Movies

ఘనంగా ఆస్కార్స్ వేడుకలు.. ఏ ఓటీటీ, టీవీ ఛానెళ్లలో చూడొచ్చో తెలుసా?

ఘనంగా ఆస్కార్స్ వేడుకలు.. ఏ ఓటీటీ, టీవీ ఛానెళ్లలో చూడొచ్చో తెలుసా?

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా సినీ ప్రముఖులు, క్రిటిక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో రౌద్రం రణం రుధిరం సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటిగిరీలో నామినేషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని గంటల్లో అత్యంత వైభవంగా ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ఇండియాలో, ఎక్కడ చూడొచ్చో ఓ లుక్కు వేద్దామా!

దేశ వ్యాప్తంగా ప్రజలు, సినీ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా సాగనున్న ఆస్కార్స్ అవార్డ్స్ (95th Academy Awards)కు సర్వం సిద్ధమైంది. తెలుగు లెజండరీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకు అతి దగ్గరలో ఉంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట (Natu Natu Song)బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్ 2023కి నామినేట్ అయింది తెలిసిన విషయమే.

మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 95వ అకాడమీ అవార్డ్స్ 2023 (Oscars 2023) కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరగనుంది. వైభవంగా నిర్వహించనున్న ఈ వేడుకలకు హాలీవుడ్ స్టార్ జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel) మూడోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే నాటు నాటు పాట కోసం భారతీయులతో పాటు వెస్టర్న్ ఆడియెన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆస్కార్స్ వేడుకలను పలు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ తో పాటు టెలివిజన్ ఛానెల్స్ ప్రసారం చేయనున్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) వేదికగా ఈ ఆస్కార్స్ 2023 వేడుకలను చూడొచ్చు. ఇక టెలివిజన్ ఛానెల్ విషయానికొస్తే.. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ ప్రీమియర్ HD, స్టార్ వన్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ ఉత్సవ్, ఫాక్స్, ఫాక్స్ క్రైమ్, ఎఫ్ఎక్స్, విజయ్ లో ప్రసారం చేయనున్నారు. మార్చి 12న ఈ వేడుకలు జరగనుండగా.. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం అంటే మార్చి 13న ఉదయం 5:30 నుంచి ఆస్కార్స్ ఈవెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే RRR టీమ్ తోపాటు హాలీవుడ్ నుంచి అనేక మంది ప్రముఖులు ఈ ఆస్కార్ వేడుకల్లో భాగంగా రెడ్ కార్పెట్ పై నడుస్తారు. ఇక ఈ వేడుకల్లో ఎమ్ఎమ్ కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్న విషయం తెలిసిందే.