DailyDose

హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు -TNI తాజా వార్తలు

హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు -TNI  తాజా వార్తలు

* ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు.. ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష‍్టం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

* రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, నిష్పక్షపాతంగా పనిచేయాలని ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ బిశ్వభూషణ్‌ సూచించారు. విశాఖపట్నం వేదికగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుల రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్ మోడ్‌లో సమావేశానికి గవర్నర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతుల వ్యవస్థను అందించేలా కమిషన్లు పని చేయాలని పేర్కొన్నారు.

*అమలాపురం జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులను భరించలేక గిరిజన ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. జగన్‌ అండతో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. బలవన్మరణానికి కారకులైన వైసీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

*ఆంధ్రప్రదేశ్‌లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఉత్తరాంధ్రతోపాటు యానాం, దక్షిణ కోస్తాలో 8,9,10,11 తేదీల్లో అక్కడక్కడా మెరుపులు, ఉరుములతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుందని తెలిపింది. కాగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో 74.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

*జార్ఖండ్ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహిస్తున్నది. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహెబ్గంజ్, మీర్జా చౌకీ, బెర్హత్‌, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడుల సమయంలో ఈడీ అధికారులు పారామిలిటరీ బలగాల సాయం తీసుకున్నారు.

*టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి సమాధానం చెప్పారు. కాంగ్రెస్వీ డటం కలలో కూడా జరగని పని అని తేల్చిచెప్పారు. దసరా రోజున సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ‘‘టీఆర్ఎస్‌ లో నేను చేరతానని మీడియాలో వచ్చే అంచనాలు ఎప్పటికీ నిజం కాబోవు. నాలుగు నెలల పాటు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు నిర్వహించను… నియోజకవర్గానికే పరిమితం అవుతాను’’ అంటూ జగ్గారెడ్డి వెల్లడించారు.

* రాజ్యసభ ఎంపీ(MP)గా డా.కె లక్ష్మణ్శు క్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ… రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జాతీయ నాయకత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నానని.. తనకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపు అని ఎంపీ చెప్పుకొచ్చారు

*విజయవాడ: నగరంలో ఇష్కాన్ ఆధ్వర్యంలో పూరీ జగన్నాధుడి రథయాత్ర కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వజ్రగ్రౌండ్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రథయాత్రను ప్రారంభించనున్నారు. గవర్నర్ రాక నేపథ్యంలో పోలీసులు (Police) పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రథయాత్ర సాగనుంది. వజ్రగ్రౌండ్ నుండి ప్రారంభమై రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపల్ వద్ద జగన్నాథుడి రథయాత్ర ముగియనుంది.

*వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గొప్ప మానవతావాదితో పోల్చారు. శుక్రవారం వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వైఎస్ఆర్ పుణ్యమే అన్నారు. వైఎస్ వలనే హైదరాబాద్‌కు మెట్రో రైల్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘ‌నత వైఎస్‌దే అన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్ పని చేయాలని షబ్బీర్ అలీ సూచించారు.

*బిల్లులు చెల్లించలేదని గ్రామ సచివాలయానికి వైసీపీ కాంట్రాక్టర్ తాళం వేశారు. పనులు పూర్తి కావచ్చినా సగం బిల్లు కూడా చెల్లించలేదని నిరసన తెలిపారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా, ఓజిలి మండలంలో చోటు చేసుకుంది. మాచవరంలో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలతో చేపట్టిన.. స్టేజ్ 2 సచివాలయ భవన నిర్మాణ పనులను వైసీపీ సీనియర్ నాయకుడు, కాంట్రాక్టర్ పుల్లారెడ్డి చేపట్టారు. నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తి అయినప్పటికీ… కేవలం రూ. 9 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. పెండింగ్ బిల్లుల కోసం ఎమ్మెల్యేలతోపాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించకపోవడంతో విసిగిపోయిన పుల్లారెడ్డి సచివాలయ భవనానికి తాళం వేశారు.

