Movies

స్టార్​ హీరో బిగ్​డీల్​.. రూ.119కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు​ కొనుగోలు!

స్టార్​ హీరో బిగ్​డీల్​.. రూ.119కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు​ కొనుగోలు!

బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడని తెలిసింది. దీని విలువ సుమారు రూ.119కోట్లు అని సమాచారం. భారీ పారితోషికం తీసుకుంటూ లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు సినీ తారలు. అలానే ఖరీదైన ప్రాంతంలో ఇల్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాషన్​ ఐకాన్​,​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్ కూడా ఇదే పని చేశాడు. నటనతోనే కాకుండా ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాషన్​ దుస్తులతో అభిమానులను ఆశ్చర్యపరచడంతో పాటు ఆకట్టుకునే ఈ హీరో మరో విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ ఖరీదైన సీ వ్యూ(సముద్రం, బీచ్​ అందాలను చూడగలిగేలా) కలిగిన లగ్జరీ క్వాడ్రూప్లెక్స్​ను భారీ ధరకు తీసుకున్నాడట.ముంబయి పోష్​ ఏరియా బాంద్రాలోని బ్యాండ్​స్టాండ్​లో సాగర్​ రెషమ్​ టవర్​లో రూ.119కోట్లు పెట్టి కొనుగోలు చేశాడని సమాచారం అందింది. ఈ క్వాడ్రూప్లెక్స్​ మొత్తం 16,17,18,19 ఫ్లోర్లకు విస్తర్తించి ఉంది. ఈ అపార్ట్​మెంట్​ నుంచి సముద్రం, బీచ్​ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్రాపర్టీలో భాగంగా 19 కార్లు పార్కింగ్‌ చేసుకునే స్థలంతోపాటు విశాలమైన టెర్రస్‌ కూడా ఉంది. ఈ ఇంటిని రణ్‌వీర్‌, అతని తండ్రి జగ్‌జీత్‌ సింగ్​ డైరెక్టర్లుగా ఉన్న ఓ ఫైవ్‌ ఓ మీడియా వర్క్స్‌ ద్వారా కొనుగోలు చేశారు. దీనికోసం రూ.7.13 కోట్ల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. ఇక సాగర్‌ రేషమ్‌ బిల్డింగ్‌.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్లు షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ఇళ్లకు దగ్గరగానే ఉంటుంది. కాగా, ముంబయిలోని బాంద్రా, జుహు ప్రాంతాల్లోనే చాలా మంది బాలీవుడ్‌ స్టార్లు, బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు.