DailyDose

19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ యాత్ర – TNI తాజా వార్తలు

19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ యాత్ర   –  TNI  తాజా వార్తలు

* కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఈ నెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించునున్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించి ఒక్కో కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అందజేస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. పర్చూరి నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

*జులై 2, 3, 4 తేదీల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌, నోవాటెల్‌లో జరగనున్నాయి. అలాగే 3న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, నడ్డా స్థానిక నేతలు తదితరులు పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని మోదీతో హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహించాలని భావించిన బీజేపీ… రోడ్డు షో కంటే భారీ బహిరంగ సభ మంచిదనే నిర్ణయానికొచ్చింది. ముఖ్యనేతల సమావేశంలో మోదీ బహిరంగ సభపై తరణ్ చుగ్, బండి సంజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం కేంద్ర కేబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18మంది సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, 350 మంది ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరుగుతాయని లక్ష్మణ్ చెప్పారు.

* ఈ నెల 22న ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

* రక్తదానం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని గవర్నర్ తమిళిసై అన్నారు. వరల్డ్ బ్లడ్ దోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్‌లోని సంస్కృతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. పండుగ వాతావరణం లాగా బ్లడ్ దోనర్స్ డే జరుపుకోవాలని తెలిపారు. రక్తదానం వల్ల ఎందరో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. తెలంగాణలో తలసేమియా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, రక్త హీనత పెరిగిపోవడం అనేది గమనించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

*రక్తదానం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని గవర్నర్ తమిళిసై అన్నారు. వరల్డ్ బ్లడ్ దోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్‌లోని సంస్కృతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. పండుగ వాతావరణం లాగా బ్లడ్ దోనర్స్ డే జరుపుకోవాలని తెలిపారు. రక్తదానం వల్ల ఎందరో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. తెలంగాణలో తలసేమియా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, రక్త హీనత పెరిగిపోవడం అనేది గమనించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

*నిర్మల్: జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వద్ద బీఎస్పీ నేతలు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మెయిన్ గేటు వద్ద ధర్నాకు దిగారు. కాగా..బీఎస్పీ నేతలను లోపలికి అనుమతించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీని అస్తవ్యస్తంగా మార్చి విద్యార్థులను వేధిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

*పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో టీఆర్ఎస్ కార్పోరేటర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. లారీ డ్రైవర్‌పై మూడో డివిజన్ కార్పోరేటర్ శ్రీనివాస్ బావమరిది సతీష్ దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్ గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సతీష్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. మరోవైపు మహిళా కార్పోరేటర్ భర్త గడ్డి కనకయ్య ఇందిరానగర్‌లో భవాని అనే మహిళ ఇంటిని కూల్చివేశాడు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా కూల్చివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆగడాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్‌లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్‌ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది.
*టీటీడీ కీలక నిర్ణయం తీసుకుది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్‌లైన్‌లో టీటీడీ ఉంచనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రోజుకు 750 టోకెన్లు అందుబాటులో టీటీడీ ఉంచనుంది.

*జూన్ 25 నుంచి దేవినేని పాదయాత్ర
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే రోడ్లను బాగుచేయాలని మాజీమంత్రితెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జూన్ 25నుంచి దేవినేని ఉమా పాదయాత్ర చేపట్టనున్నారు.దుగ్గిరాలపాడు నుంచి జి.కొండూరు వరకు ఉమా పాదయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వం రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధ్వాన్నంగా మారిన దుగ్గిరాలపాడు-జి.కొండూరు రోడ్డు.. మరమ్మతుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రోడ్లు మరమ్మతు చేయకపోవడంపై ఏడు గ్రామపంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్ల బాగుచేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

*పౌర్ణమి సంద‌ర్భంగా నేడు శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తు‌న్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠా‌భి‌షేకం ముగింపు వేడు‌కలు నిర్వహి‌స్తున్న నేప‌థ్యంలో గరుడ సేవను రద్దు చేస్తు‌న్నట్టు తెలి‌పింది.
*తిరు‌మల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందించింది. అంగ‌ప్రద‌క్షిణ టోకె‌న్లను బుధవారం (15వ తేదీ) నుంచి ఆన్‌‌లై‌న్‌లో భక్తు‌లకు అందు‌బా‌టులో ఉంచ‌ను‌న్నట్టు ప్రకటించింది. ఈనెల 15 నుంచి జూలై 31 వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌‌లై‌న్‌లో జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ టోకె‌న్లు తీసుకోవాలనుకునేవారు https // tirupathibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసు‌కో‌వ‌చ్చని తెలిపారు.

*నంద్యాల మున్సిపల్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన మాజీ అర్టీఓ ఆఫీసు ఏజెంట్ కరీం కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అతని కుటుంబ సభ్యులు, టీడీపీ, ముస్లిం సంఘాల నాయకులు రిలే దీక్షకు కూర్చొన్నారు. ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ రామాంజీనాయక్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కరీం కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ధర్నా కొనసాగిస్తామని ఎమ్మెల్సీ ఫరూఖ్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు.

*యూనివర్సిటీల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ ఉండడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా ఆ అధికారాలను తప్పిస్తూ వస్తున్నాయి. చాన్స్‌లర్‌ హోదా పేరుతో వర్సిటీల వ్యవహారాల్లో గవర్నర్లు అనవసర జోక్యం చేసుకుంటున్నారంటూ ఆ హోదాను రద్దు చేస్తున్నాయి. గవర్నర్‌ స్థానంలో వర్సిటీల చాన్స్‌లర్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించేలా అసెంబ్లీలో చట్టం చేస్తున్నాయి

*స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఖైదీలకు శుభవార్త. వారికి ప్రత్యేకంగా శిక్షను తగ్గించడంతో పాటు ముందుగానే విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రానున్న ఆగస్టు వచ్చే ఏడాది జనవరి తేదీల్లో మూడు విడతలుగా ఈ నిర్ణయం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. సత్ప్రవర్తనతో మెలిగి గత మూడేళ్లుగా ఎలాంటి శిక్షకు గురికాని కొన్ని వర్గాల వారికే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. కోర్టులో నేరం రుజువయి శిక్షను అనుభవిస్తున్నవారికి మాత్రమే ఈ స్పెషల్‌ రెమిషన్‌ను పరిమితం చేయాలని సూచించింది.

*తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్‌ బకాయిల పంచాయతీ కొనసాగుతోంది. ఏపీజెన్‌కో నుంచి రూ.4,774 కోట్ల బకాయిలు తమకు రావాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ తెలంగాణ జెన్‌కో, తెలంగాణ జెన్‌కో పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌, తెలంగాణ జెన్‌కో ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్ట్‌ హైకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశాయి. ఉమ్మడి రుణాల్లో ఏపీజెన్‌కో అధికంగా తీసుకున్న మొత్తం రూ.972 కోట్లు, తెలంగాణ డిస్కం బాండ్స్‌ రూపంలో ఏపీజెన్‌కో వద్ద ఉన్న రూ. 882 కోట్లు, ఏపీజెన్‌కో ట్రస్టుల నుంచి రావాల్సిన మొత్తం 2,172 కోట్లు, ఏపీ పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ ) నుంచి రావాల్సిన మొత్తం రూ.748 కోట్లు అన్నీ కలిపి రూ.4,774 కోట్లు రావాలని తెలంగాణ జెన్‌కో తెలిపింది. ఈ మొత్తంపై రూ.2,076 కోట్ల వడ్డీ ఉందని, చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.

*వచన కవితా ప్రక్రియలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరోచీఫ్‌ కృష్ణారావు(కృష్ణుడు)కు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. 2019 సంవత్సరానికి తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పది సాహితీ పురస్కారాలను విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో డాక్టర్‌ ఎం.పురుషోత్తమాచార్య ‘రహస్యభూతము’, వచన కవితలో కృష్ణుడు ‘ఆకాశం కోల్పోయిన పక్షి’, బాలసాహిత్యంలో ఎం.కృష్ణకుమారి ‘ఈ అడవి మాది’, కథానికలో డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి ‘తప్ష’, నవలా ప్రక్రియలో రామా చంద్రమౌళి ‘కాలనాళిక’, సాహిత్య విమర్శలో ప్రొఫెసర్‌ జి.చెన్నకేశవరెడ్డి ‘అక్షరన్యాసం’, నాటక ప్రక్రియలో చిటిప్రోలు వెంకటరత్నం ‘అశోకపథం, అనువాదంలో టంకశాల అశోక్‌ ‘రాధాకృష్ణన్‌ జీవిత చరిత్ర, వచన రచనలో జయరాజు ‘అవని’, ఉత్తమ రచయిత్రి విభాగంలో అనురాధ సుజలగంటి ‘అమ్మ బంగారుకల’ గ్రంథాలు సాహితీ పురస్కారానికి ఎంపికైనట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భట్టు రమేశ్‌ వివరించారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో వెలువడిన పుస్తకాలపై సాధారణ పాఠకులు, కవులు, రచయితలు, విమర్శకులు, నాటక కర్తల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన తరువాత న్యాయ నిర్ణేతలు ఈ ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలో వర్సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు.

