Movies

రష్మిక చిన్ననాటి కష్టాలు

రష్మిక చిన్ననాటి కష్టాలు

ప్రస్తుతం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఒక్కో సినిమాకు మూడుకోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నది. తండ్రి నిర్వహించే కుటుంబ వ్యాపారాలు కూడా వృద్ధిలోకి రావడంతో ఆర్థికంగా ఎలాంటి చింత లేని జీవితాన్ని గడుపుతున్నది. అయితే తమది స్థితిమంతుల కుటుంబమే అయినా బాల్యంలోని ఓ దశలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నాన్న చేస్తున్న వ్యాపారాలు ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోవడంతో రెండుమూడేళ్లు ఇబ్బందులు పడ్డాం. కిరాయి కట్టే డబ్బులు లేకపోవడంతో ఆర్నెళ్లకోసారి ఇళ్లు మారేవాళ్లం. ఇష్టమైన వస్తువుల్ని కొనివ్వమని నాన్నను అడిగే ధైర్యం ఉండేది కాదు. అయితే ఆ పరిస్థితుల్ని తొందరగానే అధిగమించాం. వ్యాపారాలు కలిసి రావడంతో కాలేజీ రోజులకు వచ్చే సరికి నాన్న ఆర్థికంగా గొప్ప స్థాయికి చేరుకున్నారు’ అని చెప్పింది.