Devotional

పదవ తరగతి ఫలితాల విడుదలలో గందరగోళం

పదవ తరగతి ఫలితాల విడుదలలో గందరగోళం

కాసేపట్లో ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల అవుతాయని ఎదురుచూసిన ఆరు లక్షల మంది విద్యార్ధులకు నిరాశే ఎదురైంది. చివరి క్షణంలో రిజల్ట్స్‌ వాయిదా వేస్తూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత.. కాసేపట్లో ఫలితాలు విడుదల కానున్న సమయంలో అధికారుల నిర్ణయంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సాంకేతిక కారణాలను చూపుతూ సోమవారానికి వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి బొత్సకు, అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.