NRI-NRT

“TANA” కాశీలో అన్నదానం తో పాటు భారీగా జలదానం

“TANA” కాశీలో అన్నదానం తో పాటు భారీగా జలదానం

గంగా పుష్కరాల సందర్భంగా “తానా” ఆధ్వర్యంలో వారణాసి శివాల గాట్ లో ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరానికి యాత్రికుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఏడవ రోజు శుక్రవారం నాడు దాదాపు 900 మందికి పైగా యాత్రికులు అన్నదానానికి తరలివచ్చారు. అన్నదానం తో పాటు సాయంకాల సమయంలో ఇస్తున్న అల్పాహార దానానికి మంచి ఆదరణ లభిస్తుంది. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధులు లక్షలాది రూపాయల విరాళాలతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నందుకు పలువురు యాత్రికులు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు అన్నదాన శిబిరానికి హాజరై తమ ఆశీస్సులు అందిస్తున్నారు.


అయోధ్య రామ మందిర సమీపంలో గత మూడు సంవత్సరాల నుండి ప్రతినిత్యం యాత్రికులకు అన్నదానం చేస్తున్న ప్రముఖ పండితులు చల్లా శ్రీనివాస శాస్త్రి అయోధ్య నుండి శ్రీరామ పాదుకలతో అన్నదాన శిబిరం వద్దకు వచ్చి భోజనం స్వీకరించి ఆశీస్సులు అందజేశారు. కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి “తానా” తరపున 25 వేల మంచినీళ్ల సీసాలను దేవస్థానం అధికారులకు “తానా” ద్వారా అందజేశారు. పుష్కరాల సందర్భంగా “తానా” ద్వారా అందిస్తున్న సేవలను భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక సందేశం ద్వారా అభినందనలు అందజేశారు. మిగిలిన 5 రోజులు భారీ ఎత్తున అన్నదానం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు

వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