DailyDose

గంజాయిని పట్టించిన.. రోడ్డు ప్రమాదం! – TNI నేర వార్తలు

గంజాయిని పట్టించిన.. రోడ్డు ప్రమాదం!  – TNI  నేర వార్తలు

*తెలంగాణలోని సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని పట్టించింది. నిందితుడి వద్ద సుమారు 11కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి.. కారు దిగి నిందితుడిని మందలించారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం వద్ద జరిగింది. తెలంగాణలోని సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం.. గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని దొరికేలా చేసింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల దుర్గామాత ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. పట్టుబడిన యువకుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్‌, వినయ్‌, జాన్‌, మహేశ్లు విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా చేస్తుంటారు. వీరు విశాఖ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి సంచితో హైదరాబాద్‌ బయల్దేరారు. నెల్లుట్ల వంతెన వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి పడిపోయారు. ముగ్గురు ఓ ద్విచక్ర వాహనంపై పారిపోగా.. మరో బైక్‌ స్టార్ట్‌ కాకపోవడంతో మహేశ్ అక్కడే ఉండిపోయాడు.గ్రామస్థులు గమనించి సపర్యలు చేస్తూ.. సంచిని పరిశీలించగా గంజాయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాద బాధితుడికి సాయం చేయడానికి కారు దిగారు. గంజాయి రవాణా విషయం తెలుసుకొని.. ‘‘గీ పని చేస్తార్రా.. భవిష్యత్తు ఖరాబ్‌ చేసుకుంటుండ్రు’ అంటూ యువకుడిని మందలించారు. మంచి పని చేశారంటూ నెల్లుట్ల గ్రామస్థులను అభినందించారు. సుమారు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రఘుపతి తెలిపారు.

*శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు (తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు) ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో తల్లి చిన్నమ్మడు(46), కుమార్తె జాహ్నవి(17) మృతి చెందగా.. మరో కుమార్తె రజని(20), కుమారుడు వెంకటసాయి శశాంకర్(14)కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసన్నపేట సీఐ తిరుపతి రావు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

*ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐగా జెడ్‌ఎల్ ఠాక్రే (56) మూడేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతోనే క్యాంప్‌లోని తన రూమ్‌లో ఠాక్రే ఫ్యాన్‌కి ఉరివేసుకొని మరణించారని తెలిపారు. కాగా, ఠాక్రే స్వస్థలం మహారాష్ట్ర. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏటూర్‌ నాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు.

*ఏలూరు జిల్లా భీమడోలు పీఎస్‌లో ఓ నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గొలుసు చోరీ కేసులో మూడ్రోజుల క్రితం అప్పారావును పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుడు ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్లోని బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించినట్లు వారు తెలిపారు. నిందితుడి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిందితుడు అప్పారావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతుండగా.. అతని కుటుంబసభ్యులు మాత్రం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పారావు వృత్తిరీత్యా చేపల పడుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. పాత నేరస్థుడు కావడంతో గొలుసు చోరీ ఘటనలు జరిగినప్పుడు.. అప్పారావును తీసుకువెళ్లి విచారిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

*న్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. ఆ ఇంట్లోనే బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్‌, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ్‌రావు ఈ చోరీ వివరాలు వెల్లడించారు.

*సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మోబిన్‌ అహ్మద్‌, మసూద్‌ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు ఎల్‌బీనగర్‌ డీసీపీ సంప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇద్దరు కలిసి చంపినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడు నాగరాజు వికారాబాద్‌ జిల్లా స్టేషన్‌ మర్పల్లి వాసి అనీ, బాల్య స్నేహితుడైన నాగరాజు, అశ్రీన్‌ సుల్తానా ప్రేమించుకుంటున్నారన్నారు.

