Movies

24న మూవీ లాంచ్ అంటే అన్నారు కానీ మాస్టారు ఆ ఊహ ఎంత బాగుందో

24న మూవీ లాంచ్ అంటే అన్నారు కానీ మాస్టారు ఆ ఊహ ఎంత బాగుందో

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30
గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తే, అమిగోస్ ప్రీరిలీజ్ఈవెంట్ ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే భార్యల కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని దర్శకులని ఇబ్బంది పెట్టకండి అంటూ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి
ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. ఇంతకముందు అయితే రెండు రోజులకి ఒకసారి ట్విట్టర్ లో అప్డేట్ కావాలి అని ట్రెండ్ చేసే వాళ్లు.

ఒక ట్రెండ్ చెయ్యడం ఇంత ఈజీనా అనిపించే రేంజులో ఎన్టీఆర్ ఫాన్స్ ట్వీట్స్ చేసే వాళ్లు. ఈ మూవీ హీరోయిన్ ఎవరు? పూజా కార్యక్రమాలు ఎప్పుడు? ఆ హీరోయిన్ వద్దు మాకు ఈ హీరోయిన్ మాత్రమే కావాలి. కొరటాల మావా బ్రో నువ్వు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వు.… ఇలా రకరకాల కారణాలతో ఎన్టీఆర్ 30 హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఫాన్స్ ట్రెండ్ సృష్టించే వాళ్లు.
అమిగోన్ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి ఇలాంటివి పెద్దగా కనిపించట్లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ 30 గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 మూవీ అఫీషియల్ గా గ్రాండ్ లాంచ్ అవనుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరగనుందట. మరి ఈ మాట నిజమా లేక రూమర్ మాత్రమేనా అనేది తెలియాలి అంటే ఫెబ్ 24 వరకూ ఆగాల్సిందే.