Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *21-02-2023✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఏదైనా రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, దాన్ని తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. మీకు పాత స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు వ్యాపార పనుల్లో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మీరు ఏదైనా చట్టపరమైన విషయాల్లో చిక్కుకుంటే.. మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా పనికి సంబంధంచి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే జాగ్రత్తగా చేయాలి. మరోవైపు ఈరోజు మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి లేదా ఇతర పార్టీలకు వెళ్లొచ్చు
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల సామాజిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించొచ్చు. మరోవైపు ఈరోజు పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీకు అత్తమామల విషయంలో ఏదైనా వివాదాలు ఉంటే, ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక పనులపైనా మీకు ఆసక్తి పెరుగుతుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారిలో వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో నెలకొన్న సమస్యలు ముగిసిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపపడి పని చేస్తారు. దానికి తగ్గ ప్రయోజనాలను కూడా పొందుతారు. వ్యాపారులకు ఈరోజు మంచి పురోగతి లభిస్తుంది
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని కారణాల వల్ల నిరాశకు గురవుతారు. అయితే క్రమంగా మీ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు కచ్చితంగా ఉపశమనం పొందుతారు. ఈరోజు మీరు తల్లిదండ్రుల నుంచి సహకారం, ఆశీర్వాదం పొందుతారు. దీని వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు చాలా పనులను సులభంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి శారీరక నొప్పి కారణంగా కొంత ఆందోళన ఉండొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో శత్రువుల కారణంగా ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు పూర్తి లాభాలను పొందే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా రంగంలో కొత్త పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. దీంతో మీరు మంచి లాభాలను పొందుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారిలో వ్యాపారులు చాలా కష్టపడాలి. కొన్ని కారణాల వల్ల మీ మనసులో కొంత గందరగోళం ఏర్పడుతుంది. మీరు నిరాశకు గురవుతారు. ఏదైనా న్యాయపరమైన చర్చ జరుగుతుంటే, అందులో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీ తల్లి ఆరోగ్యం కోసం డబ్బులను ఖర్చు చేయొచ్చు. మరోవైపు ఈరోజు ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు మతపరమైన పనుల్లో శ్రద్ధగా పని చేయడం వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకుంటారు. సాయంత్రం వేళ కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తినడం, తాగడం వంటి వాటిలో సంయమనం పాటించాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు కుటుంబం, పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు అత్తమామల నుంచి గౌరవం పొందుతారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతతో చదవాలి. మరోవైపు ఏదైనా ఆస్తి విషయంలో తోబుట్టువులతో వివాదం ఏర్పడితే, పెద్దల ద్వారా పరిష్కరించబడుతుంది. ఈరోజు ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొన్ని విలువైన వస్తువులు బహుమతిగా రావొచ్చు.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు తమ సామర్థ్యం, నైపుణ్యంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలరు. ఈరోజు మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, అది కూడా మెరుగువుతుంది. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఈరోజు అవసరమైన మేరకు మాత్రమే అప్పు తీసుకోవాలి. లేదంటే నష్టపోవాల్సి రావొచ్చు. ఉద్యోగులు ఈరోజు ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణం చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (21-02-2023)

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని పనుల నిమిత్తం మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. చిన్నారికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే, ఈరోజు పరిష్కారమవుతుంది. పని ప్రదేశంలో గౌరవం పొందడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. మీ సామాజిక సర్కిల్ కూడా పెరుగుతుంది. ఈరోజు రాత్రి మీ కుటుంబం, ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు.
🦈🦈🦈🦈🦈🦈🦈