Movies

ఏజెంట్‌తో సాహసం

ఏజెంట్‌తో సాహసం

‘ఏజెంట్‌’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది సాక్షి వైద్య. స్పై థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తుండగా..సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర, దీపారెడ్డి నిర్మిస్తున్నారు. నేడు సాక్షి వైద్య పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది. ‘గూఢచారి నేపథ్య కథాంశమిది. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిస్తున్నాం. అఖిల్‌ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఏజెంట్‌గా ఆయన పర్‌ఫార్మెన్స్‌ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.