Movies

తారక్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. ఎన్టీఆర్ 30లో ఆ బాలీవుడ్ స్టార్

తారక్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. ఎన్టీఆర్ 30లో ఆ బాలీవుడ్ స్టార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని విట్ నెస్ చేయాలంటే.. ఆ రేంజ్‌ విలనిజం ఉండాలనే అనుకున్నారు తారక్‌ ఫ్యాన్స్. అనుకోవడమే కాదు.. ఓ బిగ్ అండ్ పవర్‌ ఫుల్ విలన్‌ తారక్ అపోజిట్‌గా పడాలని కోరుకున్నారు.

ఎన్టీఆర్ 30 ఫిల్మ్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని విట్ నెస్ చేయాలంటే.. ఆ రేంజ్‌ విలనిజం ఉండాలనే అనుకున్నారు తారక్‌ ఫ్యాన్స్. అనుకోవడమే కాదు.. ఓ బిగ్ అండ్ పవర్‌ ఫుల్ విలన్‌ తారక్ అపోజిట్‌గా పడాలని కోరుకున్నారు. అప్పుడే భయపెట్టేటోడికే.. భయం రుచి తెలుస్తుందని ఎగ్జైట్‌ అయ్యారు. అయితే ఫ్యాన్స్ అలా అనుకున్నారో.. ఇలా ఎన్టీఆర్ 30 లో సైఫ్ అలీఖాన్‌ విలన్‌ అనే న్యూస్‌ బయటికి రావడంతో.. వీరందరూ ఫుల్ ఖుష్ అయ్యారు. సినిమా దద్దరిల్లిపోవడం ఖాయం అనుకున్నారు. ఇప్పుడు అదే కన్ఫామ్ అనే న్యూస్ వైరల్ అవుతోంది.

కొరటాల శివ డైరెక్షన్లో .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ను .. విలన్ గా అనుకున్నారు ఈ మూవీ మేకర్స్. అనుకోవడమే కాదు.. విలన్ రోల్ చేయాల్సిందిగా ఆయనను సంప్రదించారట. అయితే తారక్ సినిమాలో విలన్ గా చేయడానికి సైఫ్ ఒప్పుకున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. తారక్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సైఫ్ ను ఇప్పటికే విలన్‌గా ఉహించుకుని.. తమ హీరో ఎలివేషన్ ఓ రేంజ్‌ వెళ్లనుందని ప్రెడిక్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తారక్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా..