DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

తూప్రాన్ కానిస్టేబుల్ పై గొడ్డలితో దాడి

మెదక్ జిల్లా తుప్రాన్
పట్టణంలో దారుణం చోటుచేసుకుంది వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆసిఫ్ ఇలియాస్ పై వాహనదారుడు గొడ్డలితో దాడి చేశాడు
నర్సాపూర్ రోడ్ మార్గంలో రోడ్డుపై తనిఖీలు నిర్వ హిస్తుండగ తమ యొక్క వాహనం కాగితాలు చూపెట్టమని అడగగా చూపించలేనందున తమ యొక్క వాహనం సిజ్ చేసి పోలీసులు స్టేషన్ కి తరలించగా వాహన దారుడు అరగంట లో తిరిగి వచ్చి గొడ్డలితో ఆసిఫ్ ఇలియాస్ తల పై దాడి చేయగా అక్కడే ఉన్నా పోలీసులు దగ్గరలో ఉన్నా ఆసుపత్రికి తరలించారు


దీపావళికి తుఫాన్‌..!
దిశపై నేడు, రేపట్లో స్పష్టత.!

విశాఖపట్నం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌పై స్పష్టత వచ్చింది. అయితే ఉత్తర కోస్తాలో ఈనెల 25న తీరం దాటుతుందా? లేదా దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌ వైపు వెళుతుందా?…అనేది తుఫాన్‌ తీవ్రతపై ఆధారపడి వుంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కోస్తా జిల్లాలకు దీపావళి రోజున ముసురు తప్పకపోవచ్చు. దక్షిణ అండమాన్‌ సముద్రంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి మొదట వాయుగుండంగా, తరువాత తుఫానుగా మారి పశ్చిమ మధ్య దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆ తరువాత దిశ మార్చుకుని ఉత్తర, ఉత్తర వాయువ్యంగా పయనించి ఈనెల 25న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని కొన్ని నమూనాలు చెబుతున్నాయి. అయితే కోస్తా తీరం వైపు వచ్చిన తరువాత దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌ వైపు వెళుతుందని కొన్ని నమూనాలు వివరిస్తున్నాయి. తుఫాన్‌ దిశపై మంగళ, బుధవారాల్లో మరింత స్పష్టత రావచ్చు. కాగా బంగాళాఖాతంలో తుఫ

ప్రకాశం జిల్లా

నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు

పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసేలా పోలీస్ అధికారులు కృషి చెయ్యాలి

నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోని ప్రజలకు మెరుగైన సేవలందించాలి

మహిళా పోలీసులు గ్రామల్లోని అసాంఘిక కార్యకలాపాల గురించి పై అధికారులకు తెలియచేసి వాటి కట్టడికి కృషి చెయ్యాలి

వార్షిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు రూరల్ సర్కిల్ లోని నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ గారు తనిఖీ చేసారు. ముందుగా స్టేషన్‌ ఆవరణాన్ని మరియు పోలీస్ క్వార్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు స్టేషన్ లోని వివిధ రూములను, వుమెన్ హెల్ప్ డిస్క్, క్రైమ్ మ్యాప్, వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను పరిశీలించారు.

యన్.జి పాడు పోలీసు స్టేషన్లకు సంబంధించిన గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసులు, దొంగతనాలు, అక్రమ ఇసుక, గుట్కా కేసులు, రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర కేసుల యొక్క సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రయల్ కేసుల ఫైళ్లను, మరియు పలు రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ దశలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసులు, క్లిష్టమైన గ్రేవ్ కేసుల్లో పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ గారు దిశానిర్దేశం చేసారు.

పోలీసు స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి గురించి, ఎక్కువగా జరిగే నేరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాల కట్టడి, 174 CrPC కేసులు, మిస్సింగ్ కేసులు, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రౌడీ షీటర్ల కదలికలు, పాత నేరస్ధులపై మరియు వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో ఏదైనా అనుకోని ఘటనలు జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం ఎస్పీ గారు సచివాలయ మహిళా పోలీసులతో మాట్లాడి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో సివిల్ వివాదాలు, చెడు నడత కలిగిన వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారమును గూగుల్ ఫార్మ్స్ లో పొందుపర్చాలని, ప్రజలకు సైబర్ మోసాలు, ఫేక్ లోన్ యాప్ లుపై అవగాహన కల్పించాలని, కళాశాలల విద్యార్థులకు ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, దిశా యాప్ పై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో మహిళలకు ఏదైనా సమస్య ఉంటే మహిళా పోలీసులు ఉన్నారనే భరోసా కల్పించేలా స్పందించాలని సూచించారు.

పోలీసు స్టేషన్ల లోని సిబ్బందితో మాట్లాడుతూ వారి పని తీరు, వారు ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ ఏటువంటి పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోని ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. స్టేషన్లో పనిచేసే సిబ్బందికి ఏదైనా సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

నాగులుప్పలపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను ఎస్పీ గారు ప్రారంభించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతోగానో దోహదపడుతాయని, సీసీ కెమెరాలు పోలీసులకు మూడో కన్నులా పనిచేస్తాయని అన్నారు. అనంతరం ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి సిబ్బంది అందరూ స్టేషన్ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు వెంట ఒంగోలు డిఎస్పీ యు. నాగరాజు, DSB DSP బి.మరియదాసు, ఒంగోలు రూరల్ సిఐ ఆర్. రాంబాబు, నాగులుప్పలపాడు ఎస్సై రమణయ్య, ఎస్పీ సిసి నారాయణ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.

తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో్ కొడతానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నుంచి వెనువెంటనే ఎదురు దాడి మొదలైపోయింది. ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు…పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ… పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ వ్యాఖ్యలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పవన్ తాజా వ్యాఖ్యలతో దత్తపుత్రుడి ముసుగు తొలగిందని నాని వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి ముసుగు వెనుక చంద్రబాబు ఉన్నాడని తేలిపోయిందని కూడా నాని అన్నారు.

పవన్ ప్రసంగం ముగిసినంతనే మంగళవారం మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూనే… పవన్ పై ఎదురు దాడికి దిగారు. దత్తపుత్రుడిగా మారిన పవన్… సన్నాసిన్నర సన్నాసిగా కూడా మారిపోయారని ఆయన సెటైర్లు సంధించారు. తన పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేయమని చెప్పే నేతను ప్యాకేజీ స్టార్ అనకుండా ఇంకేమంటారని నాని అన్నారు. సోదరా అంటేనే పవన్ కడుపు రగిలిపోతే… వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే తమకు కడుపు మండదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను పట్టుకుని నా కొడకల్లారా అనేంత బలుపు పవన్ ది అని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కు అంత బలుపెందుకు? అని నిలదీశారు.

తాను ఇంతవరకు పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అనలేదన్న నాని… తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ మాట అన్నారన్నారు. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపితే… పవన్ ను ప్యాకేజీ స్టార్ అన్న అందరి తరఫున తానే క్షమాపణ చెబుతానన్నారు. ఇవాల్టీ నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని పవన్ ప్రకటించారంటే…జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టెుకున్నట్లేన్నారు. అందులో భాగంగా బీజేపీకి కూడా గుడ్ బై చెప్పేశారని నాని అన్నారు


విశాఖ: గాజువాక.

డబ్బులు ఇచ్చుకో…పథకం తీసుకో….

గాజువాక 73 వార్డు సింహగిరి కాలనీ సచివాలయం 1086436 లో అవినీతి భాగోతం.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరనివ్వకుండా పక్కదారి పట్టిస్తున్న సచివాలయ వెల్ఫేర్ సూర్య, వాలంటరీ వెంకట రత్నం(C2) , చంద్రిక (C16).

ఏదైనా పథకం పేద ప్రజలకు అందాలంటే మా గల్లా నింపితేనే ఆ పథకం పేద ప్రజలకు అందుతుంది లేకపోతే మీరు ఆ పథకానికి అనర్హులు అని చెప్పి ఆ పథకం పేద ప్రజలు అందకుండా చేయడం ఆ సచివాలయ వెల్ఫేర్ ,వాలంటరీల నైజం.

