Movies

పెళ్లికి సిద్ధమవుతున్నా!

పెళ్లికి సిద్ధమవుతున్నా!

తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రాహుల్‌ రామకృష్ణ. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాహుల్‌ రామకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా తన ప్రియురాలితో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నారు. ‘ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమవుతున్నా.త్వరలోనే వివాహం’ అని రాహుల్‌ రామకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కాబోయే జీవిత భాగస్వామి తాలూకు ఏ వివరాల్ని వెల్లడించలేదు. రాహుల్‌ రామకృష్ణ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలందజేస్తున్నారు.