*రాజస్ధాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌లో దారుణం వెలుగుచూసింది. 48 ఏండ్ల మ‌హిళ‌ను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్ప‌డిన ఉదంతం బుధ‌వారం రాత్రి చోటుచేసుకుంది. కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు స‌మీప అట‌వీప్రాంతానికి వెళ్లిన బాధితురాలు తిరిగివ‌స్తుండ‌గా పొరుగింటి వ్య‌క్తి ఆమెను అడ్డ‌గించి తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు

*దేశరాజధాని ఢిల్లీలో (Delhi) అంతా విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్‌లోకి వెళ్లిన దుండగుడు ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్‌లెట్‌ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్‌ఫూర్‌లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో తరగతి గదిలోకి ప్రవేశించిన యువకుడు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారి ముందే మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయం గురించి బాధితులు స్కూల్‌ ప్రిన్సిపల్‌, క్లాస్‌ టీచర్‌కు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని విద్యార్థులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.

*హైదరబాద్: నగరంలోని లంగర్ హౌజ్‌లో యువకుడిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. విచక్షణారహితంగా యువకుడిని యువకులు చితకబాదారు. బాధితుడు లంగర్‌హౌజ్‌కు చెందిన నిఖిల్‌గా గుర్తించారు. యువకుల చేతిలో నిఖిల్ తీవ్రగాయాలపాలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు నిఖిల్‌ను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన స్నేహితుడిని దూల్పేట్‌లోని జాలిహనుమాన్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వస్తున్న నిఖిల్‌పై లంగర్‌హౌజ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై నిఖిల్ కుటుంబసభ్యులు లంగర్‌హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*బాలుడు మృతదేహాన్ని బైక్‌పై తీసుకువెళ్లిన ఘటనపై బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు స్పందించారు. 108 సిబ్బందిని బ్రతిమిలాడినా నిరాకరించింది వాస్తవమే అని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నావారిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికే 108 అంబులెన్సులు అని చెప్పుకొచ్చారు. చాలా మంది ఆటో వారిని బ్రతిమిలాడిన విషయం కూడా వాస్తవమే అని అన్నారు. ఆటో వారూ పబ్లిక్ సర్వెంట్సే అని తెలిపారు. ఎస్పీ విజయారావు సూచనల మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఆటోలవారు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే, తమ దృష్టికి తేవాలని, కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు.

* ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. జేసీబీ వాహ‌నం టైర్‌లో గాలి నింపుతుండ‌గా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మెకానిక్‌లు ప్రాణాలు కోల్పోయారు. వారు మ‌ధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మే 3వ తేదీన ఈ ప్రమాదం జరగగా.. దానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. ఓ వ్యక్తి జేసీబీ వాహనం టైరులో గాలి నింపుతుండ‌గా.. మ‌రో వ్యక్తి వ‌చ్చి ఆ టైర్‌ను ప‌లుమార్లు.. ప్రెస్ చేయడం సీసీటీవీలో రికార్డు అయింది. టైరులో గాలి ఒత్తిడి అమాంతం పెరిగిపోవడం వల్ల అది అకస్మాత్తుగా పేలిపోయింది.

*బద్వేల్ పట్టణంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు నకిలీ ఇళ్ళ పట్టాల మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాలు తయారీ వ్యవహారంపై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు. బద్వేలు ఆర్డీవో ఆకుల వెంకట రమణ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. మూడు ఇళ్ళపై సోదాలు నిర్వహించి నకిలీ ఇళ్ల పట్టాల తయారీకి ఉపయోగించే సీల్స్, నకిలీ పత్రాలు, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సుమిత్రా నగర్‌కు చెందిన రవిశంకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బద్వేల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై ఆర్డీవో వెంకటరమణ లోతుగా అధ్యయనం చేపట్టారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో వైసీపీ శ్రేణుల పాత్ర ఉన్నట్లు సమాచారం.

*శ్రీకాకుళం: జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన వారు చింతల చిన్నమణి(తల్లి), శ్రీరంజని, జాహ్నవి, వెంకట్ సాయి సాత్విక్‌గా గుర్తించారు. ఈ ఘటనలో తల్లి చిన్నమణి, పెద్ద కూతురు జాహ్నవి మృతి చెందగా… ఎనబై శాతం కాలిన గాయాలతో ఉన్న శ్రీరంజని, వెంకట సాయి సాకేత్‌లను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తల్లితో పాటు కూతురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో చిన్నమ్మడు(46), జాహ్నవి(17) గా గుర్తించారు. మరో కూతురు రజిని, కుమారుడు వెంకటసాయి శశాంక్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.

* కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు రైతుల ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 120 మినుము బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

*కర్నూలు: జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగెర వద్ద ఓ స్కూటర్ అదుపుతప్పి జింకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటర్‌పై ఉన్న శివకుమార్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఏలూరు: జిల్లాలోని భీమడోలు పోలీసుల కస్టడీలో ఉన్న అప్పారావు(38)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అప్పారావుది లాకప్ డెత్‌గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొట్టి చంపారని బంధువులే ఆరోపిస్తున్నారు. లాకప్‌లోని బాత్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం చైన్ స్నాచింగ్ కేసులో అప్పారావు పోలీసులకు పట్టుబడ్డాడు.

*హిందూపురంలో తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లీకొడుకు శకుంతల, నవీన్‌ పురుగుల మందు తాగారు. బాధితుల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. తమను ఎమ్మెల్సీ ఇక్బాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితుల ఆరోపిస్తున్నారు. తమ ఇంటి పట్ట నకిలీదంటూ వేధిస్తున్నారని బాధితులు వాపోయారు.

*ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో బస్సులోని ఇద్దరు దంపతులు దుర్మరణం పాలయ్యారు. మరో అరడజను మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతులను విఠల్ మారుతి (65), సులోచన (60)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసికి యాత్రికులతో బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏఎస్‌పీ జై ప్రకాష్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక సైఫై ఆసుపత్రికి తరలించామని, కొందరిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని చెప్పారు. బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నట్టు ఏఎస్‌పీ తెలిపారు.

*శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.11.53 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. గత నెల 26న దక్షిణాఫ్రికా నుంచి ఓ ప్రయాణికుడు తన కడుపులో 1.38 కిలోల హెరాయిన్‌ దాచుకొని శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. అధికారులు అతడి బాడీ స్కాన్‌ చేయగా కడుపులో 108 క్యాప్సుళ్లు ఉన్నట్లు గుర్తించారు. అతడిని ఓ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేయించి, హెరాయిన్‌ను బయటకు తీయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

*కేవీ పల్లె మండలం నూతనకాల్వ పంచాయతీలోని సంగటివారిపల్లెలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. రైతు దొరస్వామికి చెందిన గొర్రెలను మేపు కోసం శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లగా బుధవారం వర్షంతో పాటు పిడుగు పడటంతో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పిడుగుపాటు ధాటికి పొలంలో మేపుకు వెళ్లిన గొర్రెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి ఒకేసారి 20 గొర్రెలు మృతి చెందడంతో వాటితోనే జీవనం సాగిస్తున్న రైతు దొరస్వామి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తనకు సహకరించి ఆదుకోవాలని అధికారులను రైతు కోరుతున్నాడు.

*కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో 8వ తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ప్రయత్నించారు. బుధవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించిన ఆ ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

*నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల తరువాత విషయం వెలుగు చూడటంతో చిన్నారి తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయుంచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన గొల్లపూడి నారాయణరావు(38) కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. గతనెల 30న చాక్లెట్ల కోసం వచ్చిన చిన్నారి(4)కి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి బిడ్డ ఇబ్బంది పడుతుండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. చిన్నారిని ఆరా తీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

*మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కాన్వాయ్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడాన్ని ఆయన చూసి, బాధితులకు సాయం చేద్దామని కారు దిగారు. అయితే, ఎర్రబెల్లితో పాటు భద్రతా సిబ్బందిని, స్థానికులను చూసిన బాధితులు భయంతో పరుగులు తీశారు. బైక్‌ వద్దకు చేరుకున్న ఎర్రబెల్లి అందులో 15 కిలోల గంజాయి ఉండడాన్ని చూసి విస్తుపోయారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తొర్రూరు నుంచి నలుగురు యువకులు హైదరాబాద్‌కు రెండు బైక్‌ల ద్వారా.. ఒక్కో బైక్‌పై 15కిలోల చొప్పున 30 కిలోల గంజాయిని తరలిస్తుండగా నెల్లుట్ల శివారులో అదుపుతప్పి ఒక బైక్‌ కిందపడిపోయింది. ఎర్రబెల్లి ఆ బైక్‌ వద్దకు రాగానే నిందితులు పరుగులు తీయడంతో గ్రామస్థులు వెంబడించి నలుగురు నిందితుల్లో మహేశ్‌ అనే యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కాగా, 15 కిలోల గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్న లింగాలఘణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించడంలేదు.

*అమ్మాయి కుటుంబీకులకు ఇష్టంలేకుండా ప్రేమ వివాహం చేసుకోవడం ఆ యువకుడి ప్రాణాలు తీసింది! పగతో రగిలిపోయిన యువతి సోదరుడు, మరికొందరితో కలిసి యువకుడిని వెంటాడి గడ్డపారతో కొట్టి చంపాడు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో బుధవారం రాత్రి 9:30 గంటలకు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే జరిగిన ఘటన అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా (23) కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయితే జనవరి 31న ఆర్యసమాజ్‌లో నాగరాజు-ఆశ్రిన్‌ సుల్తానా వివాహం చేసుకున్నారు. తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పెళ్లికి మునుపు వికారాబాద్‌ పోలీసులను.. పెళ్లి తర్వాత బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. గత రెండు నెలల నుంచి ఈ జంట.. సరూర్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని పంజాల అనిల్‌ కుమార్‌ కాలనీలోని ఇంట్లో నివాసం ఉంటోంది. మూసారాంబాగ్‌లోని ఓ కార్ల షోరూంలో నాగరాజు సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు.. బైక్‌పై ముసారాంబాగ్‌ వెళ్లారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారని ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు ఆశ్రిన్‌ సుల్తానా సోదరుడు ముబీన్‌ అని అనుమానిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. సోదరి మతాంతర వివాహం చేసుకోవడం నచ్చని అతడు, అప్పటి నుంచే నాగరాజుపై పగతో రగిలిపోతున్నాడు. నాగరాజును హత్యచేసేందుకు అదును కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో నాగరాజు, ఆశ్రిన్‌ సుల్తానా సరూర్‌నగర్‌ పంజాల అనిల్‌ కుమార్‌ కాలనీలో ఉంటున్న విషయం తెలుసుకున్నాడు. బుధవారం వారిపై నిఘా పెట్టాడు. మూసారాంబాగ్‌ నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న దంపతులను అనుసరించాడు. కొత్తపేట నుంచి మరికొంత మంది ముబీన్‌కు తోడయ్యారు. వారు తమను తరుముతున్నారని గుర్తించిన నాగరాజు బైక్‌ వేగం పెంచాడు. అయితే వారి ఇంటికి వెళ్లే వీధి వద్ద బైక్‌ అదుపు తప్పడంతో వాహనం నడుపుతున్న నాగరాజు, వెనుక కూర్చున్న ఆశ్రిన్‌ సుల్తానా కింద పడ్డారు. ఇదే అదునుగా ముబీన్‌, అతడి అనుచరులు నాగరాజుపై దాడికి దిగారు. తమ వద్ద ఉన్న గడ్డపారతో నాగరాజు ముఖంపై విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ముబీన్‌, పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. కాగా ఘటనా స్థలికి బీజేపీ నాయకులు చేరుకున్నారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నాకు దిగారు.

*కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ యువకుడు ఎనిమిదో తరగతి బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ ఫొటోస్‌, వీడియోలు చూపించి బెదిరింపులకు దిగాడు. వేధింపులను భరించలేక ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు పోలీ్‌సలను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మికుంటకు చెందిన 14ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బాలిక ఇంటి సమీపంలో ఉండే అజయ్‌దేవనాఽథ్‌ ఒంటిరిగా ఉన్న బాలికతో మాటలు కలిపి లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి బెదిరింపులకు దిగాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో అజయ్‌ దేవనాఽథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్‌ తెలిపారు.