Politics

జమ్మలమడుగు నుంచి భారతి పోటీ చేస్తారా?

జమ్మలమడుగు నుంచి భారతి పోటీ చేస్తారా?

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికల నాటికి పులివెందులతోపాటు జమ్మలమడుగును కూడా వైసీపీ కోటగా మార్చే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.అందులో భాగంగానే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి భారతి ఎన్నికల రేసులోకి దిగుతున్నారు.
కడప జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఉక్కు కర్మాగారం జమ్మలమడుగులో కూడా రానుంది. జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లిలో ఉక్కు కర్మాగారానికి జగన్ శంకుస్థాపన చేశారు.ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో కూడా విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
అభివృద్ధి పథకాలను పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని తన కుటుంబానికి కంచుకోటగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థికి గట్టి ప్రత్యర్థిగా భారతిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. వ‌చ్చేసారి నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌సుబ్బా రెడ్డి కి ఎమ్మెల్సీ సీటు ఇచ్చీజ‌గ‌న్ అసమ్మతిని త‌గ్గించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.