Devotional

తిరుమలలో ఉగాది శోభ. 10 టన్నుల పుష్పాలు వినియోగం. చిత్రాలు..

తిరుమలలో ఉగాది శోభ.  10 టన్నుల పుష్పాలు వినియోగం. చిత్రాలు..

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం సందర్భంగా గుడితో పాటు పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.


Ugadi Flower Decoration
At Tirumala Sri Vari Temple 🙏🏻


దాదాపు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని 60 వేల కట్ ఫ్లవర్లతో అలంకరించారు. ఎండుకొబ్బరితో దశావతారాలను ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేశారు. కర్బూజా కాయ లతో ‘శ్రీనివాసకల్యాణం’ ఘట్టాలను కూడా అమర్చారు. ప్రత్యేకంగా క్రేన్ సహాయంతో ‘గజేంద్రమోక్షం’ సెట్టింగ్ను గాల్లోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆలయంతో పాటు, మహద్వారం గేటును మామిడి, చెరకు, అరటి ఆకులతో అలంకరించారు. ఆలయం వెలుపల మూడు యుగాలకు సంబంధించిన సెట్టిం గులు, పుష్పాలతో తయారు చేసిన ఏనుగులు, నెమలి ప్రతిమలను ఏర్పాటు చేశారు. పుణేకు చెందిన గోవింద, బెంగళూరుకు చెందిన అరుణ్, తిరుపూర్కు చెందిన శేఖర్ విరాళా లతో ఈ అలంకరణలను టీటీడీ చేపట్టింది.