NRI-NRT

అమెరికా వీసా సులువుగా పొందాలంటే?.. ఇవి మార్గాలు..

అమెరికా వీసా సులువుగా పొందాలంటే?.. ఇవి మార్గాలు..

ఇటీవల అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్ధులకు, పర్యాటకులకు, ఇతర వృత్తుల వారికి వీసాలు లభించడం చాలా కష్టంగా ఉంది. ఈ నేపధ్యంలో సులువుగా వీసాలు పొందే మార్గాన్ని నిపుణులు సూచిస్తున్నారు.

***యూఎస్ఏ
*కొన్ని సంవత్సరాలుగా మనదేశ విద్యార్థులకు యు.ఎస్.ఎ. ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. ఏవో కొన్ని సంవత్సరాలు మినహా ఈ దేశం గరిష్ట సంఖ్యలో విద్యార్థులను ఆకర్షించగలుగుతోంది . కొవిడ్ తర్వాత అనేక కారణాల వల్ల వీసా స్లాట్లను పొందడం సవాలుగా మారింది . ప్రస్తుతం స్లాట్లు వచ్చే ఏడాదికి మాత్రమే ఉన్నాయి.

*యు.ఎస్ . ఎంబసీ , కాన్సులేట్లు వచ్చే 12 నెలల్లో దాదాపు 8 లక్షల వీసాలు జారీ చేసే లక్ష్యంతో ఉన్నాయి . సిబ్బంది కొరత , బడ్జెట్ , నియామకాలు మొదలైన సాధారణ సమస్యల కారణంగా కొవిడ్ సమయంలో కాన్సులేట్లు పూర్తి స్థాయిలో పనిచేయలేదు . HIB , H4 , LI , L2 వీసాల కోసం చాలా డ్రాబ్బాక్స్ స్లాట్లు సమ్మర్ అందుబాటులో లేవు . అవి ఓవర్ సబ్సైట్ అయ్యాయి . 2023 మధ్య నాటికి కాన్సులేట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయబోతున్నాయి.

*యు.ఎస్ . కాన్సులేట్లు FI అపాయింట్ మెంట్ల కేటాయింపు విషయంలో ఈ ఏడాది స్టూడెంట్ వీసా సీజన్ గత సంవత్సరం లాగా ఉండేలా విధానపరమైన మార్పు చేశాయి . గత సంవత్సరం కాన్సులేట్లు జూన్లో ప్లాట్లను తెరిచాయి . చాలామంది I విద్యార్థి దరఖాస్తుదారులకు ( తిరస్కరిస్తే ) రెండో ఇంటర్వ్యూ అవకాశం రాలేదు .

*ఈ సంవత్సరం FI వీసా స్లాట్లు జూన్లో తెరిచారు B1 / B2 స్లాట్లు సెప్టెంబర్ 2022 నుంచి ప్రతిరోజూ 500 స్లాట్లతో ఓపెన్ అవుతాయని భావిస్తున్నారు .

* వీసా స్లాట్ల ప్రస్తుత స్థితి దరఖాస్తుదారు F వీసా స్లాట్ పొందడానికి 2-3 వారాలు పడుతోంది . మొదటిసారి తిరస్కరించిన కేసుల ( F వీసాలు ) వీసా స్లాట్లు ఆగస్టు 2022 లో ఓపెన్ అయ్యాయి. యూఎస్కి ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయడం అంటే మీలు వీసా స్టాంపింగ్ పొందడానికి అపాయింట్మెంట్ పొందవచ్చని కాదు. కాన్సులేట్లు పరిమిత అపాయింట్మెంట్లతో ఇప్పటికీ పరిమిత విధానంలోనే పనిచేస్తున్నాయి. H1B వీసాల సమీక్ష విధానం మారి దాదాపు 1-6 నెలల ప్రాసెసింగ్ సమయం తగ్గడానికి దారితీసింది యూఎస్ ఎంబసీ డ్రాప్ బాక్స్ స్టాంపింగ్ కోసం 2 నుంచి 4 వారాల ప్రాసెసింగ్ సమయాన్ని తీసుకుంటోంది .

**** ఏం చేయవచ్చు ?
మీరు స్ప్రింగ్ ఇన్టేక్ యూఎస్ లో నమోదు చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వీటిని పాటించండి .
*కోర్సు ఫీజు చెల్లింపు పద్ధతి మొదలైన వాటి ఆధారంగా వివిధ విశ్వవిద్యాలయాలను ఎంచుకుని వెంటనే మీ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి. *విశ్వవిద్యాలయాలు IELTS , TOEFL , GRE , GMAT , SAT , ACT , PE , DET మొదలైన పరీక్షల స్కోర్లు అడుగుతాయి . వెంటనే సంబంధిత పరీక్షకు సిద్ధమవ్వండి .

* అకడమిక్ రెజ్యూమె / సీవీ , అకడమిక్ ట్రాన్స్క్రిప్టు , ఆంగ్ల భాషా ప్రావీణ్య సర్టిఫికెట్ , SAT / GMAT / ACT / GRE స్కోర్లు , స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ( ఎస్ఓపీ ) , సిఫార్సు లేఖ మొదలైన పత్రాలతో విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోండి .

* విశ్వవిద్యాలయం నుంచి అంగీకార పత్రం వచ్చాక పాస్పోర్ట్ , ఐడీ ప్రూఫ్ , దరఖాస్తు రుసుము చెల్లింపు రసీదు . ఫోటో మొదలైన పత్రాలతో FI- విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు .

* వెంటనే దరఖాస్తు చేసుకుని , ఐ 20 ని అక్టోబరులోగా ఆశించడం ఉత్తమం . దీనివల్ల మీ వీసా స్లాట్ను బుక్ చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది . స్ప్రింగ్ ఇన్క్ ను మిస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు .

* పాల్ ఇన్టిక్ మిస్ అయిన విద్యార్థులు కూడా స్ప్రింగ్ ఇన్టేక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . పరిమిత పోటీతో , అవాంతరాలు లేని విధంగా విదేశీ విద్యాభ్యాసాన్ని మార్చుకునే అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు . అగ్ర విశ్వవిద్యాలయాలు స్ప్రింగ్ ఇన్టేక్లో తక్కువ కోర్సులే అందిస్తాయని చాలామంది విద్యార్థుల నమ్మిక . కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి కోర్సు కరిక్యులమ్ అన్ని ఇన్టివ్లల కోసం రూపొందిస్తారనేది !

** ఇవి గమనించండి !
1.అన్ని అడ్డంకులనూ దృష్టిలో ఉంచుకుని , వీలైనంత ముందుగానే విదేశీ విద్యను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2. కనీసం ఏడాది ముందుగానే విదేశీ విద్యకు ప్రణాళికను ప్రారంభించండి.
3.వీసా కోసం కనీసం 3 నెలల ముందుగానే దరఖాస్తు చేయటం అవసరం.
4. ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీసాను ముందుగానే పొందివుండటం ఎల్లప్పుడూ మంచిది.
5.ముందుగానే మేల్కొంటే విమాన టిక్కెట్ ఛార్జీ ఆదా చేయవచ్చు. అడ్మిషన్ వాయిదా అవసరం ఉండదు కాబట్టి ముందస్తు చెల్లింపుపై వడ్డీని ఆదా చేయవచ్చు.
6.వీటితో పాటు- విశ్వవిద్యాలయంలో వసతిని ఎంచుకునే వీలుంటుంది. మనశ్శాంతితో విద్యాభ్యాసం ఆరంభించవచ్చు!