NRI-NRT

అమెరికా : సైన్స్ లో అద్భుత ప్రతిభ.. భారత సంతతి బాలుడికి 2.50 లక్షల డాలర్ల బహుమతి

అమెరికా : సైన్స్  లో  అద్భుత ప్రతిభ.. భారత సంతతి బాలుడికి 2.50 లక్షల డాలర్ల  బహుమతి

వ్యాధులను త్వరితగతిన గుర్తించడంలో సహాయపడే ఆర్ఎన్ఏ( RNA ) అణువుల నిర్మాణాన్ని అంచనా వేయడానికి కంప్యూటర్ మోడల్‌ను అభివృద్ధి చేసినందుకు భారత సంతతి యువకుడు 2,50,000 డాలర్లను గెలుచుకున్నాడు.ఈ మేరకు రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ పోటీలో 17 ఏళ్ల నీల్ మౌద్గల్‌( Neel Moudgal )ను మంగళవారం విజేతగా ప్రకటించారు.

అలాగే భారత సంతతికే చెందిన అంబికా గ్రోవర్ (17) 80,000 డాలర్లు.సిద్ధు పచ్చిపాల (18)కు 50,000 డాలర్ల అవార్డులను గెలుచుకున్నారు.

సైన్స్ టాలెంట్ సెర్చ్‌లో( Science Talent Competition ) దాదాపు 2000 మంది హైస్కూల్ విద్యార్ధులు పోటీపడగా.చివరి రౌండ్ నాటికి 40 మంది ఎంపికయ్యారు.రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ ఈ పోటీని స్పాన్సర్ చేసింది.సొసైటీ ఫర్ సైన్స్ ప్రకారం మౌద్గల్.

కంప్యూటేషనల్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రాజెక్ట్‌తో క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వంటి వ్యాధుల కోసం నోవల్ డయాగ్నోస్టిక్స్ , ఔషధాల అభివృద్ధిని సులభతరం చేయడానికి ఆర్ఎన్ఏ అణువుల నిర్మాణాన్ని వేగంగా , అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయగలదని రుజువు చేశాడు.

రక్తపు గడ్డలను విచ్ఛిన్నం చేయడానికి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడం ద్వారా స్ట్రోక్ బాధితులకు చికిత్స చేయడానికి ఇంజెక్ట్ చేయగల మైక్రో బబుల్‌ను గ్రోవర్ అనే విద్యార్ధి అభివృద్ధి చేశాడు.మరో విద్యార్ధి సిద్ధు పచ్చిపాల విషయానికి వస్తే.ఒక రోగి ఆత్మహత్యకు దారితీసే పరిస్ధితులను అంచనా వేసే మెషిన్ లెర్నింగ్‌ను రూపొందించాడు.

రోగి జర్నల్ ఎంట్రీలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యకు దారి తీసే పరిస్ధితులు పరస్పర సంబంధాలను కలిగి వుంటాయని సిద్ధూ వివరణాత్మకంగా తెలిపాడు.ఈ క్రమంలో సిద్ధూకి సీబోర్గ్ అవార్డ్ లభించింది.

ఇదిలావుండగా.కొద్దిరోజుల క్రితం వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతికి చెందిన బాలిక పెరియనాయగమ్ నటాషా.వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 శాతం స్కోర్ చేసి ఆమె ఈ అరుదైన ఘనతను అందుకుంది.అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో నటాషా ఈ ఘనత సాధించింది.