*వైసీపీ ప్లీనరీ ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేశారు. రెండ్రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా కాజ సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ మైదానంలో ప్లీనరీ నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు ఆర్భాటంగా సభలను ప్రారంభించినా… కార్యకర్తలను నిలుపుకోలేకపోయారు. మొదటి రోజే ప్లీనరీలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం భోజనాల తర్వాత నేతలు, కార్యకర్తలు వెళ్లిపోయారు. అంతకుముందు ప్లీనరీలో భోజనాల దగ్గర తోపులాట జరిగింది. ప్లీనరీకి వచ్చిన వారికి పోలీసులు దగ్గరుండి మరీ ఐస్‌క్రీమ్‌లు పంపిణీ చేశారు. సీఎం జగన్, విజయలక్ష్మి ప్రసంగాలు పూర్తయిన వెంటనే.. భోజనాల కోసం పార్టీ శ్రేణులు ఎగబడ్డారు. వేదికపై ప్రసంగాలు జరుగుతున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే నేతలు జారుకున్నారు.

*లక్షలాది డాలర్ల మోసపు స్కీమ్‌కు సంబంధించిన కేసులో పాకిస్థాన్ సంతతి వ్యక్తి రమేశ్ సన్నీ బల్వానీ దోషిగా నిర్థరణ అయింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైనట్లు అమెరికాలోని ఫెడరల్ జ్యూరీ తెలిపింది. ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఎలిజబెత్ హోమ్స్ ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆమెను ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ రైజింగ్ స్టార్ అని పిలిచేవారు. రమేశ్ బల్వానీ (57) బ్లడ్ టెస్టింగ్ కంపెనీ థెరనోస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ కూడా. ఆయనపై నమోదైన కుట్ర, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు రుజువైనట్లు శాన్ జోస్‌లోని ఫెడరల్ జ్యూరీ గురువారం తీర్పు చెప్పింది. థెరనోస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారిని, రోగులను మోసం చేశారని, కుట్రపూరితంగా వ్యవహరించారని నమోదైన ఆరోపణలు రుజువైనట్లు తెలిపింది. ఈ వివరాలను అమెరికా అటార్నీ స్టెఫానీ హిండ్స్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జి సియాన్ రాగన్ ఓ ప్రకటనలో తెలిపారు.

*పాల పదార్థాలపై, తయారీకి ఉపయోగించే యంత్రాలపై జీఎస్‌టీ పెంచాలని గత నెల 29న జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్‌(నార్మాక్స్‌) చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని డెయిరీ పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. పాల ఉత్పత్తులపైన 5ు, పాల పదార్థాల తయారీకి ఉపయోగించే యంత్ర సామగ్రి కొనుగోలుపై 12 నుంచి 18 శాతానికి జీఎస్‌టీ పెంచడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. పాల ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చి సహకార డెయిరీలను, పరిశ్రమలను నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దేశంలోని 60ు మంది ప్రజలు వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారనే విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే నష్టాలలో ఉన్న సహకార డెయిరీలపై జీఎస్‌టీ పన్ను భారం మోపడం సరికాదని పేర్కొన్నారు.

* కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్‌ ధరలను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. టీఆర్‌ఎ్‌సకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, జోగిపేట, పటాన్‌చెరు తదితర నియోజక వర్గాల్లో ర్యాలీలు నిర్వహించి, ప్రధాన రహదారులపై బైఠాయించారు.

*ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా హైదరాబాద్‌ పోలీసులు 20 మంది చిన్నారులను కాపాడారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ అధికారులతో కలిసి ప్యారడైజ్‌, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో బిక్షాటన చేస్తున్న 18 మంది చిన్నారులతోపాటు పనిచేస్తున్న మరో ఇద్దరు చిన్నారులను కాపాడారు. బాలకార్మికులను బాలవిహార్‌కు పంపగా, బిక్షాటన చేస్తున్న చిన్నారులను యూస్‌ఫగూడ, సైదాబాద్‌లోని చైల్డ్‌ హోంలకు తరలించారు.

*ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ విధానంలో 2022-23 సంవత్సరానికిగాను పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో అడ్మిషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభమౌతాయని డీఈవో నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. అభ్యాసకులు వారికి దగ్గరలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించి ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు కో ఆర్డినేటర్‌ 80084 03635 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

*పలువురు డిపో మేనేజర్‌లను బదిలీ చేస్తూ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ.సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్‌ డిపో మేనేజర్‌ ఎస్‌.ప్రణీత్‌ను కూకట్‌పల్లి డిపో మేనేజర్‌గా, నిజామాబాద్‌ డిపో మేనేజర్‌ బి. ఆంజనేయులును నారాయణపేట్‌ డీపోకు బదిలీ చేశారు. అక్కడ డిపో మేనేజర్‌గా పని చేస్తున్న ఎన్‌.చందర్‌రావుకు పదోన్నతి కల్పించారు. జనగాం డిపో మేనేజర్‌ ఆర్‌. లక్ష్మారెడ్డిని మేడ్చల్‌ డిపో మేనేజర్‌గా, ముషీరాబాద్‌ -2 డిపో మేనేజర్‌ ఎ.గిరిమహేశంను బదిలీ చేసి నల్లగొండ-మహబూబ్‌నగర్‌ కార్గో ఎటీఎంగా నియమించారు. అక్కడ పని చేస్తున్న బి.కరుణాకర్‌కు పదోన్నతి కల్పించారు. హుజూరాబాద్‌ డిపో మేనేజర్‌ డి.భవభూతిని హకీంపేట డిపో మేనేజర్‌గా నియమించారు. రాణిగంజ్‌-1 డిపో మేనేజర్‌ ఎ.సుధాకర్‌ను ఉప్పల్‌ జోనల్‌ వర్క్‌షాప్‌ పీఎ్‌సఓగా నియమించారు. అక్కడ పని చేస్తున్న బిఎస్‌ ప్రకా్‌షరావును బర్కత్‌పురా డిపో మేనేజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

*రాష్ట్రంలో 30 ప్రధాన సమస్యలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ అంశాలపై నిపుణులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించింది. ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన ప్రజా సమస్యలు-టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఏర్పాటయిన అధ్యయన కమిటీ గురువారం రాష్ట్రపార్టీ కార్యాలయంలో తొలిసారిగా సమావేశమైంది. సమావేశంలో కమిటీ సభ్యులు రఘునందన్‌రావు, స్వామిగౌడ్‌, వివేక్‌, బాబీ అజ్మీరా, ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులు, వినియోగంపై పూర్తి స్థాయిలో అధ్యయనం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. కేంద్రం నిధులను రాష్ట్రం ఎలా వినియోగించింది..? కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత..? వాటి కేటాయింపు ఎలా ఉంది..? తదితర అంశాలపై సంబంధిత విభాగాల నిపుణులతో ఈ నెల 15న ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

*ప్రతి సంవత్సరం మాదిరిగానే గురుపౌర్ణమి, తొలిఏకాదశి వేడుకలకు మహారాష్ట్ర నుంచి భక్తులు పుట్టపర్తికి కాలినడకన బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్రలో నాసిక్‌ కొల్హాపూర్‌ ప్రాంతానికి చెందిన 1500 మంది భక్తు లు బుధవారం రాత్రి రైలులో ధర్మవరం రైల్వేస్టేషనకు వచ్చారు. గురువారం రైల్వే స్టేషన నుంచి కాలినడక భక్తిగీతాలు ఆలపిస్తూ పుట్టపర్తికి బయలుదేరివెళ్లారు.

*ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి జరగాల్సిన రెండో టెస్ట్‌ ముందు ఆతిథ్య శ్రీలంకను కరోనా వణికిస్తోంది. తొలి టెస్ట్‌లో ఆడిన జెఫ్రీ వాండర్‌సే, అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ లకు బుధవారం నిర్వహించిన కొవిడ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరు రెండో టెస్ట్‌కు దూరమయ్యారు. మరో రౌండ్‌ కరోనా టెస్ట్‌ల తర్వాత తుది జట్టును ప్రకటించనున్నట్టు లంక కెప్టెన్‌ తెలిపాడు. అయితే, కరోనాతో తొలి టెస్ట్‌కు దూరమైన ఏంజెలో మాథ్యూస్‌ ఈ మ్యాచ్‌కు అం దుబాటులో ఉండడం ఊరటనిచ్చే విషయం.

* ఏడాదికి వంద మంది అథ్లెట్లకు అవసరమైన న్యూట్రిషన్‌ను అందించేందుకు హె ల్త్‌కేర్‌ బ్రాండ్‌ ‘బీబెటర్‌’ ముందుకొచ్చింది. ఇందుకోసం ‘ఖేలేంగే బెహెతర్‌’ అనే కార్యక్రమాన్ని ఆ సంస్థ రూపొందించింది. గురువారం ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ప్రారంభించారు.