*స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఖైదీలకు శుభవార్త. వారికి ప్రత్యేకంగా శిక్షను తగ్గించడంతో పాటు, ముందుగానే విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రానున్న ఆగస్టు 15, వచ్చే ఏడాది 2023 జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో మూడు విడతలుగా ఈ నిర్ణయం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. సత్ప్రవర్తనతో మెలిగి, గత మూడేళ్లుగా ఎలాంటి శిక్షకు గురికాని కొన్ని వర్గాల వారికే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. కోర్టులో నేరం రుజువయి శిక్షను అనుభవిస్తున్నవారికి మాత్రమే ఈ స్పెషల్‌ రెమిషన్‌ను పరిమితం చేయాలని సూచించింది.

*ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ (ఎస్‌ఈఆర్‌ఎంసీ) చైర్మన్‌ జస్టిస్‌ (రిటైర్డ్‌) ఆర్‌.కాంతారావు తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది. అయినా మూడునెలల ముందుగానే ఆయన తన రాజీనామా సమర్పిస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నేరుగా చెప్పినట్టు సమాచారం.

* తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, మాజీమంత్రి కొండా సురేఖ, ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, కొండా చిత్ర నిర్మాత సుష్మిత, నటులు అదిత్‌ అరుణ్‌, ఇర్రమోర్‌ తదితరుల బృందం సోమవారం ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మను దర్శనం చేసుకుంది. కొండా సినిమా ప్రమోషన్‌ కోసం ఈ చిత్ర బృందం సోమవారం విజయవాడకు వచ్చింది. చిత్ర బృందానికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

* రాష్ట్ర ప్రభుత్వం పలువురు సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ (ప్రజా వ్యవహారాల సలహాదారు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్‌, ముఖ్యమంత్రి సలహాదారు ఎం శామ్యూల్‌ (విశ్రాంత ఐఏఎస్‌ అధికారి) పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

* ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకనం, ఫలితాల ప్రకటనల్లో వ్యత్యాసాలపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందువల్ల వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో ఏపీపీఎస్సీ తీరు తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగిస్తోందన్నారు. కొందరు అభ్యర్థులు తనను కలిసి తెలియజేసిన విషయాలను ఈ లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకొస్తున్నానన్నారు. ‘2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు డిసెంబరు 2019లో రాత పరీక్షలు నిర్వహించారు. 2021 మేలో ఫలితాలు ప్రకటించారు. మెయిన్స్‌ పరీక్షల తేదీ ప్రకటన మొదలుకొని ఫలితాల విడుదల వరకూ అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగిందని, తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకొనేందుకు వీలుగా కమిషన్‌ కార్యదర్శి, సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని భావిస్తున్నారు. అస్మదీయుల కోసం మెయిన్స్‌లో అక్రమాలకు తెరదీశారు. ఫలితాలు రెండుసార్లు విడుదల చేశారు. ఈ రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ తీరుపై సమగ్ర విచారణ జరపాలి’ అని డిమాండ్‌ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

*జస్టిస్‌ సత్యనారాయణ మూర్తికి అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని, సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతుల ప్లాట్లను, అమరావతి నగరం అభివృద్ధిని మూడు, ఆరు నెలల్లో పూర్తి చేయాలని మార్చి 3వ తేదీన త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించిన సంగతి విదితమే. తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ విరమణ సందర్భంగా సోమవారం సాయంత్రం రైతులు, మహిళలు, రైతు కూలీలు పెద్ద ఎత్తున నేలపాడు హైకోర్టు ప్రాంతానికి చేరుకున్నారు.

*వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ వద్దకు టీడీపీ నాయకులు వెళ్లకుం డా ఆదివారం అర్ధరాత్రి నుంచే ముఖ్యనేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు.. అనంతపురం నగరంలోని ఓ నేత ఇంట్లో ఉండి, సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కలెక్టరేట్‌ వద్ద ప్రత్యక్ష మయ్యారు. కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన కాలవ శ్రీనివాసులు, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

*తెలుగుదేశం పార్టీ ఎంతో కాలం నుంచి పాటిస్తున్న సంప్రదాయాల్లో భాగంగానే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, ఆయన నీలిమూక ఈ ఎన్నికలో దిక్కుమాలిన సవాళ్లు మాని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన సూచించారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన తర్వాత జరిగే ఉపఎన్నికలో వారి కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టకూడదనే సంప్రదాయాన్ని టీడీపీ ఎప్పటి నుంచో పాటిస్తోంది. గతేడాది తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక వచ్చింది.

*వైసీపీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. మట్టి అక్రమ తవ్వకాలను ప్రశ్నించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ మహిళా సర్పంచ్‌ పట్ల కీచక పర్వం సాగించారు. గుంటూరు జిల్లా వంగిపురంలో ఆదివారం వైసీపీ నాయకులు అక్రమ మట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌, దళిత నాయకురాలు శిఖా విజయలక్ష్మి తన కుటుంబసభ్యులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి పంచాయతీ అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించింది. ‘మా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటాం.

*వారం రోజులు ఆలస్యంగా సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అరేబియా సముద్రం, గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, మరట్వాడ, కర్ణాటక, తమిళనాడులో అనేక ప్రాంతాలతోపాటు రాయలసీమలో తిరుపతి వరకు, ఇంకా తూర్పు భారతంలో పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, విదర్భ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల్లో అంటే ఈనెల 17కల్లా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది మే 29కల్లా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు తరువాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంలో జాప్యం జరిగింది. సాధారణంగా జూన్‌ నాలుగో తేదీకల్లా రాయలసీమ, ఎనిమిదికల్లా దక్షిణ కోస్తాలోని ఒంగోలు, 11వ తేదీ నాటికి విశాఖపట్నం రుతుపవనాలు రావలసి ఉంది. అయితే రుతుపవనాల పురోగతిలో వేగం లోపించడంతో రాష్ట్రంలోకి రావడం ఆలస్యమైంది. సోమవారం నాటికి తిరుపతి వరకు రుతుపవనాలు విస్తరించినా…దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం తప్ప మిగిలినచోట్ల వర్షాలు లేవు. రుతుపవనాలు సాధారణ తేదీ కంటే మూడు రోజులు ముందుగా కేరళలో ప్రవేశించినా రుతుపవన కరెంట్‌ పుంజుకోలేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

*రాష్ట్రంలో రూ.700 కోట్లతో 1.25 గిగావాట్ల చొప్పున రెండు సోలార్‌ సెల్‌, మ్యాడ్యూల్స్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు అమెరికాకు చెందిన అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సోలార్‌ పీవీ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ పరిశ్రమ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఈ-సిటీలో జరిగిన ఇరు సంస్థల భాగస్వామ్య ప్రకటన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

*విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్పొరేట్‌ చదువులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని చెప్పారు. నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం గన్‌ఫౌండ్రీలోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలను మంత్రి సబిత సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో అన్ని హంగులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థినులకు నోట్‌బుక్స్‌, చాక్లెట్లు పంపిణీ చేశారు.

*ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) రూ.10లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటయ్యే టికెట్లున్న ప్రయాణికులకు బోర్డింగ్‌ నిరాకరించినందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని డీజీసీఏ పేర్కొంది. చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్న ప్రయాణికులు సమయానికి హాజరైనప్పటికీ విమానయాన సంస్థలు బోర్డింగ్‌ను తిరస్కరించినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీలో వరుస తనిఖీలు నిర్వహించింది. ఎక్కడా సంస్థలు నిబంధనలు పాటించడం లేదని డీజీసీఏ పేర్కొంది.