DailyDose

ఎలోన్ మస్క్ 13 కిలోల బరువు తగ్గడానికి కారణం ఇదే..!

ఎలోన్ మస్క్ 13 కిలోల బరువు తగ్గడానికి కారణం ఇదే..!

ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు, ఇంటర్నెట్‌కు ఇష్టమైన వ్యక్తి కూడా. ఈ బిలియనీర్ ఏది చేసినా, ఏది చెప్పినా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుంది, ముఖ్యంగా ట్విట్టర్‌పైన పూర్తి అధికారం గల వ్యక్తి. 51 ఏళ్ల వ్యాపార మేధావి శరీరాకృతి విషయానికి వస్తే చాలా స్పష్టమైన మార్పులే కనిపించాయి. మస్క్ తన బరువును తగ్గించే పనిలో పడ్డాడు. దాదాపు ఇప్పటివరకు 13 కిలోల బరువు తగ్గాడు.

తన శరీరం గురించిన వస్తున్న మీమ్‌లను గురించి ఎలోన్ ఆలోచించాడు.. వాటిని ప్రేరణగా తీసుకున్నాడు. మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఒక సమయంలో తన కొడుకు బరువును గురించి విమర్శించాడు. బరువు తగ్గడానికి డైట్ మాత్రలు తీసుకోవాలని సలహా కూడా ఇచ్చాడు. అసలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్న మస్క్ ఈ మధ్య కాలంలో తను బరువు తగ్గిన విషయాన్ని ట్విట్ ద్వారా తెలియజేసాడు. టెస్లా, స్పేస్‌తో సహా పలు కంపెనీలను నడుపుతున్న బిజీ రోజువారీ షెడ్యూల్‌లో మస్క్ తన ఫిట్‌నెస్ ప్లాన్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గడం చాలామందిలో ధైర్యాన్ని నింపింది. వెయిట్ లాస్ కి సంబంధించిన రెండు ఫోటోలను మాస్క్ పోస్ట్ చేసాడు. ఇంత తొందరగా బరువు ఎలా తగ్గారనే ప్రశ్నకు మాస్క్ ఆనందంగానే జవాబు చెప్పాడు.

ఓజెంపిక్ అనే ఔషధం, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి, ఆహారం, వ్యాయామంతో పాటుగా ఉపయోగపడుతుంది. ఇది ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని ద్వారా బరువు తగ్గడం అనేది సులువు.గుండె సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం టైప్ 1 మధుమేహం, డయాబెటిక్ కీటోయాసిడోసిస్ చికిత్సకు దీనిని ఉపయోగించరు.

బరువు తగ్గడానికి ఓజెంపిక్
ఓజెంపిక్ ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా, ఈ మందు వాడే మధుమేహంతో బాధపడుతున్న చాలా మంది బరువు తగ్గుతారు. వైద్యుడు సూచించిన విధంగా మాత్రమే Ozempic ను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. బరువు నిర్వహణ కోసం ఓజెంపిక్‌ని ఉపయోగించడం గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది