Devotional

దుబాయిలో బతుకమ్మ ఎత్తిన పాకిస్తానీ యువతి

దుబాయిలో బతుకమ్మ ఎత్తిన పాకిస్తానీ యువతి

దుబాయి… ఎక్కడో హైద్రాబాద్ నుండి 2500 కిలో మీటర్ల దూరంలో ఉన్నప్పటికి తెలంగాణ ఆర్ధిక,సామాజిక మరియు వ్యక్తిగత జీవన విధానంతో అనుసంధామైన నగరం. తెలంగాణ ప్రత్యెకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లెతో ప్రత్యక్ష మరియు పరోక్ష సంబంధం ఉన్న నగరం. అందుకె ప్రత్యెక తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ బయట విదేశాలలో అమెరికా, యూరోప్ కంటె కూడ ముందుగా తెలంగాణ ధూంధాం ద్వార తమ అకాంక్ష గళాన్ని గట్టిగా వినిపించిన నగరం దుబాయి.

అలాంటి దుబాయి నగరం గల్ఫ్ లో మోదటిసారిగా బతుకమ్మ వేడుకలకు 15 సంవత్సరాల క్రితం నాంది పలికింది. దుబాయిలోని తెలంగాణ ప్రవాసీయుల ప్రప్రధమ సంఘమైన గల్ఫ్ తెలంగాణ వెల్ఫర్ మరియు కల్చరల్ అసోసియెషన్ (జి.టి.డబ్ల్యూ.సి.ఏ) అనేక అవరోధాలను ఎదుర్కోంటూ మోక్కవోని మోండి ధైర్యంతో తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మలను నిర్వహించింది. ఆ రకంగా దుబాయిలో అంకూర్పణ జరిగిన జరిగిన బతుకమ్మ సంబురాలు నేడు ఒక కీలక ఘట్టంగా మారి అనేక సంఘాలు పోటిపడి చేసే స్ధాయికు చేరుకోన్నాయి.
4

గత మూడెళ్ళుగా కరోనా, ఆర్ధిక మాంధ్యమం కారణాన ఒకింత నిరాడంబరంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను మళ్ళి ఈ సారి నూతనోత్తేజంతో నిర్వహించారు. తెలంగాణ ప్రవాసీయులకు అనువుగా ఉండే విధంగా దుబాయి మరియు షార్జా నగరాలకు సమీప అందుబాటులో ఉన్న అల్ అహ్లీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జి.టి.డబ్ల్యూ.సి.ఏ నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గోదావరి నదీకు దిగువన ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుందర ఉపసాన నుండి మోదలు ఇటు గోదావరి ఎగువలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన పాలడుగు సబితా రెడ్డి వరకు వైవిధ్యభరితమైన సామాజిక నేపథ్యాల కూర్పులతో కూడుకోన్న మహిళమణులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి పరాయి దేశంలో తమ భాద్యతగా నిర్వహించిన పండుగ బతుకమ్మ. తాము పెరుస్తున్న బతకమ్మ పూలను చూసి ముచ్చటపడి తమకు తెలిసిన పాకిస్తానీ యువతి కూడ ఒకటి వచ్చి బతుకమ్మ ఆడిందని ఉపాసన చెప్పారు.

బతుకమ్మ ఒక వేడుకయె కాదు, తమ అస్ధిత్వానికి ప్రతీక అని రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ కు చెందిన జె. సౌమ్య రాణి చేసిన వ్యాఖ్యాతో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సుద్దాల విజేత ఏకీభవించారు. బతుకమ్మ అంటె ఇప్పుడు గౌరవంతో కూడుకొందని వరంగల్ నగరానికి చెందిన రేవూరి సబితా రెడ్డి అన్నారు. దుబాయి బతుకమ్మ సంబురాల నిర్వహణలో నాగమణి దామోర, విజేత, జ్యోతి, సబితా, ప్రియా, అవంతిక, భారతీ, శ్రీవాణి, ఉషా ప్రియాంక మరియు ఉపసాన కీలక పాత్ర వహించగా జి.టి.డబ్ల్యూ.సి.ఏ భాద్యులు జువ్వాడి శ్రీనివాసరావు, సలాఓద్దీన్, సామ్యూల్, కటుకం రవి, మల్లేశ్ లు ఇతర నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
2
www applebank com