*జల్సాలకు అలవాటు పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తల్లి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంట్లో గడియ పెట్టుకుని గ్యాస్‌ లీక్‌ చేసి నిప్పంటించుకున్నాడు. చేయి కోసుకున్నాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇటీవలే నిర్మించిన కొత్త ఇంట్లో బిడ్డ చేసిన పనికి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి ప్రమీల, ముత్యంరెడ్డి కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి (35) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఉద్యోగం పోవడంతో జల్సాలకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడికి భార్య సంగీత, కుమారులు అభినందన్‌రెడ్డి (3), అయాన్స్‌రెడ్డి(2) ఉన్నారు. తల్లిదండ్రులతో కలిసి గాజులరామారం లోని వీనస్‌ రాక్స్‌ హైట్స్‌కాలనీలో ఇటీవలే ఇల్లు నిర్మించుకున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం దామోదరం సంజీవయ్య నివాసం ఉన్న ఇంటిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘శ్రీ దామోదరం సంజీవయ్య మెమోరియల్‌’ పేరుతో ఇంటిని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈమేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో ఆయనకు 11 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో ఆయన నివాసాన్ని అభివృద్ధి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్‌ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించి సంజీవయ్య ఇంటిని అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య మెమోరియల్‌కు రూ.2 కోట్లు కేటాయించింది. టూరిజం, కల్చరల్‌, యువజన సంక్షేమ అధికారులు ఈ నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.

*ఈ నెల 10వ తేదీన జరుపుకోనున్న బక్రీద్‌ పండుగకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బక్రీద్‌ ప్రార్థనల సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని నిర్దేశించారు. మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని, మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలని పేర్కొన్నారు. పరిశుభ్రతకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

*తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఏపీకి వెళ్లాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన కంటే సమర్థులు లేరని తెలంగాణ భావిస్తే ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి డిప్యుటేషన్‌ మీద మళ్లీ రప్పించుకోవచ్చని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రం విభజన సందర్భంగా తనను ఏపీకి కేటాయించడాన్ని సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో సోమేష్‌ కుమార్‌ సవాల్‌ చేశారు. క్యాట్‌ ఉత్తర్వుల అండతో తెలంగాణలో కొనసాగుతున్నారు. మరో 15 మంది అధికారులు సైతం ఏపీకి కేటాయించినా క్యాట్‌ ఉత్తర్వులతో తెలంగాణలో ఉంటున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసింది.

*తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడోసారి కరోనా బారినపడ్డారు. గుంటూరులో జరగనున్న వైసీపీ ప్లీనరీకి ముందస్తుగా వెళ్లిన ఎమ్మెల్యేకు బుధవారం జ్వరం వచ్చింది. గురువారం ఉదయం విజయవాడలోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో భూమన విజయవాడ నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోనున్నారు.

* కాకినాడ జిల్లా సామర్లకోటలో మున్సిపల్‌ పాఠశాల అన్న క్యాంటీన్‌లోకి మారింది. వైసీపీ కౌన్సిలర్‌పై ఉన్న పార్టీ విభేదాల కారణంగా జగ్గమ్మ గారిపేటకు చెందిన మున్సిపల్‌ ప్రాఽథమిక పాఠశాలను గాలికి వదిలేశారు. సొంత భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్మించేందుకు స్థలం కేటాయింపులు చేయకుండా, మరే అద్దెభవనాన్నీ ఏర్పాటుచేయకుండా అలా గాలికొదిలేశారు. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలను టీటీడీ కళ్యాణమండపం రోడ్డులో ఉన్న అన్నక్యాంటీన్‌లో అరకొర సదుపాయాలతో నిర్వహిస్తున్నారు.

* రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేస్తామని, చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) మేరకు ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమీర్‌ శర్మ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌, విద్యా శాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను జులై 19కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25ు సీట్లు ఉచితంగా ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యేగేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యం విచారణ సందర్భంగా 2022-23 నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ వేసిన అఫిడవిట్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వ్యాజ్యాన్ని పరిష్కరించింది. కోర్టు తీర్పు అమలుకాకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

