవ్యదిశలో పయనించి లక్ష్యాలను అందుకోవాలని అభిలాషించారు. గడిచిన 8 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లోనూ వేగవంతమైన పురోగతిని సాధించిందని ప్రధాని మోడీ చెప్పారు. జీవన ప్రమాణాలు, ఉపాధి, విద్యలో నాణ్యత, సులభతరం వ్యాపారం, ఉత్పత్తుల నాణ్యత, ప్రయాణంలో నాణ్యత పెరిగాయని అన్నారు. నూతన భారతం భవిష్యత్ భద్రత గురించి ఆలోచించదు. సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆవిష్కరణలకు సంసిద్ధంగా ఉందని ఆయన ఆకాంక్షించారు. 2014 సమయంలో కేవలం 200-400 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుత భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య 68 వేలకుపైమాటే. డజన్‌కుపైగా యూనికార్న్‌లు ఉంటున్నాయని ఆయన చెప్పారు.


వన్స్‌మోర్ మోడీ
ప్రవాస భారతీయులను ఉద్దేశించి దాదాపు గంటపాటు కొనసాగిన ప్రధాని మోడీ ప్రసంగంలో ‘భారత్ మాతాకీ జై’, ‘ 2024లో వన్స్‌మోర్ మోడీ’ నినాదాలు మార్మోగాయి. ప్రముఖంగా వన్స్‌మోర్ మోడీ ఇన్ 2024 నినాదం ఎక్కువగా వినిపించింది. దీంతో వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార నినాదం ‘వన్స్‌మోర్ మోడీ ఇన్ 2024’ కాబోతోందా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.