పథకాలు అందవలసిన బాధితులు ఎన్నిసార్లు ఆ వాలంటరీల దగ్గర మొరపెట్టుకున్న సచివాలయం చుట్టూ తిరిగిన మీరు వెళ్లిన ఏ పని జరగదు. మేము చెప్తేనే సచివాలయంలో ఆ పని చేస్తారు అని చెప్పి బాధితులని తన సొంత మనసులతో బెదిరించడం సచివాలయ వెల్ఫేర్ మరియు సచివాలయ వాలంటరీల నైజాం.

బాధితులందరూ వార్డు కార్పొరేటర్ తో సమస్యల గురించి చెప్పడంతో ఆకస్మిక తనకి చేపట్టిన వార్డు కార్పెటర్ భూపతి రాజు సుజాత.

జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్నం.

హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తపరిచిన జిల్లా ఎస్పీ.

గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ 1081 M.D. కుటుంబరావు విధి నిర్వహణలో భాగంగా రహదారి ప్రమాదానికి గురై అకస్మాత్తుగా మరణించడంతో ఆయన మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ పి.జాషువా ఐపీఎస్ గారు తీవ్ర విచారం వ్యక్తపరిచి, కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబానికి కృష్ణాజిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈరోజు విధులకు హాజరయ్యే క్రమంలో ఈరోజు ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుడివాడ కోతి బొమ్మ సెంటర్ నందు వెనుక నుండి ఒక్కసారిగా లారీ ఢీ కొనడంతో, రోడ్డుపై కుప్పకూలిపోయాడు. తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారిని అక్కడే ఉన్న స్థానికులు దగ్గర్లోని వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న కుటుంబరావు గారు మరణించారు. సకాలంలో వైద్యం అందినప్పటికీ హెడ్ కానిస్టేబుల్ గారిని కాపాడుకోలేకపోయామని ఆయన మృతి పోలీస్ శాఖకు తీరనిలోటని, ఆయన కుటుంబానికి అండగా పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఎస్పీ గారు తెలిపారు

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు

ఇంకోసారి ఇలాంటివి అంటే చెప్పుతో కొడతా

ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతాను..

గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశాను.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించా..

రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టాను-పవన్ కళ్యాణ్

Nara Lokesh: కడప జైల్లో ప్రొద్దుటూరు తెదేపా ఇన్ ఛార్జ్ ను పరామర్మించిన నారా లోకేశ్

కడప: ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు.కడప కేంద్ర కారాగారం (సెంట్రల్‌ జైలు)లో ఉన్న ఆయన్ను ములాఖత్‌ ద్వారా వెళ్లి కలిశారు. గత కొద్దిరోజులుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (వైకాపా), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ప్రవీణ్‌ను కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు లోకేశ్ కడప వచ్చారు.ఎయిర్‌పోర్టుకు చేరుకున్న లోకేశ్‌కు తెదేపా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో జిల్లా ముఖ్య నేతలతో కొద్దిసేపు ఆయన సమావేశమయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించారు. అనంతరం ఎయిర్‌పోర్టు వెలుపల తెదేపా కార్యకర్తలు గజమాలతో లోకేశ్‌ను సత్కరించారు.

ములాఖత్‌కు 18 మందికి అనుమతి..

కడప సెంట్రల్‌ జైలులో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో ములాఖత్‌కు 18 మందికి పోలీసులు అనుమతించారు. లోకేశ్‌తో పాటు మరో 17 మంది నేతలను మాత్రమే ఆయన్ను కలిసేందుకు పంపారు. జిల్లాలో లోకేశ్‌ పర్యటన, ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో ములాఖత్‌ నేపథ్యంలో తెదేపా నేతలకు కడప పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిన్న ఘటన జరిగినా జిల్లా తెదేపా నేతలదే బాధ్యతంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.