*ఉపాధ్యాయుల ఆందోళనల నేపథ్యంలో జీవో 117కు సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ‘30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు’ ఉండాలన్న నిబంధనను సవరించి, ‘20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు’గా మార్చాలని నిర్ణయించింది. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు దాటితే రెండో ఉపాధ్యాయ పోస్టు వస్తుంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలకు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని తెలిపారు. గురువారం విజయవాడలో తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలతో ఆయన చర్చలు జరిపారు. పలు అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. రేషనలైజేషన్‌ జరుగుతున్నందున ఉపాధ్యాయులకు జీరో సర్వీసు ప్రాతిపదికన బదిలీలు చేస్తామన్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీ కావాలని చెప్పారు. బదిలీలకు జూన్‌ 30వ తేదీని కటా్‌ఫగా నిర్ణయించినట్లు తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం దామోదరం సంజీవయ్య నివాసం ఉన్న ఇంటిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘శ్రీ దామోదరం సంజీవయ్య మెమోరియల్‌’ పేరుతో ఇంటిని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈమేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో ఆయనకు 11 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో ఆయన నివాసాన్ని అభివృద్ధి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్‌ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించి సంజీవయ్య ఇంటిని అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య మెమోరియల్‌కు రూ.2 కోట్లు కేటాయించింది. టూరిజం, కల్చరల్‌, యువజన సంక్షేమ అధికారులు ఈ నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.

*కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి (69) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండు పర్యాయాలు టీడీపీ నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 1996లో నగరం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2014లో పి.గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారాయణమూర్తికి బుధవారం రాత్రి షుగర్‌, బీపీ పెరగడంతో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున గుండెపోటుతో మరణి ంచారు.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం దామోదరం సంజీవయ్య నివాసం ఉన్న ఇంటిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘శ్రీ దామోదరం సంజీవయ్య మెమోరియల్‌’ పేరుతో ఇంటిని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈమేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో ఆయనకు 11 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో ఆయన నివాసాన్ని అభివృద్ధి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్‌ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించి సంజీవయ్య ఇంటిని అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య మెమోరియల్‌కు రూ.2 కోట్లు కేటాయించింది. టూరిజం, కల్చరల్‌, యువజన సంక్షేమ అధికారులు ఈ నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.

*3, 4, 5 తరగతుల విలీనం పేరుతో 8 వేల పాఠశాలలను విలీనం చేయాలన్న జీవో 117ను రద్దు చేయాలని కోరుతూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టాలని ఏపీ టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌గోపాల్‌ పిలుపునిచ్చారు. పాఠశాలల విలీన ప్రక్రియపై పోరాటానికి సిద్ధం కావాలని, నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలపాలి కోరారు. జీవోను వెనక్కి తీసుకుని విలీన ప్రక్రియ ఆపేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి, ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా చేసే జీవో 117పై విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు స్పందించాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు.

*ముఖ్యమంత్రి జగన్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ సహచర పార్లమెంటుసభ్యులకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురువారం లేఖ రాశారు. ఈ నెల 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొన్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనకుండా జగన్‌ ప్రభుత్వం, పోలీసులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ప్రొటోకాల్‌ను కూడా పాటించకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఈనెల 3న నా నియోజకవర్గం భీమవరం వెళ్లడానికి ఒక ప్రత్యేక రైలు బోగీని బుక్‌ చేసుకున్నాను. అయితే ఈ ప్రయాణంలో నాపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం తెలుసుకుని కొంత ప్రయాణం తర్వాత రైలును దిగిపోయాను. అదే రోజు నా ఇంటి ముందు ఒక కారు అనుమానాస్పదరీతిలో చక్కర్లు కొట్టడం భద్రతా సిబ్బంది గుర్తించారు.

* తిరుమల శ్రీవారి ఆలయానికి ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ సుధామూర్తి సుమారు రూ.42 లక్షల విలువైన ధర్మరథ వాహనాన్ని విరాళంగా అందజేశారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి శ్రీవారి భక్తులను దేవస్థానానికి తరలించేందుకు ఈ వాహనాన్ని ఉపయోగించునున్నారు. ఈ కార్యక్రమంలో సుధామూర్తి సోదరి, గాలిపాటం చిత్ర నిర్మాత రమేష్ రెడ్డి, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. సుధామూర్తి చేస్తున సేవ క్రార్యక్రమాలను వారు ప్రశంసించారు.

*ఓ ఐఐటీ విద్యార్థిని ప‌ట్ల లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను జార్ఖండ్ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. ఖుంతి జిల్లా స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న అహ్మ‌ద్‌ను మంగ‌ళ‌వారం పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అత‌న్ని రిమాండ్‌కు త‌ర‌లించారు. త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు ఓ విద్యార్థిని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అహ్మ‌ద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. అహ్మ‌ద్‌ను విధుల నుంచి తొల‌గించాల‌ని ఆదేశించారు.