DailyDose

TNI – నేటి నేర వార్తలు

TNI –   నేటి నేర వార్తలు

*కొడుకు మృతిని తట్టుకోలేక చెరువులో దూకిన తల్లి..
మెదక్ జిల్లాలోని రామాయంపేటలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్‌ తల్లీ కొడుకులు. ప్రేమ విఫలమవడంతో శివకుమార్‌ మూడు రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో వరలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది. అయితే శివకుమార్‌ మృతిని తట్టుకోలేక శుక్రవారం ఉదయం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులోనుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*10 కోట్ల విలువైన న‌గ‌దు, బంగారం ఎత్తుకెళ్లిన ప‌నిమ‌నిషి అరెస్టు
ఢిల్లీలోని పంజాబీ భాగ్‌లో ఉన్న ఓ ఇంటి నుంచి ప‌నిమ‌నిషి సుమారు 10 కోట్ల విలువైన బంగారం, న‌గ‌దును ఎత్తుకెళ్లాడు. ఆ కేసులో ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మోహ‌న్ కుమార్‌గా గుర్తించారు. కుమార్‌తో పాటు అత‌నికి స‌హ‌క‌రించిన బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం.. జూలై 4వ తేదీన ఓ ఇంటికి చెందిన కుటుంబం అమెరికాలో ఓ ఫంక్ష‌న్ హాజ‌ర‌య్యేందుకు వెళ్లింది. అయితే ఇంట్లో అయిదేళ్లుగా ప‌నిచేస్తున్న వ్య‌క్తికి ఇంటి తాళాల‌ను అప్ప‌గించారు. ఇక అదే ఇంట్లో ప‌నిచేస్తున్న మ‌రో ప‌నిమ‌నిషి జూలై 18వ తేదీన ఓన‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. కుమార్ ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు చెప్పాడు. కారు, న‌గ‌దు, బంగారం ఎత్తుకెళ్లిన‌ట్లు ఓన‌ర్‌కు తెలిపాడు. అయితే కేసును ద‌ర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దొంగ‌ను ప‌ట్టుకున్నాడు. నిందితుడు కుమార్ కారును ర‌మేశ్ న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద వ‌దిలేసివెళ్లాడు. కారులో కుమార్‌తో పాటు అత‌ని బంధువు ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే బీహార్‌కు వెళ్లిన పోలీసు బృందం షియోహ‌ర్ జిల్లాలో వాళ్ల‌ను అరెస్టు చేశారు. భారీ మొత్తంలో బంగారంతో పాటు 5 ల‌క్ష‌ల న‌గ‌దును రిక‌వ‌ర్ చేశారు.

*ఢిల్లీలోని పంజాబీ భాగ్‌లో ఉన్న ఓ ఇంటి నుంచి ప‌నిమ‌నిషి సుమారు 10 కోట్ల విలువైన బంగారం, న‌గ‌దును ఎత్తుకెళ్లాడు. ఆ కేసులో ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మోహ‌న్ కుమార్‌గా గుర్తించారు. కుమార్‌తో పాటు అత‌నికి స‌హ‌క‌రించిన బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం.. జూలై 4వ తేదీన ఓ ఇంటికి చెందిన కుటుంబం అమెరికాలో ఓ ఫంక్ష‌న్ హాజ‌ర‌య్యేందుకు వెళ్లింది. అయితే ఇంట్లో అయిదేళ్లుగా ప‌నిచేస్తున్న వ్య‌క్తికి ఇంటి తాళాల‌ను అప్ప‌గించారు. ఇక అదే ఇంట్లో ప‌నిచేస్తున్న మ‌రో ప‌నిమ‌నిషి జూలై 18వ తేదీన ఓన‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. కుమార్ ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు చెప్పాడు. కారు, న‌గ‌దు, బంగారం ఎత్తుకెళ్లిన‌ట్లు ఓన‌ర్‌కు తెలిపాడు. అయితే కేసును ద‌ర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దొంగ‌ను ప‌ట్టుకున్నాడు. నిందితుడు కుమార్ కారును ర‌మేశ్ న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద వ‌దిలేసివెళ్లాడు. కారులో కుమార్‌తో పాటు అత‌ని బంధువు ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే బీహార్‌కు వెళ్లిన పోలీసు బృందం షియోహ‌ర్ జిల్లాలో వాళ్ల‌ను అరెస్టు చేశారు. భారీ మొత్తంలో బంగారంతో పాటు 5 ల‌క్ష‌ల న‌గ‌దును రిక‌వ‌ర్ చేశారు.

* ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సురేంద్రనగర్‌ జిల్లాలోని గజన్వవ్‌ గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో తాసిల్దార్‌, డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్ బృందం గ్రామానికి చేరుకున్నారు. బాలిక ప్రస్తుతం 60 ఫీట్ల లోతులో ఉన్నదని తెలిపారు. చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువస్తామని చెప్పారు.

*కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది

* ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో గుట్ల ఉమ్మడివర వాసులు పల్లె సీమాను(73), సామ్యేలు(35) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

*బాపట్ల: జిల్లాలోని పర్చూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు.. ఇంటియాజమాని సుబ్బారావు, కనకదుర్గ దంపతులను కాళ్ళు చేతులను చీరతో కట్టి కత్తులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలోని 14 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులు, సెల్ ఫోన్స్, డాక్యూమెంట్స్, రూ.32 వేల నగదును అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

*మెదక్: జిల్లాలోని రామాయంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందంటూ మూడు రోజుల క్రితం శివకుమార్ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి వరలక్ష్మి ఈరోజు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చెరువులో నుంచి వరలక్ష్మి మృతదేహాన్ని వెలికితీసి… పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టక్కర్‌వాడిలో పెద్ద ఎత్తున అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గురువారం ఉదయం దాడి చేసి బి.రవి(40), ఎల్‌.అక్షయ్‌(24), బి.గోవింద్‌సింగ్‌(43), పవన్‌ సింగ్‌ (53)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 10 డొమెస్టిక్‌ సిలిండర్లు, 27 కమర్షియల్‌ సిలిండర్లు, 78 చిన్న సిలిండర్లు సహా మొత్తం 115 సిలిండర్లతో పాటు రీ ఫిల్లర్స్‌ 10, వేయింగ్‌ మిషన్‌ను స్వాధీనం
చేసుకున్నారు. వీటిని పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేస్తామని, నిందితులపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ రవి తెలిపారు.

*కర్ణాటక లోని మంగళూరు లో గురువారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ దుకాణంలోకి కొందరు వ్యక్తులు చొరబడి, ఓ వ్యక్తిపై కర్రతోనూ, కత్తితోనూ దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దాడికి పాల్పడిన నలుగురు దుండగులు ముసుగులు ధరించి ఉండటం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. బాధితుని పరిస్థితి విషమంగా ఉంది.

* ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. టీడీపీ నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్‌ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు

*నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చోరీ కేసులో తమ కుమారుడిని మర్రిపాడు ఎస్‌ఐ తురకా వెంకటరమణ కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపించారు. గురువారం స్టేషన్‌కి రావాలని కబురు చేయడంతో, మళ్లీ కొడతారేమోనన్న భయంతో పురుగుల మందు తాగి తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. బాధితుల కథనం మేరకు… గుడిగుంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మమ్మ దంపతులు, వారి కుమారుడు గొట్టుపల్లి తిరుపతి(32) చుంచులూరు గ్రామంలోని ఓ పొలంలో కాపలాగా ఉంటున్నారు. గురువారం తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పదిరోజుల క్రితం అనంతసాగరం మండలానికి చెందిన ఆంజనేయరెడ్డి పొలం ఫెన్సింగ్‌ వైరును తన కొడుకు తీసుకువెళ్తుండగా, యజమాని పట్టుకొని మర్రిపాడు పోలీసులకు అప్పగించాడని, అప్పుడే తన కుమారుడు వారి వైరును వారికి ఇచ్చేశాడని మృతుడి తండ్రి తెలిపారు. అప్పటి నుంచి దివ్యాంగుడైన తన కుమారుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసు స్టేషన్‌లో ఉంచేవారని వివరించారు. కాగా, తిరుపతి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని దొంగతనాలు చేయొద్దని తండ్రి శ్రీనివాసులు తిట్టాడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

*మాధవరం పాల డిపో(Milk Depot) సమీపం బ్యాంకర్స్‌ కాలనీకి చెందిన యువరాజ్‌-స్నేహ (21) దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. మంగళవారం వీరు సిరువాపురి మురుగన్‌ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాధవరం రౌండ్‌ ఠానా సమీపంలో యూ టర్న్‌ తీసుకుంటున్న సమయంలో వెనుకగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో స్నేహ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా యువరాజ్‌, 11 నెలల చిన్నారి స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు(Police) కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

* కళ్లకుర్చి విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య(suicide) సంఘటన సృష్టించిన కలకలం సద్దుమణగక ముందే తిరువళ్లూరులో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు.